అన్వేషించండి

Sajjala Vs Teachers : ఇంకా ఉంది.. ఏపీలో ఇక ప్రభుత్వం వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలు !

ఏపీ ఉపాధ్యాయులు మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. అయితే వారి వెనకు రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం సద్దుమణగలేదు.  ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తూ సొంతంగా పోరుబాట పట్టాయి. ఈ రోజు నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరయ్యారు.  ఉపాధ్యాయ సంఘాల నిరసనలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగులు పరస్పర సహకారంతో సమస్య పరిష్కారం అయిందని .. ఉద్యోగుల్లో కొంతమంది ప్రతిపక్షాలతో కలిసి మళ్లీ ఆందోళన బాట పడతామని అంటున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా వామపక్ష ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తామంటున్నారు అని సజ్జల అన్నారు. 

వామపక్ష ఉద్యోగ సంఘాలు పీఆర్సీ పెంచాలి అంటే సాధ్యం అవుతుందా? అని సజ్జల ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న వామపక్ష ఉద్యోగ సంఘాలు కేరళలో హెచ్‌ఆర్‌ఏ ఎంత అని ప్రశ్నించారు.  వామపక్ష పార్టీలు ఈ ప్రభుత్వంపై దాడి చేసి ఎవరికి మేలు చేయాలని అనుకుంటున్నారు అని సజ్జల ప్రశ్నించారు.  లేని సమస్యని మళ్లీ సృష్టించాలని భావిస్తున్నారని అన్నారు. ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే మంత్రుల కమిటీని వచ్చి కలవొచ్చని సూచించారు. ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలన్నింటితో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు.  ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీని రూపొందించి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని విజయవాడలో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు. 

ఉద్యోగ సంఘాల నాయకులు  ఉపాధ్యాయ సంఘాల పై విమర్శలు చేయడం సరికాదన్నారు. తాము మినిట్స్‌పై సంతకం చేయలేదని.. తమను అసలు మాట్లాడనివ్వలేదన్నారు. మహమ్మారి కరొనా  ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నామని స్పష్టం చేశారు.   ఏపీ జేఏసీలో నాలుగు సంఘాల నాయకులు ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్లకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తక్షణమే పాత హెచ్‌ఆర్‌ఏ ప్రకటించాలని, పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ 27శాతం ప్రకటించాలని, స్టీరింగ్‌ కమిటీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేసిన వారిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే కావడంతో వారు మళ్లీ రోడ్డెక్కితే పరిస్థితి మొదటి కొస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఉపాధ్యాయ నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. స్కూళ్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. పలు జిల్లాల్లో టీచర్లకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా న్యాయమైన పీఆర్సీ ఇచ్చే వరకూ తాము పోరాడతామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Embed widget