News
News
X

బస్సుల్లోనే రండి- శ్రీవారి భక్తులకు పోలీసుల విజ్ఞప్తి!

Srivari Garuda Seva: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు పోలీసులు ముఖ్యమైన గమనిక చేశారు. తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతిలోనే వాహనాలను పార్క్ చేసి ఆర్టీసీ బస్సుల్లోనే రావాలన్నారు.

FOLLOW US: 

Srivari Garuda Seva: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అయితే అక్కడకు వచ్చే భక్తులకు(వాహనదారులకు) పోలీసులు ముఖ్యమైన గమనిక చేశారు. తిరుమల నందు వాహనాల పార్కింగ్ ప్రాంతాలన్నీ పూర్తిగా వాహనాలతో నిండినందున అలిపిరి టోల్గేట్ నుండి ప్రైవేట్ వాహనాలను నిలిపి వేశారు. తిరుమల శ్రీవారి గరుడ సేవ కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలన్నీ పూర్తిగా వాహనాలతో నిండిపోయాయి. అందువల్ల వాహనాల ద్వారా వచ్చు భక్తులు తిరుపతి నందు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో తమ వాహనాలను పార్కింగ్ చేసుకొని ప్రత్యామ్నాయంగా పబ్లింక్ ట్రాన్స్ పోర్ట్ అయిన ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఆలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమలకు కార్లు, వ్యాన్లు మరియు ఏ ఇతర ప్రైవేట్ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని చెబుతున్నారు. ఇది గమనించిన వాహనదారులంతా పోలీసులకు సహకరించాలని కోరారు. 

భారీగా తిరుమలకు చేరుకున్న భక్తులు, ఇసుక వేస్తే రాలనంత జనం!

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఐదవ రోజు తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడి పై అధిరోహించి భక్తులకు కటాక్షాన్నీ ప్రసాదించనున్నారు. గరుడ వాహనంపై కొలువైన శ్రీవారి దర్శనార్థం విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకి చేరుకున్నారు. ఎటు చూసిన భక్త జన సంద్రంగా ఏడుకొండలు కనిపిస్తున్నాయి. 2.5లక్షల మంది కూర్చొనే సామర్ధ్యం ఉన్న ఆలయ మాడవీధులలోని గ్యాలరీలు నిండుకుండలా మారాయి. తిరుమలకు ద్విచక్ర వాహనాల అనుమతి రద్దు చేసింది టీటీడీ. భక్తుల సౌకర్యార్థం నిత్యం అన్నపానీయాలు అందిస్తున్నారు.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

News Reels

తిరుమలలో గరుడ సేవ సందర్భంగా భక్తులకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు ఏడు ప్రాంతాల్లో హెల్స్ డెస్కులు ఏర్పాటు చేశారు. జీఎస్టీ టోల్ గేట్, సీఆర్వో, బాలాజీ బస్టాండ్, రాంభగీచా విశ్రాంతి గృహాలు, రాగిమాను సెంటర్, ఏటీసీ సర్కిల్, బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు. పీఏసీ-4 లో ఏర్పాటు చేసిన కమాన్ కమాండ్ సెంటర్ లో భక్తులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలను నివృత్తి చేస్తారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 10800425111111 అందుబాటులో ఉంచారు. భక్తులు సులువుగా మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు వీలుగా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివరాలను అందుబాటులో ఉంచారు. 

చైల్డ్ ట్యాగులు.. టీటీడీ భద్రతా విభాగం, పోలీసు విభాగం ఆధ్వర్యంలో పిల్లలకు చైల్డ్ ట్యాగ్ లు కడుతున్నారు. రద్దీ సమయంలో తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే ఈ ట్యాగ్ ల సాయంతో గుర్తించే అవకాశం ఉంది. అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించే గరుడ సేవను తలకించేందుకు నిమిషానికి రెండు ఆర్టీసీ సర్వీసులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చూసింది. ఎలక్ట్రిక్ బస్సులతో కలిపి తిరుమల ఘాట్ రోడ్డులో 5044 ట్రిప్పులతో 2 లక్షల మంది భక్తుల రాకపోకల టార్గెట్ గా ఆర్టీసీ సిద్ధం అయింది. ఈ మేరకు తిరుపతిలో 13 చోట్ల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 1వ తేదీన శనివారం గరుడ సేవ సందర్భంగా కొండ మీదకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని టీటీడీ పేర్కొంది. భక్తుల భద్రత దృష్ట్యా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల ఙాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. 

Published at : 01 Oct 2022 02:56 PM (IST) Tags: Tirumala News Srivari Garuda Seva TTD Police Announcement TTD RTC Buses TTD Special Buses

సంబంధిత కథనాలు

Padmavathi Ammavaru: వైభ‌వంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సారె ఊరేగింపు

Padmavathi Ammavaru: వైభ‌వంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సారె ఊరేగింపు

Tirumala News: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, దర్శనానికి భారీగా సమయం - నిన్నటి హుండీ ఆదాయం ఎంతంటే

Tirumala News: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, దర్శనానికి భారీగా సమయం - నిన్నటి హుండీ ఆదాయం ఎంతంటే

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి- త్వరలో  సీఎంఓ లోకి శ్రీలక్ష్మీ

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్