Anantapur: ఉమ్మడి అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుంటోందా?
AP Congress News: వైఎస్ కుమార్తె షర్మిల ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసినట్టు అయింది. జిల్లాలో నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
Anantapur Politics: ఉమ్మడి అనంతపురం జిల్లా లో కాంగ్రెస్ పార్టీకి పూర్వం నుంచే మంచిపట్టు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారింది. మరో రెండు దశాబ్దాలు అయిన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మనగడ సాధిస్తుంద లేదా అన్నది ప్రశ్న అంతకంగా మారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసినట్టు అయింది. జిల్లాలో నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టడం కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూరుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉండడంతో అధికార వైసీపీ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరి ఓట్లపై షర్మిల ప్రభావం ఉంటుంది.. ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుంది అంటూ ఎవరికి వారు లెక్కలేసుకుంటూ కూర్చున్నారు.
షర్మిల పర్యటన తర్వాత మరింత ఉత్సాహం
2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా సంపాదించుకోలేకపోయింది. పార్టీలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు సైతం ఓటమి చవిచూశారు. ప్రస్తుతం వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీకి బలం చేకూర్చినట్లు అయింది. పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అనంతపురం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఎంత ఉత్సాహం నెలకొంది. షర్మిల వచ్చి వెళ్లిన అనంతరం కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నేతలు చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈనెల 11వ తేదీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం లో వైఎస్ షర్మిల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిడబ్ల్యుసి మెంబర్ రఘువీరారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ పర్యవేక్షిస్తున్నారు.
కాంగ్రెస్ తో టచ్ లోకి వైసీపీ నేతలు
దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామన్నా కూడా ఎవరు పోటీ చేసేందుకు ముందుకు రాలేని పరిస్థితి ఉండేది. కానీ వైఎస్ షర్మిల బాధ్యతలు చెప్పట్టాక కాంగ్రెస్ పార్టీ లో టికెట్ సాధించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరి స్థాయిలో వారు ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. వైసీపీ పార్టీలో టికెట్లు రానివారు. వైసీపీపై అసంతృప్తితో ఉన్న నేతలు సైతం కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లోకి వచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీ అధిష్టానం నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు లేవని ఇప్పటికే స్పష్టం చేసింది. వీరిలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఉన్నారు. ముఖ్యంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా వైసీపీలో టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ప్రస్తుతం కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి వైసీపీ పార్టీలోనే ఉంటారా లేక పార్టీ మారతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ లేదు అని వైసీపీ అధిష్టానం తెలిపిన వెంటనే పార్టీ మారాలి అని ఆలోచన కూడా చేశారు. రానున్న ఎన్నికల్లో జొన్నలగడ్డ పద్మావతి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉంటారని రాజకీయంగా చర్చి నడుస్తోంది. ఏది ఏమైనాప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీలో ఉన్న అసమతి నేతలు, తెలుగుదేశం పార్టీలో టికెట్లు దక్కని నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.