అన్వేషించండి

లోక్‌సభ ఎన్నికలు 2024

UTTAR PRADESH (80)
43
INDIA
36
NDA
01
OTH
MAHARASHTRA (48)
30
INDIA
17
NDA
01
OTH
WEST BENGAL (42)
29
TMC
12
BJP
01
INC
BIHAR (40)
30
NDA
09
INDIA
01
OTH
TAMIL NADU (39)
39
DMK+
00
AIADMK+
00
BJP+
00
NTK
KARNATAKA (28)
19
NDA
09
INC
00
OTH
MADHYA PRADESH (29)
29
BJP
00
INDIA
00
OTH
RAJASTHAN (25)
14
BJP
11
INDIA
00
OTH
DELHI (07)
07
NDA
00
INDIA
00
OTH
HARYANA (10)
05
INDIA
05
BJP
00
OTH
GUJARAT (26)
25
BJP
01
INDIA
00
OTH
(Source: ECI / CVoter)

Chandrababu Arrest : చంద్రబాబు పిటిషన్లపై విచారణ గురువారం ఉదయానికి వాయిదా - ఏసీబీ కోర్టులో వాదనల్లో ముఖ్యాంశాలు ఇవే

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది.

 

Chandrababu Arrest :  చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పలు కీలక సందేహాలను లెవనెత్తారు. 

ఏ 37కు డబ్బు ముట్టినట్లుగా ఆధారాలు చూపించాలన్న న్యాయమూర్తి 

చంద్రబాబుకు  బెయిల్ ఇవ్వొద్దని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రిమాండ్ రిపోర్టునే ఆయన మళ్లీ చదివి వినిపించారు.  ఈ సమయంలో న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమాండ్‌కు పంపినప్పుడు..తర్వాత కస్టడీ పిటిషన్ల సమయంలోనూ ఇదే వాదనలు వినిపించారు. పదే పదే అవే వాదనలు వినిపిస్తూ సమయం ఎందుకు వృధా చేస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో ఏ 37కి డబ్బు ముట్టినట్లుగా ఆధారాలు ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే  పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని అనే ఇద్దరు విదేశాలకు పారిపోయారని.. వారితో చంద్రబాబుకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్నారు. వారిద్దరూ ఐటీ నోటీసుల్లో ఉన్న వారేనా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. చంద్రబాబు జైల్లో ఉండగానే సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని బెయిల్ ఇస్తే ఇంకా ప్రభావితం చేస్తారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. అయితే జైల్లో ఉన్న వ్యక్తి సాక్షుల్ని ఎలా ప్రబావితం చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏదైనా ప్రభుత్వ స్కీంలో స్కాం జరిగిదే.. హెచ్‌వోడీని బాధ్యుడ్ని చేస్తారా.. ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేస్తారా  అని  న్యాయమూర్తి ఏఏజీని ప్రశ్నించారు. 

కేబినెట్ నిర్ణయానికి చంద్రబాబును ఎలా బాధ్యుడ్ని చేస్తారని చంద్రబాబు లాయర్ వాదన

ఉదయం  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పిదం ఏమీ లేదు అని అన్నారు. అప్పటి ఆర్థిశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి స్కిల్ డవలప్‌మెంట్‌పై అధ్యయనం చేశారు అని న్యాయవాది దూబే వాదనలు వినిపించారు. సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంంతరం తెలపలేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి అని కోర్టులో దూబే వాదనలు వినిపించారు. కాస్ట్ ఎవాల్యూషన్ కమిటీలో చంద్రబాబు నాయుడు లేరు అని కోర్టు దృష్టికి తెలిపారు. ఈ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని వాదించారు. సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించిందని వాదించారు. చంద్రబాబు నాయుడుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కోర్టులో వాదించారు. అరెస్ట్ చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడును విచారించారని వాదించారు. ఇప్పటికే రెండు రోజులపాటు చంద్రబాబును సీఐడీ కస్టడీ తీసుకుని విచారణ చేపట్టిందని...మళ్లీ కస్టడీ ఎందుకు అని దూబె వాదించారు. కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై ఎలా కేసు పెడతారు అని ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు.

గురువారం ఉదయం విచారణ

ఏఏజీ వాదనలు విన్న తర్వాత విచారణను గురువారానికి వాయిాదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తి చెప్పారు. అయితే ఆలస్యమైనా ఇవాళే విచారణ పూర్తి చేయాలని చంద్రబాబు తరపు లాయర్ కోరారు. తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని.. గురువారం ఉదయం పదకొండు గంటలకు విచారణ చేస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పి వాయిదా వేశారు. రేపు ఉదయం చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Why Jagan loss in AP Assembly Election: జగన్ కంచుకోట ఎందుకు కూలింది? ప్రజల్లో మరీ అంత వ్యతిరేకత ఉందా! వైసీపీ ఓటమికి టాప్ 10 రీజన్స్
జగన్ కంచుకోట ఎందుకు కూలింది? ప్రజల్లో మరీ అంత వ్యతిరేకత ఉందా! వైసీపీ ఓటమికి టాప్ 10 రీజన్స్
Modi swearing-In Event: మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలకు ఆహ్వానం
మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలకు ఆహ్వానం
Renu Desai: చాలా ఏళ్ల నుంచి చెప్తున్నా, ఇప్పుడు నిజమైంది - అకీరా గురించి రేణూ దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చాలా ఏళ్ల నుంచి చెప్తున్నా, ఇప్పుడు నిజమైంది - అకీరా గురించి రేణూ దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
NEET 2024: ఎంబీబీఎస్‌ సీట్లకు పెరిగిన పోటీ..దేశవ్యాప్తంగా ఉత్తీర్ణతశాతం పెరగడంతో కన్వీనర్ కోటా సీట్లకు విపరీతంగా పెరిగిన గిరాకీ
నీట్‌లో మంచి ర్యాంకు వచ్చినా ఎంబీబీఎస్‌ సీటు దక్కేనా.?
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Nandamuri Chaitanya Krishna First Reaction on TDP Winning | మావయ్య, బాబాయ్ అదరగొట్టేశారు ABP DesamRohit Sharma vs Virat Kohli Opening | T20 World Cup 2024 | ఓపెనర్స్ గా రోహిత్-విరాట్ హిట్టు కొడతారా?Rohit Sharma 52 Runs | India vs Ireland Highlights | వరల్డ్ కప్పుల్లో మొనగాడు రోహిత్ శర్మIndia vs Ireland Match Highlights | ఐర్లాండ్ పై 8వికెట్ల తేడాతో భారత్ విక్టరీ | T20 World Cup 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Jagan loss in AP Assembly Election: జగన్ కంచుకోట ఎందుకు కూలింది? ప్రజల్లో మరీ అంత వ్యతిరేకత ఉందా! వైసీపీ ఓటమికి టాప్ 10 రీజన్స్
జగన్ కంచుకోట ఎందుకు కూలింది? ప్రజల్లో మరీ అంత వ్యతిరేకత ఉందా! వైసీపీ ఓటమికి టాప్ 10 రీజన్స్
Modi swearing-In Event: మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలకు ఆహ్వానం
మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలకు ఆహ్వానం
Renu Desai: చాలా ఏళ్ల నుంచి చెప్తున్నా, ఇప్పుడు నిజమైంది - అకీరా గురించి రేణూ దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చాలా ఏళ్ల నుంచి చెప్తున్నా, ఇప్పుడు నిజమైంది - అకీరా గురించి రేణూ దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
NEET 2024: ఎంబీబీఎస్‌ సీట్లకు పెరిగిన పోటీ..దేశవ్యాప్తంగా ఉత్తీర్ణతశాతం పెరగడంతో కన్వీనర్ కోటా సీట్లకు విపరీతంగా పెరిగిన గిరాకీ
నీట్‌లో మంచి ర్యాంకు వచ్చినా ఎంబీబీఎస్‌ సీటు దక్కేనా.?
TDP Attacks on YSRCP: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం- టీడీపీ శ్రేణులపై వైసీపీ విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం- టీడీపీ శ్రేణులపై వైసీపీ విమర్శలు
Amaravathi :  ఏపీకి అమరావతే ఏకైక  రాజధాని - ప్రజా తీర్పుతో క్లారిటీ !
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని - ప్రజా తీర్పుతో క్లారిటీ !
Vande Bharat: సరికొత్త రికార్డు సృష్టించిన వందేభారత్ రైళ్లు, ఇంతకీ రికార్డు ఏంటంటే?
సరికొత్త రికార్డు సృష్టించిన వందేభారత్ రైళ్లు, ఇంతకీ రికార్డు ఏంటంటే?
Anantapuram News : ల్యాప్‌టాాప్‌ ఆర్డర్ చేస్తే బండరాయి వచ్చింది- ప్రభుత్వ అధికారులకే టొకరా వేసిన కేటుగాళ్లు
ల్యాప్‌టాాప్‌ ఆర్డర్ చేస్తే బండరాయి వచ్చింది- ప్రభుత్వ అధికారులకే టొకరా వేసిన కేటుగాళ్లు
Embed widget