Telangana High Court: జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు - తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ!
Jagan Asset Case: జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. వేగంగా విచారించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసింది.
![Telangana High Court: జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు - తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ! Telangana high court A turning point has taken place in Jagan's cases of illegal activities. Telangana High Court: జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు - తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/08/31d7c33d17723f8f40c3ecae850a05311699429959926228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana hIgh court : 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపు జగన్ అక్రమాస్తుల కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్ నువిచారణకు స్వీకరించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద స్వీకరించేందుకు గతంలో రిజిస్ట్రి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చీఫ్ జస్టిస్ ధర్మానసం ముందు ప్రస్తావించారు.
సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు... ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకరించింది. ల పిల్ లో సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చారు. ప్రతివాదులు జగన్, సీబీఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలన్న హరిరామ జోగయ్య పిటిషన్ వేశారు.
ఇలాంటి పిటిషన్ సుప్రీంకోర్టులో గత శుక్రవారం రఘురామకృష్ణరాజు దాఖలు చేశారు. శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారణ జరిపింది జగన్ అక్రమాస్తుల కేసు్లలో విపరీతమైన జాప్యం ఎందుకు జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది.విపరీతమైన ఆలస్యం జరుగుతున్నందున సీఎం జగన్ ఆస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని ఎంపీ రఘురామ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విపరీతమైన జాప్యం జరుగుతోందని.. 3071 సార్లు జగన్ కేసును సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందని.. వందల కొద్ది డిశ్చార్జి పిటిషన్లు వేసినట్లు పేర్కొన్నారు.
వైఎస్ జగన్‌పై సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదని.. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్‌కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారని ప్రస్తావించారు. అందువల్ల ఈ కేసుల విచారణకు అంతు లేకుండా పోతోందని.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదు అంటూ పిటిషన్‌లో కోర్టుకు వివరించారు. అందువల్ల వెంటనే దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని.. ఈకేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్‌లో కోరారు.
మరో వైపు జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నరారని .. బెదిరింపులకు పాల్పడుతూ అవినీతి చేస్తున్నరని .. తమ అక్రమాస్తుల కేసుల్లో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఓ ఫిర్యాదును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు. వారి బెయిల్ రద్దు చేయాలని కోరారు. త్వరలో సీబీఐ కోర్టులో ఇదే విజ్ఞప్తితో పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)