By: ABP Desam | Updated at : 29 Nov 2022 03:07 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
వివేకానంద రెడ్డి హత్య కేసు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేయడంపై తెలుగు దేశం పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ వ్యవహారంపై ట్విటర్ ద్వారా స్పందించారు. బాబాయ్ కేసు పక్క రాష్ట్రానికి.. అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి.. అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కి ‘అబ్బాయ్ కిల్డ్ బాబాయ్’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు.
బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి... అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి..#AbbaiKilledBabai pic.twitter.com/QYOwEjaBxj
— Lokesh Nara (@naralokesh) November 29, 2022
చంద్రబాబు కూడా
ఈ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయిందని, అది కూడా జగన్ సీఎంగా ఉండగా! అన్నారు. సుప్రీం ఆదేశాలతో జగన్ తలెక్కడ పెట్టుకుంటారు అంటూ విమర్శలు చేశారు. జగన్ సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయ్ చంచల్‌గూడ జైలుకు అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేశ్ "అబ్బాయ్ కిల్డ్ బాబాయ్" అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు.
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసింది. హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈ కేసును బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తండ్రి వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యాలంటూ ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో ఈ కేసు విచారణ సక్రమంగా జరిగే అవకాశం లేదని, గతంలో సాక్షులు, అప్రూవర్‌గా మారిన వారు కూడా అనుమానాస్పద రీతిలో మరణించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమార్తె ఈ కేసు విచారణ పట్ల బాగా అసంతృప్తితో ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లుగా జస్టిస్ ఎంఆర్ షా వెల్లడించారు.
ఇంకా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇవీ..
తీర్పులో భాగంగా జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘విచారణ పట్ల బాధిత కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉన్నందున వారి ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నాం. ఈ హత్య కేసులో సాక్షాలను నాశనం చేసిన ఆధారాలు ఉన్నాయి. ఒక దురాలోచనతో దాగిన కుట్ర ఈ కేసులో దాగి ఉంది. అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్షాలను ధ్వంసం చేశారు. ఈ పరిణామాలన్నింటిలో ఉన్న కుట్ర కోణం బయటకి రావాలంటే తదుపరి విచారణ కొనసాగాలి. కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో విచారణ జరగడం కంటే పక్క రాష్ట్రంలో విచారణే సరి అని భావిస్తున్నాం.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
TDP Protest: ముడసరలోవ పార్కు వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన - భూములు ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్
Tirumala News : జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.123 కోట్లు, ఫిబ్రవరి 5న గరుడ సేవ - టీటీడీ ఈవో ధర్మారెడ్డి
YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో కీలక మలుపు - కడపలో ఆ ఇద్దరి విచారణ
Annamayya District Crime: విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు- అన్నమయ్య జిల్లాలో కలకలం
Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్ ర్యాంక్
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?