YS Sharmila: లిక్కర్ స్కాంలో తవ్వాల్సింది చాలా ఉంది - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ బయట పెట్టిన విషయాలు చాలా చిన్నవని షర్మిల అన్నారు. పన్నులు చెల్లించకుండా పెద్ద మొత్తంలో లిక్కర్ అమ్మారని ఆరోపించారు.

Sharmila On AP liquor scam: లిక్కర్ స్కాం లో సిట్ విచారణ కొండను తవ్వి ఎలకను పట్టినట్లుందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు. ఎంతసేపు డిస్టిలరీ ల చుట్టే విచారణ సాగుతుంది.. లిక్కర్ స్కాం వెనుక కమీషన్లు మాత్రమే చూపుతున్నారన్నారు. కానీ క్యాష్ రూపంలోనే లావాదేవీలు నిర్వహించి.. పన్నులు చెల్లించని మద్యాన్ని పెద్ద ఎత్తున అమ్మారని ఆరోపించారు.
డెన్ లు ఉన్నాయని, కిక్ బ్యాగ్స్ అందాయని,నెలకు 50 నుంచి 60 కోట్లు ముడుపులు అందాయని అంటున్నారు.. లిక్కర్ స్కాం ఇంతకే పరిమితం కాదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కాం లో 3500 కోట్లు మాత్రమే కాదున్నారు. డిస్టిలరిల దగ్గర నుంచి కన్జ్యుమర్ వరకు మద్యం చేరడం మొత్తం కుంభకోణం మే .. లిక్కర్ స్కాంలో ప్రపంచంలో ఎక్కడ లేని అవినీతి జరిగిందని స్ఫష్టం చేశారు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతి ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమేనని.. డిజిటల్ పేమెంట్స్ ఉండాలని చెప్పే ఈ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ అనడం బహుశా ఎక్కడా జరగలేదన్నారు. ఓన్లీ క్యాష్ పద్ధతిలో మద్యం అమ్మకాలు చేసింది అనధికార అమ్మకాల కోసమేనని.. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను భారీగా అమ్మారు .. అనధికార మద్యం అమ్మి వేల కోట్లు దోచేశారన్నారు.
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ స్కాం మీద శ్వేతపత్రం ఇచ్చారని.. లక్ష కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే డిజిటల్ పేమెంట్స్ కేవలం 600 కోట్లు వచ్చాయన్నారు. 99 వేల కోట్లు ఎక్కడ పోయాయో తెలియదు అన్నారని. ఒక్క శాతం కూడా లిక్కర్ సొమ్ము ప్రభుత్వానికి రాలేదు అన్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఆరోపణలో విచారణ జరపాల్సి ఉందని డిమాండ్ చేశారు. లక్ష కోట్ల లిక్కర్ స్కాం పై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. YCP హయంలో ట్రస్టెడ్ లిక్కర్ అమ్మలేదు.. హానికరమైన మద్యాన్ని అమ్మారు .. అటువంటి కంపెనీలకే అనుమతులు ఇచ్చారు.. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 30 లక్షల మందికి కిడ్నీ,లివర్ సమస్యలు వచ్చాయని కూటమి ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రంలో హానికరమైన మద్యాన్ని తాగి 30 వేల మంది వరకు చనిపోయారని చెప్పారు. లక్షల మందికి నరాల బలహీనత సమస్యలు వచ్చాయని మీరు నియమించిన కమిటీలు రిపోర్ట్ ఇచ్చాయి. ఈ అంశంపై కూడా దర్యాప్తు జరగాలన్నారు.
క్యాష్ పద్ధతిలో ఎందుకు అమ్మకాలు చేశారో విచారణ జరగాలి... ట్రస్టెడ్ కంపెనీ ల లిక్కర్ ను ఎందుకు నిషేధించారో విచారణ జరగాలి..లిక్కర్ విచారణ సందర్భంగా జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. జగన్ కి అవసరం అయిన వాటిని మాత్రమే సమాధానం చెప్తారు.. ఆయనకు హాని అనుకున్నవి మాత్రం నోరు విప్పరని మండిపడ్డారు. రుషికొండ ను ఎందుకు గొరిగారో చెప్పలేదు ? వివేకా హత్య విషయంలో సాక్షి గుండెపోటు అని చెప్తే దానికి సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు. రక్తపు మడుగులో వివేక హత్య జరిగితే హార్ట్ ఎటాక్ అని కథలు అల్లారని మండిపడ్డారు. సమాధానం చెప్పాల్సిన పాయింట్ ను పక్కన పెట్టీ చుట్టూ ఉన్న అంశాలు మాట్లాడటం జగన్ కి అలవాటన్నారు. జగన్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలని.. విచారణను బట్టి ఏం నిర్ణయం తీసుకుంటున్నారో చూస్తున్నామన్నారు.





















