అన్వేషించండి

TDP Protest: చంద్రబాబు అరెస్ట్‌పై కొనసాగుతున్న నిరసనలు - ఎక్కడికక్కడ నేతల హౌస్ అరెస్ట్‌లు, దీక్షా భగ్నాలు

చాలా చోట్ల టీడీపీ నేతలు బయటకు రాకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు.

TDP Protest: చంద్రబాబు అరెస్ట్‌‌పై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ రెండో రోజు నిరసనలు చేపట్టారు. చాలా చోట్ల టీడీపీ నేతలు బయటకు రాకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. విశాఖ జిల్లా వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును గృహనిర్బంధం చేశారు. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, ఆ పార్టీ కార్పొరేటర్ల నివాసాలను వద్ద పోలీసులు మోహరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన్ను బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. విజయవాడలో కొల్లు రవీంద్ర అరెస్ట్ చేశారు. గుణదల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కన్నా లక్ష్మీ నారాయణ హౌస్ అరెస్టు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గుంటూరులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటి నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. నెల్లూరు నగరంలో పలు రోడ్లను బారికేడ్లతో పోలీసుల దిగ్బంధించారు. మాగుంట లేఔట్‌లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నివాసం వద్దకు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో చుట్టపక్కల రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే నివాసంలో రోజువారీ విధులు నిర్వహించే సిబ్బంది, పనివారిని కూడా బారికేడ్ల అవతలే పోలీసులు నిలిపివేశారు.

ఒంగోలులో సామూహిక నిరాహార దీక్షలు
ఒంగోలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. పోలీస్ వలయాన్ని చేధించుకుని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు సామూహిక నిరాహార దీక్షకు చేరుకున్నారు. చంద్రబాబును తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనిగిరి టీడీపీ పార్టీ ఇంఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన నిర్వాహర దీక్ష ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ కార్యాలయానికి పోలీసులు తాళం వేశారు. దీంతో ఆ పార్టీ నేతలు పోలీసులతో గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టాయి. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు, టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. టీడీపీ కార్యాలయం వద్దకు ఆ పార్టీ కార్యకర్తలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. 

భారీగా పోలీసుల మోహరింపు
మార్కాపురం పట్టణంలో టీడీపీ నాయకులు తలపెట్టిన సామూహిక దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించారు. గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి సింగు సుధాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నందిగామ పట్టణం కాకాని నగర్‌లో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదివారం  చేపట్టిన సామూహిక నిరాహార దీక్షను అడ్డుకున్నారు. దీంతో ఆమె పార్టీ కార్యాలయంలోనే నల్ల బ్యాడ్జీలు, ఫ్ల కార్డులను పట్టుకొని నిరసన తెలిపారు.

సెల్ టవర్ ఎక్కిన టీడీపీ కార్యకర్త
సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మైదుగోళం గ్రామంలో టీడీపీ కార్యకర్త మంజునాథ్ సెల్ టవర్ మీదకు ఎక్కాడు.  పోలీసులు అతనికి నచ్చజెప్పి కిందకు దించారు. పోలీస్ స్టేషన్ తరలించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ నేతల దీక్షా శిబరాలను పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.  చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని, పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం ఐలాండ్ సెంటర్‌లోని  అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో టీడీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సీఎం జగన్ కి వ్యతిరేకంగా ధర్నా చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: వచ్చే ఏడాది పోలవరం పూర్తి, మూడోసారి పుష్కరాలు నిర్వహించే భాగ్యం దక్కింది: సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది పోలవరం పూర్తి, మూడోసారి పుష్కరాలు నిర్వహించే భాగ్యం దక్కింది: సీఎం చంద్రబాబు
Rayapati Sambasiva Rao: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు అస్వస్థత
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు అస్వస్థత
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Embed widget