Sharmila : రామోజీరావుకు షర్మిల నివాళి - ఇంటికెళ్లి కుటంబసభ్యులకు పరామర్శ
Andhra News: రామోజీరావు కుటుంబసభ్యలను షర్మిల పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Sharmila visited Ramoji Rao family members : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల హైదరాబాద్ లోని రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. రామోజీరావు మరణించినప్పుడు నివాళి అర్పించేందుకు రాలేకపోవడంతో ఆమె తాజాగా వారి ఇంటికి వెళ్లారు. ఫిల్మ్ సిటీలోని నివాసంలో రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో, ఇటీవల స్వర్గస్తులైన శ్రీ రామోజీ రావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి నివాసంలో కుటుంబసభ్యులను కలిసి పరామర్శించటం జరిగింది. pic.twitter.com/lhfpNqUhBB
— YS Sharmila (@realyssharmila) June 19, 2024
రాజకీయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ..రామోజీరావుకు వ్యతిరేకంగా ఉండేవారు. రామోజీరావు మీడియా గ్రూప్ తమకు వ్యతిరకంగా ఉంటుందన్న ఉద్దేశంతో పలుమార్లు కేసులు కూడా పెట్టారు. మార్గదర్శి విషయంలో ఈ వివాదాలు తారస్థాయికి వెళ్లాయి. అయితే వైఎస్ చనిపోయిన తర్వాత ఈ వివాదాలు సద్దుమణిగాయి. కానీ వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి రామోజీరావుపై మళ్లీ కేసులు పెట్టారు. అయితే షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకోవడం.. తర్వాత ఏపీలో రాజకీయాలు ప్రారంభించారు. అయితే ఈనాడుపై జగన్ లా షర్మిల విమర్శలు చేయడం లేదు. ఇప్పుడు నేరుగా ఇంటికి వెళ్లి పరామర్శించడం ఆసక్తికరంగా మారింది.
మరో వైపు షర్మిల సోదరుడు, వైసీపీ అధినేత జగన్ రామోజీకి ట్వీట్ ద్వారా నివాళి ప్రకటించారు.
వ్యాపార, మీడియా రంగంలో దిగ్గజం రామోజీరావు
రామోజీరావు ఓ మీడియా దిగ్గజం.. మీడియా మోఘల్.. మీడియా టైకూన్.. వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు.. ఇటు సినీ నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ అయ్యారు. తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన ఘనత రామోజీది. తెలుగు జాతి యశస్సుని కాపాడిన భీష్మాచార్యుడు రామోజీరావు. ఎన్నోసార్లు నియంతృత్వ ప్రభుత్వాలకు , ప్రభుత్వాధినేతలకు తలవంచకుండా ఎదురునిలబడి పోరాడిన రామోజీ అంటే మహామహా ప్రభుత్వాధినేతలకు... రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం హడల్ అని చెప్పాలి. ఈనాడు ఆవిర్భవించాక అందులో వచ్చే వార్తలు అంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు హడల్. ఇక 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నిజం చెప్పాలంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయనే పెద్ద పోరాటం చేసి.. ఆయనే ఓ ప్రతిపక్షమై ఎన్టీఆర్ గెలుపులో కీలకం అయ్యారు. ఆయన తన ఎనభై ఎనిమిదో ఎట మరణించారు.