Minister Roja: నేను చదువుకున్న కాలేజీకి నేనే చీఫ్ గెస్ట్, కన్నీళ్లు ఆగలేదు - రోజా
RK Roja Comments: మంగళవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ఓ కార్యక్రమంకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.
RK Roja in Padmavathi Degree Collage: తాను చదువుకున్న పద్మావతి డిగ్రీ కాలేజీలో చీఫ్ గెస్ట్ గా, ఒక మంత్రి హోదాలో రావడం తన జీవితంలో మర్చిపోలేని రోజు అని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా తెలియజేశారు.. మంగళవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ఓ కార్యక్రమంకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తాను చదువుకున్న కళాశాలకి ముఖ్య అతిథిగా, అందులోనూ ఒక మంత్రిగా హాజరు కావడం తన జీవితంలో మరిచి పోలేని రోజుగా మిగిలి పోతుందని అన్నారు. మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇక్కడ జరిగిన సంఘటనలు, మేము చేసిన అల్లరి పనులు, మేము చేసిన చిలిపి పనులన్నీ గుర్తు కొచ్చాయన్నారు..
అలాంటి అల్లరి పనులు మేమేనా చేసిందని అనిపిస్తూ ఉంటాయని, నేను కళాశాలలో అడుగు పెట్టిన సందర్భంగా ఇక్కడ విద్యార్దులు నన్ను స్వాగతం పలికిన తీరు తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు. ఆడపిల్లల కేరింతలకి తన కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయని తెలిపారు. నేను ఎక్కడైతే స్టూడెంట్ గా చదువుకున్న కళాశాలకే మంత్రి హోదాలో వచ్చి మీరు కూడా ఇలా ఎదగాలని, టీచర్లు చెప్పినవన్ని విని లక్ష్యం వైపు అడుగులు వేయాలని చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. లక్ష్యం వైపు అడుగులు వేసే సమయంలో ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అరోపణలు చేసినా లక్ష్యం వైపు వెళ్ళాలని, మనం మనస్సాక్షికి, దేవుడికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలని అన్నారు. సక్సెస్ కి షార్ట్ కట్స్ ఉండవని, సక్సెస్ సాధిస్తేనే అత్తవారింట్లో అయినా, పుట్టింట్లోనైనా, సమాజంలోనైనా మహిళలకు గౌరవం లభిస్తుందని అన్నారు.
కాబట్టి ఆ సక్సెస్ మనం సాధించే వరకు నిద్ర పోకూడదని ఆడపిల్లలు అందరికీ చెప్పడం పిలుపునిచ్చానని అన్నారు.. ఆడపిల్లల కాలేజ్ కాబట్టి భయం, మొహమాటం ఉండవని, అందరూ కూడా స్వేచ్ఛగా, ధైర్యంగా ఉంటారని అన్నారు. అందుకే ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా ధైర్యంగా ఉంటారని, ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన అందరూ సొసైటీలో మంచి హోదాలో ఉన్నారని అన్నారు. అదే ఈ కాలేజీ స్పెషాలిటీ అని ఆమె తెలియజేశారు. తాను చదువుకున్న రోజుల్లో ఇక్కడి ఉపాధ్యాయులందరినీ గుర్తుకు చేసుకున్నానని, వారితో ఉన్న అనుబంధాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. తన కాలేజీలోకి మళ్లీ తాను అడుగు పెట్టిన శుభ సందర్భంలో రెట్టింపు ఉత్సాహంతో 2024లో ప్రతిపక్షాలకు దబిడి దిబిడి చేసి, మహిళా పక్షపాతంగా నిరూపిస్తానంటూ మంత్రి ఆర్‌కే.రోజా తెలిపారు.