అన్వేషించండి

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు అలెర్ట్, డిసెంబర్ 24న వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల

Tirumala Darshan Tickets : శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేక ప్రవేశ టికెట్లను డిసెంబర్ 24న టీటీడీ విడుదల చేయనుంది.

Tirumala Darshan Tickets : జనవరి 2 నుంచి 11 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో టికెట్లు అందుబాటులో ఉంచనుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను రోజుకు 20 వేల చొప్పున 10 రోజులకు సంబంధించి మొత్తం 2 లక్షల టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. టికెట్లు ఉన్నవారికి మాత్రమే తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.  

రోజుకు 50 వేల సర్వదర్శనం టికెట్లు 

జనవరి రెండో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. దర్శన టికెట్లు ఉన్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం చేయిస్తామని పేర్కొంది. టికెట్లు లేని వారిని దర్శనానికి అనుమతి ఉండదని చెప్పింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రోజుకు 20 వేలు, సర్వదర్శనం టికెట్లు రోజుకి 50 వేల టికెట్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. వైకుంఠ ద్వార దర్శనం పది రోజులకి 5 లక్షల సర్వ దర్శనం టికెట్లు కేటాయిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. సర్వదర్శన టికెట్ల కోసం తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు, తిరుమలలో ఒక్క కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.  

ఆధార్ కార్డు తప్పనిసరి 

ప్రతిరోజు ఉదయం రెండు గంటల నుంచి టికెట్లు కేటాయిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్లు‌ పొందే భక్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేశామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వ దినాల్లో అన్ని ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో రోజుకి 2 వేల చొప్పున కేటాయిస్తామన్నారు. శ్రీవాణి టికెట్లు కలిగిన వారికి మహాలఘు దర్శనం కల్పిస్తామని వివరించారు. పోలీసులు, జిల్లా అధికారులు భక్తులకు అవసరమైన సౌఖర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గోవింద మాల భక్తులు కూడా టికెట్లు తీసుకునే రావాలన్నారు. వారికి ప్రత్యేక దర్శనాలు ఏమీ ఉండవని చెప్పుకొచ్చారు. టికెట్లు లేని భక్తులు తిరుమలకి రావచ్చు కానీ దర్శనానికి అనుమతి ఉండదని వివరించారు. డిసెంబరు 29వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు వసతి రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 

కేటాయించిన సమయానికి దర్శనానికి రావాలి 

ట్రాఫిక్ ఇబ్బంది, శాంతిభద్రతల సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. జనవరి 2వ తేదీ వేకువ జామున 1:40 నుంచి వీఐపీ దర్శనం  ఉంటుందని చెప్పింది. ఉదయం 5 గంటలకు సామాన్య భక్తులకు దర్శనం టీటీడీ వెల్లడించింది. జనవరి రెండో తేదీన వైకుంఠ ఏకాదశి నాడు, బంగారు తెరు, మూడన ద్వాదశి నాడు చక్రస్నానం ఉంటుందని తెలిపింది. టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి రావాలని టీటీడీ సూచించింది. 

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget