News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

RK Roja: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి ఆర్‌కే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు.

FOLLOW US: 
Share:

RK Roja: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి ఆర్‌కే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘టీడీపీలో నచ్చక బయటకొస్తే నన్ను టార్చర్‌ చేస్తున్నారు. లోకేష్‌ నీ తల్లి గురించి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా?,  నీకు ఫ్యామిలీ లేదా.. నీ ఫ్యామిలీని అంటే ఊరుకుంటావా?, దేశంలో మహిళలను గౌరవించండి అని చెబుతారు. మాజీ మంత్రి బండారు నన్ను నీచంగా, హేయంగా మాట్లాడారు. ఆయన చేసిన వాఖ్యలు పట్ల రాష్ట్ర మహిళలు చెప్పుతో కొడతారు’ అని అన్నారు. 

‘టీడీపీలో ఉన్న మహిళలు బండారు వ్యాఖ్యలు స్వాగతిస్తున్నారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరూ ఇలా మాట్లాడితే ఊరుకుంటారా?, మాట్లాడితే సినిమా వాళ్లు అంటారు. టీడీపీ  పెట్టిందే ఎన్టీఆర్  సినిమా ఆయన కాదా..  సినిమా వాళ్లు అంటే లోకువా? మంత్రి బండారు భార్యను అడుగుతున్నా.. ఆరోజే నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన రాదు. మాజీ మంత్రులు గంటా, అయ్యన్న చివరకు లోకేష్ ఎందుకు స్పందించలేదు. మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఊరుకుంటారా? మీ ఇంట్లో ఉన్న వారే ఆడ వాళ్లా... వైసీపీలో ఉన్న మహిళలు ఆడవాళ్లు కాదా? మహిళలు అందరూ ఆలోచన చేయండి.. లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు సపోర్ట్ చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

‘నేను పదేళ్లు టీడీపీలో పనిచేశా. మహిళ సాధికారతకు పాటుపడుతున్నాను. రాజకీయాల్లో 20 ఏళ్లుగా ఉన్నా. నేను రాజకీయంగా మంత్రిగా ఎదిగితే.. చూసి ఓర్వలేక వాఖ్యలు చేస్తున్నారు. జయసుధ, జయప్రద, దివ్య వాణి, శారదా నేను సినిమా రంగం నుంచి టీడీపీలో పనిచేశాం. అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఎందుకు ప్రచారానికి పిలిచారు? ఎన్టీఆర్‌కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారు. నేను సినిమాలో నటించే సమయంలో బ్రాహ్మణి చిన్న పిల్ల. లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ బ్రాహ్మణి చదువుతోంది. మా నాయకుడు జగన్‌ను అంటే మేము ఊరుకోవాలా?’ అంటూ ప్రశ్నించారు.

నన్ను తిట్టించడానికి అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ వంటి వారిని ఉసిగొల్పుతున్నారు. మేము ఖండిస్తే, మా క్యారెక్టర్‌లు తప్పుబడుతున్నారు. టీడీపీ అంటే దండు పాళ్యం పార్టీ, తెలుగు దొంగల పార్టీ. ఆడ పుట్టుకను అపహాస్యం చేసిన వ్యక్తి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి అని చెప్పిన వ్యక్తి బాలకృష్ణ. మహిళలు అంటే చిన్న చూపు చూసే టీడీపీలో మహిళలు అంటే ఎలా గౌరవం ఉంటుంది. ప్రతి మహిళకు మనస్సు ఉంటుంది, మీకు దమ్ము ఉంటే నా నియోజకవర్గంకు రండి, అభివృద్ధి చూడండి, దానిపై చర్చ చేయండి’  అంటూ సవాల్ విసిరారు.

‘నేను చెడ్డ దాన్ని అయితే ఎందుకు పార్టీలో పెట్టుకున్నారు? ఐరన్ లెగ్ అని నన్ను అవహేళన చేశారు. అందరినీ ఇలానే మాట్లాడుతారా? టీడీపీని వీడినప్పటి నుంచి ఇలానే నన్ను వేధిస్తున్నారు. మహిళలను ఆట వస్తువుగా, ప్రచారానికి వాడుకున్నారు. ఈ పరిస్థితి రేపు లోకేష్ భార్యకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? బ్లూ ఫిల్మ్ లో నటించింది అంటూ టార్చర్ చేస్తున్నారు. అసెంబ్లీలో సీడీలను చూపించారు. కానీ ఎప్పుడూ నిరూపించలేదు. మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది. మీరెవరు నా క్యారెక్టర్ ను జడ్జ్ చేయడానికిటీడీపీలో మహిళలకు గౌరవం లేదు. ఏ మహిళకైనా మనస్సు ఉంటుంది, చేయని తప్పు శిక్ష వేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Published at : 03 Oct 2023 09:50 PM (IST) Tags: MLA Roja Bandaru Satyanarayana Minister Roja

ఇవి కూడా చూడండి

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

Tirumala Children Missing: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం, పీఎస్ లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్

Tirumala Children Missing: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం, పీఎస్ లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్

Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్

Chandra Babu News: ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు- అనంతరం జిల్లా పర్యటనలు

Chandra Babu News: ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు- అనంతరం జిల్లా పర్యటనలు

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ