Chandrababu: 'రాజధాని ఫైల్స్' సినిమా అందరూ చూడాలి' - అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుందంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్
Andhrapradesh Politics: ముఖ్యమంత్రిగా ఉన్న ఓ వ్యక్తి ఓ ప్రాంతంపై కక్ష గట్టి విధ్వంసం సృష్టించారని.. ఇది ఓ విషాదమని ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
Chandrababu Tweet on Rajadhani Files Movie: సీఎం స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఓ ప్రాంతంపై కక్షగట్టి.. రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. అధికార బలం అండతో ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలు, దారుణాలకు 'రాజధాని ఫైల్స్' (Rajadhani Files) చిత్రం అద్దం పట్టిందని పేర్కొన్నారు. తెలుగు ప్రజలంతా థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలని పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన రాజధాని.. దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజల కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు. అందుకే ఈ చిత్ర విడుదలను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారని.. కానీ న్యాయస్థానంలో వారి ఆటలు సాగలేదని పేర్కొన్నారు. 'జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది. అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది... కాస్కో' అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతం పై కక్షగట్టి... అది కూడా రాష్ట్ర రాజధాని పై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి. ఇది ఒక చారిత్రాత్మక విషాదం. దీని కోసం కులాల కుంపట్లు రాజేసాడు. విష ప్రచారాలు చేయించాడు. అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు… pic.twitter.com/ZpAESYy3a1
— N Chandrababu Naidu (@ncbn) February 16, 2024
Also Read: Tdp Joinings: టీడీపీలోకి లావు, త్వరలో సైకిల్ ఎక్కనున్న నరసరావుపేట ఎంపీ!