అన్వేషించండి

Steel Plant News : స్టీల్ ప్లాంట్ అమ్మడం ఖాయం - ఫైనల్‌గా తేల్చేసిన కేంద్రం ! అన్ని పార్టీల గాలి పోయినట్లే

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేదని కేంద్రం అధికారిక ప్రకటన చేసింది.

 

Steel Plant News :  కేసీఆర్ దెబ్బకు కేంద్రం స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేసిందని బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేసి గంటలు గడవక ముందే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా షాక్ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ అమ్మకం  విషయంలో వెనక్కి తగ్గలేదని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటకరణను తాత్కలికంగా పక్కన పెట్టామంటూ కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ చేసిన ప్రకటనకు మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గినట్లేనని అందరూ అనుకున్నారు. తమ ఘనత అంటే్ తమ ఘతన అని ప్రకటించుకున్నారు. కానీ..అదంతా అవాస్తవం అని.. తేలిపోయింది. విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై కేంద్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందన్న కేంద్రం

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మొత్తంగా కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో వాటాల ఉపసంహరణ ప్రకియపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని.. ఆపడానికి కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని.. స్పష్టం చేసింది. డిజిన్విస్టె మెంట్ ప్రక్రియ కొనసాగుతుదని ప్రకటించారు.  స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ ఆపేశారని  వివిద పత్రికల్లో.. మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగానే ఈ వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ను బలోపేతం  చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని కేంద్రం తెలిపింది.           

విశాఖలోనే మాట మార్చిన  కేంద్రమంత్రి ఫగన్ సింగ్                

గురువారం ఉదయం ప్రైవేటీకరణ లేదని చెప్పిన కేంద్ర మంత్రి సాయంత్రానికి మాట మార్చారు.  తాను స్టీల్ ప్లాంట్ ( RINL ) ను లాభాల బాట పట్టించే మార్గాలపై  దృష్టి  పెట్టామని మాత్రమే చెప్పానని ప్రవేటీకరణ రద్దు అంశం తన పరిధి లోనిది కాదని స్పష్టం చేసారు . పైగా కేంద్ర సహాయ మంత్రినైన తాను కేబినెట్ తీసుకున్న నిర్ణయం పై ఎలా మాట్లాడుతానని ప్రత్యేకంగా కార్మిక నేతలను పిలిపించుకుని మరీ చెప్పారు.   కేవలం ఉద్యోగ ,కార్మిక సంఘాల అభిప్రాయాలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకు వెళతానని వారికి చెప్పారు . దానికి కొనసాగింపుగాకేంద్రం.. పెట్టుబడుల ఉపసంహరణపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటించింది. 

క్రిడెట్ తీసుకున్న రాజకీయ పార్టీలు ఇప్పుడేం చేస్తాయి ?                

కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గడానికి కారణం తామంటే తాము అని పోటీ పడి ప్రకటించుకున్న పార్టీలకు ఇప్పుడు షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు ఆ పార్టీలు ఎలాంటి స్పందన చేస్తాయోననే ఆసక్తి వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు ఏదైనా అనుకూలంగా జరిగితే.. మొత్తం క్రెడిట్ తమకేనని  మీద వేసుకుంటాయి. నెగెటివ్ గా ఏదైనా జరిగితే మాత్రం.. పక్క పార్టీల మీద వేస్తూ ఉంటాయి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అలాంటి రాజకీయ ప్రకటనలే వచ్చే అవకాశం ఉంది.                    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
ICC Champions Trophy: ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
ప్రమాదంలో రోహిత్, కోహ్లీ వన్డే కెరీర్.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు వీరిద్దరిని తప్పించే చాన్స్.. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనుగడ కష్టమే..! 
Embed widget