Chandrababu Fibernet Case : కేసులపై ఎవరూ మాట్లాడొద్దు - చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం !
Supreme court : ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. కేసులపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని ఇరు వర్గాలకు సూచించింది.
Chandrababu Fibernet Case Supreme court : ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. బర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆస్రయించారు. చంద్రబాబు కేసుల విషయంలో ఇరు వర్గాలు ఎటువంటి వాఖ్యలు చేయొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అయితే చంద్రబాబు కేసులకు సంబంధించిన వ్యాఖ్యలను బయట చేస్తున్నారని.. ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ఎదుట వాదించారు. ఆయన బయట ప్రసంగించకుండా ఆంక్షలు విధించాలన్నారు. చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లూధ్రా చంద్రబాబు ఎక్కడా కేసుల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపునే అడ్వకేట్ జనరల్ తో పాటు.. సీఐడీ డీజీ పలు నగరాల్లో ప్రెస్మీట్లు పెట్టి కేసు వివరాలను.. సున్నితమైన అంశాలను, ఆరోపణలతతో చేశారననారు. ఈ వివరాలను సుప్రీంకోర్టు ముందు ఉంచాలనిప్రత్యేక దరఖాస్తు పెట్టుకోవాలని ధర్మాసనం సూచించింది తుదపరి విచారణ జనవరి 17వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేసింది.
క్వాష్ పిటిషన్ పై తీర్పు అక్టోబర్ 18వ తేదీన రిజర్వ్
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు అక్టోబర్ 18వ తేదీన రిజర్వ్ చేసింది. అప్పటి నుంచి తీర్పు పెండింగ్ లో ఉంది. గత విచారణ సమయంలో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాత విచారణ చేస్తామని తెలిపామని ఆ తీర్పు ప్రాసెస్ లో ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. పన్నెండో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్వాష్ పిటిషన్ పై తీర్పు డిసెంబర్ పన్నెండో తేదీ లోపు వస్తుందని భావిస్తున్నారు.
చంద్రబాబు పిటిషన్లపై విచారణల్లో వరుస వాయిదాలు
చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన ఇబ్బడిమబ్బడి కేసుల గురించి అటు ఏసీబీ కోర్టులో.. ఇటు హైకోర్టులో.. సుప్రీంకోర్టులో అదే పనిగా విచారణకు వస్తున్నాయి. కానీ క్వాష్ పిటిషన్ పై తీర్పు రాని కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరికి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కూడా ఈ కారణంగానే వాయిదా పడింది. ఆ కేసు పదకొండో తేదీకి వాయిదా పడింది. హైకోర్టులో కూడా వివిధ కేసుల్లో ముందస్తు బెయిల్స్ పై విచారణ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది.
క్వాష్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ
క్వాష్ పిటిషన్ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే.. ఆయన పై పెట్టి నకేసులన్నీ అక్రమం అని తేలుతాయి. కోర్టుల్లో ఉన్నవన్నీ తేలిపోతాయి. వాటికి విచారణ అర్హత కూడా ఉండదు. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు చెబితే మాత్రం.. అన్ని కేసుల్లో విచారణలు దాదాపుగా పూర్తయినందున.. తీర్పులు వెల్లడించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో చంద్రబాబును రాజకీయానికి దూరం చేయాలనుకుంటున్న జగన్ రెడ్డి పన్నాగాలు వర్కవుట్ అవుతాయా లేదా అన్న క్వాష్ పిటిషన్ పై తీర్పును బట్టి వెల్లడయ్యే అవకాశం ఉండటంతో.. అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.