News
News
X

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, జులై 20న ఆగస్టు కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

FOLLOW US: 

Tirumala Tickets : తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తారు. ఒక్కసారైనా కలియుగ దైవాన్ని కనులారా దర్శించుకోవాలని భావిస్తుంటారు. తిరుమలలో అంగప్రదక్షిణం టోకెన్లపై టీటీడీ కీలక సమాచారం విడుదల చేసింది. జులై 20న అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల చేస్తున్నట్లు తెలిపింది.  ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను జులై 20న ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వారంలో శుక్రవారం మినహా అన్ని రోజులు 750 టోకెన్ల చొప్పున కేటాయించనున్నారు. భ‌క్తులు టోకెన్లను ఆన్ లైన్లో బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించారు.  

భక్తుల రద్దీ దృష్ట్యా 

కోవిడ్ కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన అంగప్రదక్షణ టోకెన్ల జారీని దాదాపు రెండున్నర ఏళ్ల తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్రారభించారు. ఆఫ్ లైన్ లో అంగప్రదక్షణ టోకెన్లను తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద భక్తులకు అందుబాటులోకి ఉంచారు. అధిక సంఖ్యలో భక్తుల రద్దీ కారణంగా రోజు వారి తిరుమలలో జారీ చేసే అంగప్రదక్షణ టోకెన్లను ఆన్లైన్ లో  జారీ చేస్తుంది. దీంతో గంటల తరబడి అంగప్రదక్షణ టోకెన్ల కోసం భక్తులు వేచి ఉండే అవసరం లేకుండా ఇంటి వద్దే ఆన్లైన్ ద్వారా టోకెన్లు పొందే సౌకర్యం కల్పించింది టీటీడీ. 

అంగప్రదక్షిణం అంటే? 

ఆపద మొక్కల వాడికి అంగప్రదక్షణ అంటే ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తి భావంతో భక్తులు పొర్లు దండాలు చేసి స్వామి వారి కటాక్షాలను పొందుతుంటారు.  భక్తుల సౌకర్యార్ధం ప్రతి రోజు వేకువజామున, ఒంటి గంటకు అంగప్రదక్షణ టోకెన్లు ఉన్న భక్తులు ముందుగా శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానం  చేసి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇలా ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ముందుగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలి చేరుకోవాల్సి ఉంటుంది.  వెండి వాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణాన్నే అంగప్రదక్షణ అంటారు. సుప్రభాత సేవ జరిగే సమయంలో భక్తులను అంగప్రదక్షణ చేయిస్తుంటారు.  వెండి వాకిలి లోపలికి ప్రవేశించగానే‌ ఎదురుగా ఆదిశేషునిపై శ్రీరంగనాథుడు కనిపిస్తారు. ఈయనకు పైన వరదరాజ స్వామి, కింద వేంకటేశ్వరస్వామి మూర్తులు చిన్న బంగారు ఫలకాలపై ఉంటారు. ఇక్కడి నుంచి అంగప్రదక్షణ మొదలవుతోంది.  ఇలా‌ ఆనంద నిలయం చుట్టూ ఓ ప్రదక్షణ చేసిన తరువాత వారికి స్వామి దర్శన భాగ్యం కల్పిస్తుంది టీటీడీ. 

అంగప్రదక్షణ టోకెన్లు ఆన్ లైన్ లో 

ప్రతి రోజు మధ్యాహ్నం తిరుమల సీఆర్వో కార్యాలయం వద్ద జారీ చేసే అంగప్రదక్షణ టోకెన్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఉదయం నుంచి భక్తులు క్యూలైన్స్ లో టోకెన్ల కోసం వేచి ఉంటారు. ఈ సమయంలో అధిక రద్దీతో భక్తుల మధ్య తోపులాట జరిగే అవకాశం ఉంటుంది. అయితే భక్తులు ఇబ్బందులను దృష్టిలో తీసుకున్న టీటీడీ  ఇకపై భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ లో అంగప్రదక్షణ టోకెన్ల జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూన్ 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో అంగ‌ప్రద‌క్షణ‌ టోకెన్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.  జులై 20వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లను రోజుకు 750 టోకెన్ల చొప్పున టీటీడీ ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది. ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. ఇందుకు సంబంధించిన టీటీడీ వెబ్ సైట్  https://tirupatibalaji.ap.gov.in ద్వారా అంగ‌ప్రద‌క్షణ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. 

Published at : 18 Jul 2022 08:48 PM (IST) Tags: ttd Tirumala news Tirupati News Tirumala tickets August quota tickets Angapradakshina tickets

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: హైదరాబాద్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్, చార్జింగ్ పెడుతుండగా ఘటన

Breaking News Live Telugu Updates: హైదరాబాద్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్, చార్జింగ్ పెడుతుండగా ఘటన

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Petrol-Diesel Price, 14 August: నేడు ఈ సిటీలో భారీగా తగ్గిన ఇంధన రేట్లు - ఇక్కడ మాత్రమే పెరుగుదల, తాజా ధరలు ఇవీ

Petrol-Diesel Price, 14 August: నేడు ఈ సిటీలో భారీగా తగ్గిన ఇంధన రేట్లు - ఇక్కడ మాత్రమే పెరుగుదల, తాజా ధరలు ఇవీ

Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD

Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD

టాప్ స్టోరీస్

NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?

NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!

Har Ghar Tiraraga: ఢిల్లీ నుంచి గల్లీదాకా హర్ ఘర్‌ తిరంగా - దేశ వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలు

Har Ghar Tiraraga: ఢిల్లీ నుంచి గల్లీదాకా హర్ ఘర్‌ తిరంగా - దేశ వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలు

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి