అన్వేషించండి

Tirumala : అలిపిరి తనిఖీలపై మహారాష్ట్ర భక్తుడి వీడియో, నిరాధార ఆరోపణలు సరికాదన్న టీటీడీ

Tirumala : ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రతిమ ఉన్న కారును తిరుమలకు అనుమతించలేదని ఓ భక్తుడు వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ ఆరోపణలను టీటీడీ ఖండించింది.

Tirumala : మహారాష్ట్రీయులకు గర్వకారణమైన ఛ‌త్రపతి శివాజీ మహరాజ్‌కు అవమానం జరిగినట్లు ఓ భక్తుడు వీడియో క్లిప్ ద్వారా ఆరోపించడాన్ని టీటీడీ ఖండించింది. శ్రీ‌వారి ద‌ర్శనానికి విచ్చేసే భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్యక్తుల విగ్రహాలు, ఫొటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమ‌త ప్రచారానికి సంబంధించిన ప్రచార సామ‌గ్రి తిరుమ‌లకు తీసుకువెళ్లడాన్ని టీటీడీ నిషేధించింది. ఈ మేర‌కు రెండు రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన వాహనాన్ని అలిపిరి తనిఖీ‌ కేంద్రం వద్ద భ‌ద్రతా సిబ్బంది నిలిపి త‌నిఖీ చేశారు. ఈ క్రమంలో భ‌ద్రతా సిబ్బంది న‌ల్లటి రంగులో ఉన్న ఒక ప్రతిమ‌ను గుర్తించి, ఆ ప్రతిమ ఛ‌త్రప‌తి శివాజీద‌ని తెలుసుకుని తిరుమ‌ల‌కు అనుమ‌తించారు. దేవతామూర్తుల చిత్రాలు తప్ప, వ్యక్తుల విగ్రహాలు, రాజకీయ పార్టీల జెండాలు, ఇతర చిహ్నాలను ప్రదర్శించరాదని స‌ద‌రు భక్తుడిని కోరారు. అయితే ఆ భక్తుడు శివాజీ మహారాజ్‌ను టీటీడీ అవమానించిందని ఆరోపిస్తూ తీవ్ర పదజాలంతో వీడియో రూపొందించి, ఇతరులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఉన్న వీడియోలోని విషయాలను టీటీడీ తీవ్రంగా ఖండించింది.

టీటీడీ ఏంచెబుతోందంటే? 

తిరుమల ముఖ ద్వారంమైన అలిపిరి‌ తనిఖీ కేంద్రంలో భక్తుల వాహనాలు తనిఖీ చేసే సమయంలో అప్రమత్తం ఉండాలని, దేవతామూర్తుల విగ్రహాలు, హిందూ ధార్మిక సంస్థల జెండాలను అనుమతించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి విజిలెన్స్ సిబ్బందికి సూచించారు. కేవలం రాజకీయ నాయకుల ప్రతిమలు, జెండాలు, అన్యమతాలకు సంబంధించిన వస్తువులను కచ్చితంగా అలిపిరి వద్దే తొలగించాలని సూచించారు. దేశం నలుమూలల నుంచి తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు వాహనాలపై అన్యమత చిత్రాలు గానీ, జెండాలు గానీ ఉంచుకుని తిరుమల కొండకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. 

దశాబ్దాల కిందటే నిషేధం 

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు తీసుకురావడాన్ని టీటీడీ నిషేధించింది. భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్యక్తుల ఫొటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు,  చిహ్నాలు, అన్యమ‌త ప్రచారానికి సంబంధించిన ప్రచార సామ‌గ్రి,  తిరుమ‌లకు తీసుకురావడాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధం విధించారు. టీటీడీ భ‌ద్రతా సిబ్బంది అలిపిరి వ‌ద్ద వాహనాల తనిఖీలు చేసి ఇలాంటి అన్యమత ప్రచార సామాగ్రి ఉంటే తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌రు. ఇది ఎన్నో ద‌శాబ్దాలుగా అనుస‌రిస్తున్న నిబంధ‌న‌ అని టీటీడీ తెలిపింది. తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా లేక వ్యక్తుల ఫొటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో వస్తున్నారు. వీటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి తొలగిస్తున్నారు. వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించ‌వ‌ల‌సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Mission Vatsalya: నెలకు రూ.4 వేలు ఇచ్చే ప్రభుత్వ పథకం.. 'మిషన్ వాత్సల్య' స్కీమ్ దరఖాస్తు విధానం ఇలా!
నెలకు రూ.4 వేలు ఇచ్చే ప్రభుత్వ పథకం.. 'మిషన్ వాత్సల్య' స్కీమ్ దరఖాస్తు విధానం ఇలా!
Anantapur Kadiri Farmers Forceful Land Acquisition: రైతుల్ని బెదిరిస్తున్న సోలార్ ప్లాంట్ యాజమాన్యాలు - ప్రైవేట్ కంపెనీ దౌర్జన్యాలపై కదిరి ఆర్డీవోకు బీజేపీ విష్ణు ఫిర్యాదు
రైతుల్ని బెదిరిస్తున్న సోలార్ ప్లాంట్ యాజమాన్యాలు - ప్రైవేట్ కంపెనీ దౌర్జన్యాలపై కదిరి ఆర్డీవోకు బీజేపీ విష్ణు ఫిర్యాదు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
How Car Airbags Work: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
BAT-BMS Controversy: BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది? 
BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది? 
Embed widget