అన్వేషించండి

AP Cabinet: పండగలా ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవం - ఆటోడ్రైవర్లకూ సాయం - కేబినెట్‌లో మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం

Free Bus AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఉచిత బస్సు పథకం ప్రారంభించే ముందే ఆటోడ్రైవర్లతో చర్చించి వారికి సాయం చేయాలన్నారు.

AP Cabinet meeting : ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్న ఉచిత బస్సు స్కీమ్‌పై  మంత్రులకు చంద్రబాబు కేబినెట్ మీటింగ్ లో దిశానిర్దేశం చేశారు.  ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కేబినెట్‌ మంత్రులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.   సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను  మంత్రులకు చంద్రబాబు వివరించారు.  జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి ఇష్టపడటం లేదన్నారు.  సీఐడీ పేరుతో అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రులను బెదిరించారని చంద్రబాబు చెప్పారు. కేసులు పెడతామని వాళ్లను బెదిరించారన్నారు. ఈ కారణంగానే సీడ్ క్యాపిటల్‌లో తాము భాగస్వామ్యం అయ్యేది లేదని చెప్పారన్నారు. 

అయితే స్నేహ సంబంధాలు కొనసాగించాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరామన్నారు. అక్కడి పారిశ్రామికవేత్తలను పార్టనర్షిప్ సమ్మిట్ కు రావాలని అహ్వానించానన ితెలిపారు. కేబినెట్ సమావేశంలో కొత్త బార్ పాలసీను ఆమోదించారు.   కల్లు గీత కార్మికుల కోసం పది శాతం బార్లు కేటాయించారు. వాటిలో బినామీలు ఉండకూడదని.. కల్లు గీత కార్మికులకే దక్కాలని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఉచిత ప్రయాణం ప్రారంభానికి ముందే.. ఆటో డ్రైవర్లను పిలిపించి   మాట్లాడాలని  మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో సూచించడంతో చంద్రబాబు అంగీకరించారు.  ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.   

 మంత్రులు ఏడాది కాలంలో మెరుగ్గా పనిచేశారు.. ఇక నుంచి పరిపాలనలో దూకుడు పెంచాలని సలహా ఇచ్చారు.  తప్పుడు వార్తలు నిజం చేసే దిశగా వైసీపీ కుట్రలు చేస్తోందని ..వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  పోలీసులు, రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. అంతర్జాతీయ సంబంధాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  సింగపూర్ విధానాలు అధ్యయనం చేసేందుకు.. మంత్రులు దశల వారీగా సింగపూర్ వెళ్లాలని సూచించారు.  ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉంది..మంత్రుల పనితీరుతో ప్రజల్లో సానుకూలత పెరగాలన్నారు.  జనసేన, బీజేపీ నేతలు మాట్లాడుకుని లోపాలు సరిదిద్దుకోవాలి.. తమ శాఖలపై మంత్రులు రిపోర్టు తయారుచేసుకోవాలని సూచించారు.  వచ్చే కేబినెట్ సమావేశం నుంచి ఒక్కో మంత్రితో తమశాఖ ఘనతపై మాట్లాడిస్తామన్నారు.  

సిట్‌ దర్యాప్తు ఆధారంగా అరెస్టులు ఉంటాయి.. లిక్కర్‌ కేసు విషయంలో మంత్రులు ఆచితూచి స్పందించాలని మంత్రులకు సూచించారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి  పార్థసారధి తెలిపారు. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు.                              

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget