Anita TDP: ఆయన నోటి పారుదల మంత్రి - గుడివాడ అమర్నాథ్ బలి పశువు - వంగలపూడి అనిత ఘాటు విమర్శలు !
పవన్, చంద్రబాబు భేటీని విమర్శిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. మంత్రులు శాఖల గురించి తప్పా అన్నీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Anita TDP: ముద్దులు పెట్టి గద్దె నెక్కిన సీఎం జగన్ పాలన లో గంజి కూడా తాగలేని పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత. విశాఖ టిడిపి కార్యాలయంలో అనిత మీడియాతో మాట్లాడారు. అన్ని నిత్యావసర ధరలు 300 రేట్లు పెంచారని మండిపడ్డారు.కనీసం సంక్రాంతి పండుగ చేసుకోలేని పరిస్థితి తెచ్చారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటి కోసం మాట్లాడే మంత్రులు తమ శాఖల మీద దృష్టి పెట్టాలన్నారు అనిత. నీటి పారుదల శాఖ మంత్రి ప్రాజెక్టులు కోసం మాట్లాడరని మండిపడ్డారు. మంత్రి అంబటి రాంబాబు గంగి రెద్దులు వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు.మంత్రి పదవి ఉండే అర్హత ఉందా ? అని ప్రశ్నించారు. గంగి రెద్దులు వారిని అవమానించి విధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు అనిత.
జగన్ రూ. వంద ఇచ్చి రూ. వేయి లాక్కుంటున్నారని అనిత విమర్శలు
పేద ప్రజలను మద్యానికి బానిసల్ని చేస్తున్నారని.. కల్తీ మద్యంతో వారి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారన్నారు. ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తాను అన్న మద్యం ధరను తగ్గించారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇప్పటికీ తమకు రావాల్సిన జీతాలు, పెన్షన్లు అందలేదన్నారు. జీవితాంతం ఉద్యోగం చేసి.. పెన్షన్ డబ్బులతో బతుకుతున్న వారిని జగన్ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ కొంత మంది లబ్దిదారులకు పది రూపాయలు ఇచ్చివంద రూపాయలు లాక్కొంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పేద ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్నామని.. పండుగలు వస్తే.. పేదలకు ఖర్చులకు ఇబ్బంది పడతారని పండుగ కానుకలు ఇచ్చామన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక తీసిపడేశారని... పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు.
అమ్మఒడి డబ్బులు వేశారు నాన్న బుడ్డికి లాగేసుకుంటున్నారు !
అమ్మఒడి డబ్బులు వేశారు నాన్న బుడ్డికి లాగేసుకుంటున్నాడని విమర్శించారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు తమకు 175కి 175 వస్తాయని ప్రచారం చేసుకుంటున్నారని.. ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. ధరలు పెంచినందుకా.. పన్నులు బాదినందుకా అని ప్రశ్నించారు. గుడివాడ అమర్నాథ్ ఒక బలి పశువు అని టీడీపీ నేత వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారని విమర్శించారు. గుడివాడ అమర్నాథ్ కుటుంబం టీడీపీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్లింది. వారి కుటుంబానికి టీడీపీ రాజకీయ అవకాశాలు కల్పించినా ఇప్పుడు దాన్ని గుర్తు పెట్టుకోకుండా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అనిత విమర్శిస్తున్నారు.
పవన్, చంద్రబాబు భేటీపై వైఎస్ఆర్‌సీపీ నేతల విమర్శలకు అనిత కౌంటర్
పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ తర్వాత వైఎస్ఆర్‌సీపీ మంత్రులు ఒకరి తర్వాత ఒకరు.. టీడీపీ, జనసేనపై ధాటిగా విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి టీడీపీ నేతలు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. వంగలపూడి అనిత కూడా.. పవన్, చంద్రబాబు భేటీపై విమర్శలు గుప్పించిన వారికి కౌంటర్ ఇచ్చారు.
శ్రీకాకుళంలో జనసేన సభ స్క్రిప్ట్, ప్యాకేజీ కోసం చంద్రబాబును పవన్ కలిశాడు: ఏపీ మంత్రులు ఫైర్