అన్వేషించండి

YS Sharmila Bus : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల

RTC Bus : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై షర్మిల ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించారు. విజయవాడ నుంచి తెనాలికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

Sharmila innovatively questioned the government on free bus travel for women : తెలుగదేశం పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటి అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.  విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో టిక్కెట్ తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా నిర్ణయం తీసుకోరా ? 

చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయింది. అయినా ఉచిత బస్సు ప్రయాణంపై ఇంత వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు.  రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారని..   తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలో అమలు చేశారని గుర్తు చేశారు.  కర్ణాటకలో కూడా అమలు చేస్తున్నారు. కానీ మీకు మాత్రం పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించారు.  

నెలకు రూ. మూడు వందల కోట్లు ఇవ్వాల్సి వస్తుందని భయపడుతున్నారా ?                

రాష్ట్రంలో ప్రతి రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని..  రోజు మహిళల ద్వారా  7-10 కోట్లు అంటే నెలకు రూ.300 కోట్లు ఆదాయం ఆర్టీసీకి వస్తోందన్నారు.   ఉచిత ప్రయాణం కల్పిస్తే...ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుంది అని భయపడుతున్నారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.  . మహిళల చేత ఓట్లు వేయించుకున్నారు.. ఇప్పుడు మహిళల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు.  మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పధకాలు మహిళలవేనన్నారు.  ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు ఇలాంటి తక్కువ ఖర్చు పథకం కూడా మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదా అని మండిపడ్డారు.  

సీఎంకు మహిళల నుంచి  పోస్టు కార్డులు                            

ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటన్నారు.  5 ఏళ్లు ఇలానే కాలయాపన చేస్తారా చెప్పాలన్నారు.  ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భద్రత ఉంటుంది. ఇది చాలా మంచి పథకం.  వెంటనే ఉచిత ప్రయాణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి. మహిళలకు భరోసా కావాలి. మహిళలకు భద్రత విషయంలో ముందడుగు పడాలి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు పంపిస్తున్నామని తెలిపారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Ratan Tata Death Reason: రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?
రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Embed widget