అన్వేషించండి

TDP News : తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఓటర్ల జాబితా గోల్ మాల్ - టీడీపీ తీవ్ర ఆరోపణలు

ఏపీ ఓటర్ల జాబితా గోల్ మాల్ తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరుగుతోందని టీడీపీ ఆరోపించింది. నిజమైన ఓటర్ల ఓట్లు కాపాడేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందన్నారు.


TDP News :  ఏపీ ఓటర్ల జాబితాలో అనేక అవకతకవలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్  బాబు ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో కొన్ని నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ బూత్ లకు సంబంధిం చిన ఓటర్ల జాబితాలు లేవు. ఎలక్షన్ కమిషన్ తమకు అందించిన ఓటర్ల జాబితాలో బూత్ ల వారీ ఓటర్ల వివరాలు లేవు. పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాలలో బూత్ లకు సంబంధించిన వివరాలు లేవు. మరో ప్రధాన అంశం ఏమిటంటే ఓటర్ల జాబితాలో  వైసీపీ ప్రభుత్వం భారీ స్థాయిలో జరిపించిన అవకతవకలు. ముఖ్యంగా ఉరవకొండ.. చీరాల.. విశాఖపట్నం నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలోని అర్హులైన ఓటర్లను ఇంకా తొలగించారని ఆరోపించారు. 

ఓట్ల తొలగింపు కుట్రలు తాడేపల్లి ప్యాలెస్‌లో 

రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న ఫామ్ -7 దరఖాస్తులు .. వాటి ద్వారా జరిగే ఓట్ల తొలగింపుకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడం కోసం  జగన్  ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ పెద్ద బృందాన్నే నియమించింది. ఏఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు తొలగించాలి.. తద్వారా వైసీపీ అభ్యర్థుల్ని ఎలా గెలిపించాలనే పక్కా ప్రణాళికలు....వ్యూహాలు అన్నీ తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే అమలవుతున్నాయని అశోక్ బాబు ఆరోపించారు. అర్హుల ఓట్లు .. టీడీపీ ఓట్లు తొలగిస్తే తమ గెలుపు తేలికవుతుందనే భ్రమల్లో వైసీపీ ఉందని మండిపడ్డారు.  ఉరవకొండ నియోజకవర్గంలో 6, 7 వేల ఓట్లు తొలగిస్తే.. సహజంగా అది గెలుపోటము లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలానే చీరాల.. విశాఖపట్నం తూర్పు, పర్చూరు నియోజకవర్గాలపై కూడా దృష్టిపెట్టారని ఆరోపించారు.   టీడీపీ ఓట్లు.. న్యూట్రల్ గా ఉండేవారి ఓట్లు తొలగిస్తే తమపార్టీ అభ్యర్థుల గెలుపు తేలికవుతుందనే భ్రమల్లో అధికారపార్టీ ఉందిని మండిపడ్డారు.  

ఓట్లను బంగారం కంటే మిన్నగా కాపాడటానికి టీడీపీ ప్రయత్నిస్తోంది
                                                                                                                                                                                           ప్రభుత్వం అర్హుల ఓట్లు తొలగించడం.. దొంగఓట్లు సృష్టించడం చేస్తుంటే..ఆ తంతులో కొందరు అధికారులు నిస్సిగ్గుగా పాలుపంచుకుంటున్నారు. కొన్నిచోట్ల వీ.ఆర్.ఏలు.. ఈ.ఆర్.వోలు, వాలంటీర్లు వారి ఇళ్లల్లో పెళ్లికి పనిచేసినట్టు.. వైసీపీనేతలు..అధికారపా ర్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో ఫామ్ -7ల ద్వారా అడ్డగోలుగా ఓట్లు తొలగిస్తున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లి జిల్లా కొవ్వూరులో వీఆర్ఏ ప్రభావతిని సస్పెండ్ చేశారు. ఆమె చేసిన అతిపెద్ద తప్పేమిటంటే.. 13 మంది బతికున్నవారిని చనిపోయిన ట్టుగా ఫామ్ -7లు ఇవ్వడం. నియోజకవర్గాల వారీగా వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు  ఇలాంటి తప్పులు తమ దృష్టికి వస్తున్నాయి.ఓట్లను  కాపాడటానికి.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల వారీగా చాలా జాగ్రత్తగా ఓటర్లజాబితాను పరిశీలిస్తోంది. బంగారం కంటే మిన్నగా ఓట్లను కాపాడటం కోసం శ్రమిస్తోందని అశోక్ బాబు స్పష్టం చేశారు.  

 ఎవరైనా సరే తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే
 
ఓటర్ జాబితా పరిశీలనలో భాగంగా ఇళ్లకు వెళ్లినప్పుడు  ఆ ఇళ్లల్లో ఎవరైనా లేకపోతే వాలంటీర్లు ఎవరూ లేరంటూ ఫామ్ -7 ల ద్వారా ఓట్లు తీసేస్తున్నారు. ఇళ్లల్లోని ఓటర్లు స్థానికంగా లేరనో.. చనిపోయారనో చెబుతూ బూత్ కు ఇన్ని ఓట్లు తీసేయాలనే లక్ష్యంతో వాలంటీర్లు పనిచేస్తున్నారు. కాకినాడలో వైసీపీనేతలే నేరుగా ఓటర్లజాబితా పరిశీలనలో వేలుపెట్టి.. ఫామ్ -7 దరఖాస్తులు అందించారు. వారిపై ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసులు పెట్టారు. అలానే గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతిలో పోలైన దొంగఓట్లపై పెట్టిన కేసుల్లో ఇంతవరకు ఎలాంటి పురోగతిలేదు. గ్రాడ్యుయేట్లు కాని వారు ఓట్లు వేశారని నిరూపిస్తూ..టీడీపీ ఆధారాలిచ్చినా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? కొన్నిచోట్ల కలెక్టర్లే వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ఎవరైనా సరే చేసే తప్పులకు మూల్యం చెల్లించుకుంటారు. ఎలాంటి ఫామ్ లు అందించినా అవన్నీ రికార్డెడ్ అని.. చట్టాలపరంగా తప్పించుకోలేమనే వాస్తవాన్ని అధికారులు గుర్తుం చుకోవాలని హెచ్చరించారు. 

నిజమైన ఓట్లు కాపాడేందుకు తెలుగుదేశం ఎంతదూరమైనా వెళ్తుంది
                                                                                                                                                                                              డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం రాష్ట్రంలో 4,02,21,450 మంది ఓట్లుంటే...వాటిలో 15 లక్షల ఓట్లు యాడ్ చేస్తే.. 13 లక్షలు తొలగించారు. 6.50 లక్షల ఓట్లను అదర్ ఎన్ రోల్ మెంట్ కింద చూపారు.. అదర్ ఎన్ రోల్ మెంట్ అంటే ఏమిటో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని అశోక్  బాబు డిమాండ్ చేశారు.  వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఓట్లు ఉంటే.. ఆధార్ సీడింగ్ ప్రొసీజర్ ప్రకారం బీ.ఎల్.వోలు తొలగించే ఓట్లపై కూడా కమిషన్ దృష్టి పెట్టాలన్నారు.  టీడీపీ ఫిర్యాదులపై స్పందించి, సున్నా  డోర్ నెంబర్లు.. తప్పుడు డోర్ నెంబర్లపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  నిజమైన ఓట్లను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతదూరమైనా వెళ్తుందని  అశోక్ బాబు తేల్చిచెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget