Ganesh Chaturthi: అనంతపురం గణనాథుడు రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు
Telugu News: గుంతకల్లులోని కన్యక పరమేశ్వరి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా 115 కిలోల వెండి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ 115 కిలోల వినాయకుడు ప్రస్తుతం లిమ్కా బుక్ అఫ్ రికార్డులో చోటు సంపాదించాడు.
Vinayaka Chavithi in Anantapur: వినాయక చవితి వచ్చిందంటే చాలు వివిధ ఆకృతుల్లో విగ్నేశ్వరుని బొమ్మలు కొనుగోలు చేసి ప్రత్యేక అలంకరణతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ అనంతపురం జిల్లా లో ఓ వినాయకుడు ఏకంగా లింక బుక్కులో రికార్డును సాధించాడు. గుంతకల్లు పట్టణం కన్యక పరమేశ్వరి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా 115 కిలోల వెండి వినాయకుడిని ప్రతిష్టించారు. ఎక్కడ లేని విధంగా నోట 115 కిలోల వినాయకుడు ప్రస్తుతం లిమ్కా బుక్ అఫ్ రికార్డు లో చోటు సంపాదించడం విశేషం.
దీంతో నిర్వాహకులు వినాయక చవితి పండుగ పురస్కరించుకొని గుంతకల్లు పట్టణ పురవీధుల్లో వెండి వినాయకుడిని ఊరేగింపు నిర్వహించారు. దాదాపుగా 27 సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం విగ్రహ దాత ఇంటిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకిపై వెండి వినాయకుడిని కూర్చో పెట్టు కోదండరామ స్వామి దేవాలయం వీధి మీదుగా ఊరేగింపు ప్రారంభించారు. వేదంపండితులు మంత్రోచ్ఛారణతో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలోకి స్వాగతం పలికారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం పంచగంగతో అభిషేకం చేశారు.
మొక్కజొన్నలు కంకులు, చెరుకు గడలు, అరటి గెలలతో ప్రత్యేక వినాయకుడు
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో పర్యావరణానికి అనుకూలంగా విగ్నేశ్వరుడి బొమ్మను తయారు చేసి ప్రతిష్టించారు. ప్రస్తుత సమాజంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో కాలుష్యాన్ని నియంత్రించే విధంగా ఒక సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో పామిడి పట్టణానికి చెందిన నాగ తేజ అనే యువకుడు చెరకు, అరటిపండ్లు, మొక్కజొన్న కంకులతో వినాయకుడిని తయారు చేసి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ వినాయకుడిని మొత్తం మూడు రకాల చెరకు, అరటిపండ్లు, మొక్కజొన్న కంకులతో తయారు చేశామని.. ఈ వినాయకుడిని తయారు చేయటానికి మొత్తం రూ.15,000/- రూపాయలు ఖర్చయ్యిందన్నారు. నిమజ్జనం రోజున పండ్లను ఆవులకు ప్రసాదంగా పంచుతామని దాని వల్ల ఎంతో పుణ్యదాయకమని నాగతేజ గౌడ్ అన్నారు.