Andhra News: ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా తెలంగాణ యువతి ఎంపిక - ఫలితాల్లో ప్రథమ స్థానం
Telangana Girl as a Junior Civil Judge: ఏపీ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి నియామక పరీక్షల్లో తెలంగాణ యువతి అలేఖ్య సత్తా చాటారు. ఫస్ట్ ర్యాంక్ సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు.
Telangana Girl Selected as a Junior Civil Judge In AP: ఏపీ హైకోర్టు (AP Highcourt) నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి నియామక పరీక్షా ఫలితాల్లో తెలంగాణ (Telangana) యువతి అలేఖ్య (24) సత్తా చాటారు. ఈ ఫలితాల్లో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. హనుమకొండకు చెందిన మాధవీలత, పరిమి మనోజ్ కుమార్ దంపతుల కుమార్తె అలేఖ్య.. హైదరాబాద్ పెండేకంటి కళాశాలలో 2022లో న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ఆమె ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. గతేడాది ఏపీ హైకోర్టు నియామకాల్లో ఫస్ట్ ర్యాంకు సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. కాగా, అలేఖ్య తల్లి మాధవీలత రంగారెడ్డి (RangaReddy) జిల్లా న్యాయస్థానంలో సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్నారు. ఆమె స్ఫూర్తితోనే అలేఖ్య సైతం ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దీకొండ రవీందర్, ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల మాధవరెడ్డి అభినందించారు. అలేఖ్య మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.