By: ABP Desam | Updated at : 18 Jul 2023 07:01 PM (IST)
డిప్యూటీ సీఎం నారాయణ స్వామా మజాకా!
AP Deputy CM Narayana Swamy skips Gadapa Gadapaku program: ఏపీ ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు వారికి జరిగిన మేలును వివరించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఇందులో పాల్గొనని నేతలపై రిపోర్టులు సైతం తెప్పించుకుని పరిశీలించారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులపై కీలక భేటీలో సైతం గడప గడపలో సరిగ్గా పాల్గొనని, అసలు మొదలుపెట్టని ఎమ్మె్ల్యేలకు సైతం వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గడప గడపకు కార్యక్రమాన్ని తన షాడో తో నిర్వహిస్తున్నారని నియోజకర్గ ప్రజలు ముక్కన వేలు వేసుకుంటున్నారు.
పార్టీ అధినేత, సీఎం జగన్ ఆదేశాలను పక్కనపెట్టి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తనకు బదులుగా పీఏ సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరు పరిధిలో గడపగడపకి మన ప్రభుత్వం కోసం తిరుగుతున్నారు వెదురుకుప్పం మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే నారాయణస్వామి తమ ఇంటికి వస్తాడని, మన ఇంటి సమస్య ఊరి సమస్య చెప్పుకుందామని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మహిళలకి, గ్రామస్తులకు చేదు అనుభవం ఎదురైంది. నారాయణ స్వామి అండ్ టీం ప్రజలకి చెవులలో పువ్వులు పెట్టారు అంటూ స్థానికులు కొందరు సెటైర్లు వేస్తుండటంలో హాట్ టాపిక్ గా మారింది.
మండల కేంద్రం వెదురుకుప్పంలో గత వారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నిరసనల సెగ తగలడంతో మధ్యాహ్నానికి అంతరార్ధంగా ముగించి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెళ్లిపోయారు. వారం రోజుల తర్వాత తిరిగి కార్యక్రమం ప్రారంభించారు. ఉదయం రెండు గ్రామాల్లో తిరిగి నారాయణస్వామి తనకు వేరే కార్యక్రమం ఉందని సమస్య ఉన్న దళిత గ్రామాలకు వెళ్లకుండా చిన్నగా జారుకున్నారని విమర్శలు వస్తున్నాయి. అంతే నారాయణస్వామి అనుచర వర్గం, డిప్యూటీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి గడపగడపకు పర్యటన మొదలెట్టారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అని ఆశయంతో తన గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను గడపగడప చేరుకోవాలని భావించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఎమ్మెల్యేలను గడప గడపకు పంపిస్తున్నారు. అయితే ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తన పీఏతో గడప గడప కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాను తిరిగితే సరిపోతుందని భావించి, మిగతా గ్రామాలకు పార్టీలో సెకండ్ క్యాడర్ ను పంపిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే నారాయణ స్వామి కొన్ని ఇల్లు తిరిగి గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రాంని మమ అని పించడంతో స్థానికులకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే వస్తారని, తమ కష్టాలు తెలుసుకుంటారని, ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశ తప్పడం లేదట. అధిష్టానానికి ఈ విషయం ఎలాగైనా చెప్పాలని కొందరు నేతలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
మంత్రి హోదాలో నారాయణ స్వామి వచ్చి తమ సమస్యలు తెలుసుకుంటారని ఆశించిన తమకు నిరాశే ఎదురైందని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో కూడా స్థానిక ఎమ్మెల్యే రావడం లేదని, కేవలం ఆయన అనుచరులు, పీఏ వచ్చి తమని కలవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి తమ సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాము ఓట్లు వేయకుండా ఆయన గెలిచారా అని సైతం నిలదీస్తున్నారు.
TTD News: గరుడ సేవ వేళ భక్తులతో తిరుమల కిటకిట - ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్
Tirumala Brahmotsavam 2023: తిరుమలకు పోటెత్తిన భక్తులు, మూడు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం!
Tirumala News: తిరుమలలో ఐదోరోజు మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు- సాయంత్రం గరుడ వాహన సేవ
అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్ తీర్పుపై తీవ్ర విమర్శలు
Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో
iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?
IND vs AUS 1st ODI: షమి 'పంచ్'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్ 279
/body>