News
News
X

Andhra News : మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో స్వల్ప ఊరట - అప్పటి వరకూ బెయిల్‌ ఉన్నట్లే !

టీడీపీ నేత నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బెయిల్ రద్దు ను సవాల్ చేసిన పిటిషన్‌లో తుది తీర్పు వచ్చే వరకూ చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

FOLLOW US: 
Share:

Andhra News : ఏపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చిత్తూరు కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు తీర్పును సవాల్ చేస్తూ నారాయణ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకూ తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తాము తీర్పు ఇచ్చే వరకూ చిత్తూరు కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు ఉత్తర్వులు పక్కన పెట్టాలని ఆదేశించింది. దీంతో నారాయణకు బెయిల్ కొనసాగుతున్నట్లయింది.  హైకోర్టు తుది తీర్పును బట్టి పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 

తుది తీర్పు ఇచ్చే వరకూ నారాయణపై చర్యలొద్దన్న  హైకోర్టు 

చిత్తూరు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును జిల్లా కోర్టు కొట్టివేయడం సమంజసం కాదని నారాయణ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్ట్ ఇచ్చిన మార్గదర్శక సూత్రాలను తప్పించుకునేందుకే ఐపీసీలోని 409 సెక్షన్ పెట్టారని న్యాయవాది అన్నారు. నారాయణ 2014లోనే విద్యాసంస్థల డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన పత్రాలను కోర్టుకు అందించించారు. జిల్లా కోర్టు కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినలేదనే ఉద్దేశంతోనే బెయిల్ రద్దు చేసిందన్నారు.  సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నారాయణపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్ట్ 

పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అయితే న్యాయస్థానం అయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ నవంబర్ 30వ తేదీ లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.   నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.దీనిపైనే కోర్టున ుఆశ్రయించారు. 

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇటీవలే ఆయనను ఇంట్లో ప్రశ్నించిన సీఐడీ

మాజీ మంత్రి నారాయణపై సీఐడీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఇటీవలే  ఏపీ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ అవకతవకలపై ఆయనను సీఐడీ పోలీసులు ప్రశ్నించారు.  అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ.. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో సీఐడీ విచారణకు హాజరుకాలేడని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు నారాయణను హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో ప్రశ్నించవచ్చని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆయన కూతురు నివాసంలో నారాయణను ప్రశ్నించారు. తాజాగా ప్రశ్నాపత్రాల కేసులో ఆయనకు ఊరట లభించింది. 

‘బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి’ నారా లోకేష్

Published at : 29 Nov 2022 01:49 PM (IST) Tags: TDP leader Narayana Narayana bail cancellation question papers case

సంబంధిత కథనాలు

CM Jagan: తోడేళ్లన్నీ ఓవైపు, మీ బిడ్డ సింహంలా మరోవైపు - అస్సలు భయం లేదు: సీఎం జగన్

CM Jagan: తోడేళ్లన్నీ ఓవైపు, మీ బిడ్డ సింహంలా మరోవైపు - అస్సలు భయం లేదు: సీఎం జగన్

Batchula Arjunudu Hospitalised:: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత- చంద్రబాబు ఆరా!

Batchula Arjunudu Hospitalised:: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత- చంద్రబాబు ఆరా!

కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ

కృష్ణా  జిల్లా వైఎస్‌ఆర్‌సీపీలో రచ్చరచ్చ-  ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ

సీఐడీ విచారణకు విజయ్ హాజరు- తాడేపల్లి డైరెక్షన్‌లోనే ఇదంతా జరుగుతోందని టీడీపీ ఆరోపణ

సీఐడీ విచారణకు విజయ్ హాజరు- తాడేపల్లి డైరెక్షన్‌లోనే ఇదంతా జరుగుతోందని టీడీపీ ఆరోపణ

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

టాప్ స్టోరీస్

Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు

Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు

Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్

Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్

Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?

Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?

2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ పిటిషన్ - విచారణకు సుప్రీంకోర్టు ఓకే

2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ పిటిషన్ - విచారణకు సుప్రీంకోర్టు ఓకే