అన్వేషించండి

RK Roja: నిజం గెలిస్తే జీవితాంతం చంద్రబాబు లోపలే - భువనేశ్వరి, లోకేశ్‌ కూడా జైలుకే: రోజా

నిజం గెలిస్తే జీవిత కాలం చంద్రబాబు జైలులో ఉంటారని, ఆయనతో పాటుగా, లోకేష్, భువనేశ్వరి కూడా జైల్ కు వెళ్ళే అవకాశం‌ ఉందని మంత్రి ఆర్కే రోజా అన్నారు.

నిజం గెలిస్తే జీవితకాలం చంద్రబాబు జైల్ లో ఉంటారని, ఆయనతో పాటుగా లోకేష్, భువనేశ్వరి కూడా జైల్ కి వెళ్ళే అవకాశం ఉందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. మంగళవారం‌ ఉదయం స్వామి వారి నైవేద్యం విరామ సమయంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె చంద్రబాబు, లోకేష్, నారా భువనేశ్వరి, పవన్ లపై తీవ్ర స్ధాయిలో‌ మండి పడ్డారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి అని గట్టిగా శ్రీ వేంకటేశ్వరస్వామి వద్ద పూజలు చేసినట్లు ఉన్నారని, మేము కూడా నిజం గెలవాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నామని ఆమె చెప్పారు.  

నిజం గెలిస్తే జీవిత కాలం చంద్రబాబు జైలులో ఉంటారని, ఆయనతో పాటుగా, లోకేష్, భువనేశ్వరి కూడా జైల్ కు వెళ్ళే అవకాశం‌ ఉందన్నారు. నిజంగా భువనేశ్వరికి నిజం గెలవాలని ఉంటే సీబీఐ ఎంక్వైరీ వేయాల‌ని కోరాలని,‌ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై సీబీఐ ఎంక్వైరీ వేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పై నిజం గెలవాలని సీబీఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్ లో ఎవరెవరు ఉన్నారో అందరూ బయట పడతారని, పవన్, లోకేష్ ను చూస్తే పాడుతా తీయగా సెలక్షన్ కి ఇటు ఒక బ్యాచ్, అటు ఒక బ్యాచ్ కూర్చుకుని సెలక్ట్ చేసినట్లు ఉందని, అర సున్న, అర సున్న కూర్చుని లోపన ఉన్న గుండు సున్న కోసం పార్టీ దిశానిర్దేశం చేయడం చూసి ప్రజలు ఫనీగా ఉందని అంటున్నారని ఎద్దేవా చేశారు.

పవన్, లోకేష్ ఇద్దరిని ప్రజలు ఓడించిన వాళ్ళని, మా దశ దిశానిర్దేశం ఎంటని ప్రజలు, పార్టీ దశ దిశానిర్దేశం ఎంటీ, ఇదేమి కర్మరా బాబు అని పార్టీ వాళ్ళు వాపోతున్నారని, 14 సంవత్సరాల్లో మ్యానిఫెస్టో ఇది చేసాం అని ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం టీడీపీకి లేదన్నారు. మొదటి సారి సీఎం ఐనా జగన్మోహన్ రెడ్డి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ 98 శాతం పూర్తి చేశారని చెప్పి‌న ఆమె, వై ఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గడప గడపకు వెళ్తున్నాంమని, వై ఏపీ నీడ్స్ చంద్రబాబు, వై ఏపీ నీడ్స్ పవన్ అని ప్రజల ముందుకు వెళ్ళే దమ్ము ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజలు మూతి పగల గొడతారని తెలుసుకున్న టీడీపీ, జనసేన ఏపీ హేట్స్ అనే ప్రోగ్రాంతో వెళ్తున్నారని, రాష్ట్రం మీద చిత్తశుద్ది లేదని, ప్రజలపై కూడా చిత్తశుద్ది లేదన్నారు.

యువగళం చేయలేక నారా లోకేష్ మంగళం పాడితే, ఫ్యాషన్ షోకు వెళ్ళే విధంగా భువనేశ్వరి నిజం గెలవాలి అంటూ బస్సు యాత్ర చేస్తున్నారని, ఈ యాత్ర నారా భువనేశ్వరి చేయగలరా అని అడిగారు. తండ్రిపైన చొప్పులు వేసినప్పుడే, తండ్రి పార్టీ లాకునప్పుడే, తండ్రి చావుకు కారణం ఐనప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉన్నారని, ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుండి భాధ వస్తుందని, వీళ్ళు రాష్ట్ర ప్రజల కోసం ఏం కష్ట పడతారంటూ ఆమె విమర్శించారు. భువనేశ్వరి కోరుకున్న నిజం గెలవాలి అనేది వాళ్ళ ఆయన లోపల ఉండాలని అనే విధంగా ఉందని, ఫైబర్ గ్రిడ్ లో గానీ, స్కిల్ డెవలప్మెంట్ లో గానీ, రాజధాని భుముల్లో గానీ, రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు లో గానీ ఎన్నో స్కాంలు చంద్రబాబు చేసాడని, ఇప్పటికైనా తిన్న డబ్బులు కక్కి, ప్రజలకు క్షమాపణ‌ కోరి బెయిల్ కి వేస్తే ప్రజల ఆశీస్సులతో చంద్రబాబుకు బెయిల్ వస్తుందని, అధికారంలో ఉన్నట్లుగా దౌర్జన్యం చేసి, వైసీపి‌పై బురద జల్లితే ప్రజలు ఊరుకోరని, 2024 జగనన్న ఒవన్స్ మోర్ అని‌ ప్రజలు ఫిక్స్ అయ్యారని ఏపీ పర్యటక‌ శాఖ మంత్రి ఆర్.కే.రోజా అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget