తిరుమలలో చిన్నారిపై దాడి చేసిన చిరుతను బంధించిన అటవీ అధికారులు- నడక మార్గంలో మరిన్ని జాగ్రత్తలు
పసివాడిపై చిరుత దాడి చేయడం సంచలనంగా మారింది. పటిష్టమైన భద్రత ఉన్న తిరులకు సమీపంలో ఈ ఘటన కలకలం రేపింది. అయితే 24 గంటల్లోనే ఆ క్రూరమృగాన్ని అధికారులు బంధించారు.
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులను భయపెట్టిన చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. అలిపిరి నడక మార్గంలో గురువారం రాత్రి ఐదేళ్ళ బాలుడు కౌశిక్ పై దాడి చేసిన తర్వాత పట్టుకోవాడనికి సీరియస్‌గా ట్రై చేశారు. శుక్రవారం రాత్రి బంధించారు.
తిరుమల దర్శానానికి లక్షల్లో భక్తులు వస్తుంటారు. వీళ్లలో చాలా మంది కాలినడకన ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని మొక్కులు తీర్చుకుంటారు. అలా వెళ్లిన ఓ ఫ్యామిలీ చిరుత కంట పడింది. తాతతో మిఠాయి కొనుక్కవడానికి వెళ్లిన బాలుడిని చిరుత నోట కరుచుకొని వెళ్లిపోయింది.
తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన భక్తులు, దుకాణదారులు, టీడీపీ సిబ్బంది చిరుత వెంట పరుగులు తీశారు. రాత్రి పూట కావడంతో టార్చ్‌లు, సెల్‌ఫోన్ వెలుగులో చిరుతను వెంబడించారు. అందరూ ఒకేసారి కేకలు వేయడం టార్చ్‌లైట్ వెలుతురుకు చిరుత భయపడి పసివాడిని వదిలేసింది.
తీవ్ర గాయాల పాలైన బాలుడు కౌశిక్‌ను ఆసుపత్రికి తరలించారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పరామర్శించి మెరుగైన చికిత్స అందిస్తామని కంగారు పడొద్దని కుటుంబాని ధైర్యం చెప్పారు.
తరచూ కాలినడక మార్గంలోకి వస్తూ జనాలను భయపెడుతున్న చిరుత బంధించాలని అటవీశాఖాధికారులు నిర్ణయించారు. దీంతో తరచూ చిరుత సంచరించే ప్రాంతాల్లో ఎర వేశారు. రెండు ప్రాంతాల్లో ప్రత్యేక బోన్లు పెట్టారు. దాదాపు ముప్పై కెమెరా ట్రాప్స్‌ను అటవీ శాఖా అధికారులు ఏర్పాటు చేశారు.
అనుకున్నట్టుగానే చిరుతు రాత్రి సమయంలో ఆ మార్గంలో వచ్చింది. అప్పటికే అధికారులు వేసిన బోనులో చిక్కుకుంది. రాత్రి 10.47 నిమిషాలకు చిరుత చిక్కిందని నిర్దారించుకున్న టీటీడీ అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. త్వరగానే చిరుత బోనుకు చిక్కడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
తల్లి, పిల్ల చిరుతలు ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్టు అటవీశాఖాధికారులు గుర్తించారు. ప్రస్తుతం పట్టుకున్నది పిల్ల చిరుతగా చెబుతున్నారు. ఈ చిరుత ఇంకా వేటకు అలవాటు పడలేదని చెబుతున్నారు.
కాలి నడక మార్గంలో భక్తులపై చిరుతు దాడి చేయడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పుుడ భక్తులను గుంపులు గుంపులుగా కొండపైకి పంపిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.