AP Elections 2024 : గుంటూరు రేంజి ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి - బదిలీ అయిన వారి స్థానాల్లో నియామకాలు
Andhra News : ఈసీ బదిలీ చేసిన ఎస్పీలు, కలెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమించారు. గుంటూరు రేంజి ఐజీగా త్రిపాఠిని నియమించారు.
SPs and Collectors Opointed in Andhra : ఈసీ బదిలీ చేసిన ఐపీఎస్, ఐఏఎస్‌ల స్థానాల్లో కొత్త వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గా డీకే బాలాజీని నియమించారు. అనంతపురం కలెక్టర్ గా వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను నియమించారు. గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాటి, ప్రకాశం ఎస్పీగా సునీల్, పల్నాడు ఎస్పీగా బింధు, చిత్తూరు ఎస్పీ మణికంఠ, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్ధార్ , నెల్లూరుఎస్పీ ఆరీఫ్ ను నియమించారు. వీరందరూ గురువారమే విధుల్లో చేరాలని ఆదేశించారు.
వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులతో బదిలీలు
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఉన్నతాధికారులపై మొదటి సారి తీసుకునన చర్యల్లో కీలక అధికారులు బదిలీ అయ్యారు. సిఈసి చర్యలు తీసుకున్న వారిలో గుంటూరు రేంజ్ ఐజి పాలరాజు .. ఎస్‌పిలు పరమేశ్వరరెడ్డి (ఒంగోలు), వై.రవి శంకర్‌రెడ్డి (పల్నాడు), పి.జాషువా (చిత్తూరు), ఎస్‌పి కెకె అన్బురాజన్ (అనంతపురం) కె.తిరుమలేశ్వర్ (నెల్లూరు) కూడా వేటు పడిన వారి జాబితాలో ఉన్నారు. ప్రధాని సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించి కూడా వీరిలో కొందరిపై ఇసి చర్యలు తీసుకుంది. మొత్తంమీద ఆరుగురు ఐపిఎస్ అధికారులపై ఈసి వేటు వేసింది.
ముగ్గురు కలెక్టర్లపైనా వేటు
ఓటర్ల జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న ముగ్గురు కలెక్టర్లపై కూడా ఎన్నికల కమిషన్ ఓటు వేసింది. కృష్జా జిల్లా కలెక్టర్ రాజబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈ జాబితాలో ఉన్నారు. ఈ చర్యలను తక్షణమే తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇసి అత్యవసర నోటీసు పంపింది. వేటు వేసిన అధికారులంతా తమ బాధ్యతల్ని దిగువ స్ధాయి అధికారులకు వెంటనే అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో వారందరూ ఉత్తర్వులు వచ్చిన రోజునే రిలీవ్ అయయారు. టుకు గురైన అధికారులను ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని .. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదనిస్పష్టంచేసింది.
ఎన్నికల కోడ్ అమలులో నిర్లక్ష్యం
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. సంబంధిత ఎస్‌పిలను సిఇఓ ముఖేష్‌కుమార్ నేరుగా పిలిపించి వివరణ తీసుకున్నారు. ప్రధాన మంత్రి సభలో సెక్యూరిటీ లోపాలపై గుంటూరు రేంజ్ ఐజి జి.పాలరాజు పల్నాడు ఎస్‌పి రవిశంకర్‌రెడ్డిలపై ఇసి వేటు వేసింది. ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంపై అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమి, జిల్లా ఎస్‌పి అన్బురాజన్ అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో పాటు, ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా పట్టించుకోలేదంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక రాజకీయ హత్యకు సంబంధించి అక్కడి ఎస్‌పిపై చర్య తీసుకున్నట్లు సమాచారం. నెల్లూరు, చిత్తూరు ఎస్‌పిలు కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగానూ, ఏకపక్షంగానూ వ్యవహరించినట్లు ఈసికి ఫిర్యాదులు అందాయి.