అన్వేషించండి

Senior Citizen Savings Scheme: ఈ స్కీమ్ తో నెలకు రూ. 20 వేల ఆదాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Senior Citizen Savings Scheme: రిటైర్మెంట్ లైఫ్ సాఫీగా సాగిపోయేందుకు కేంద్ర సీనియర్ సిటిజన్ స్కీమ్ ను అమలు చేస్తుంది. ఈ స్కీమ్ లో పెట్టుబడులకు అధిక రాబడి పొందవచ్చు.

Senior Citizen Savings Scheme: చాలా మందికి రిటైర్మెంట్ తర్వాత తగిన ఆదాయం ఉండదు. ఇన్నాళ్లు ఉద్యోగం చేసిన సంపాదించిన మొత్తాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే.. లైఫ్ సాఫీగా సాగిపోతుంది.  ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ అమలు చేస్తుంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల ఈ స్కీమ్ కు అర్హులు. కనీసం రూ. 1000 నుండి రూ. 30 లక్షల వరకు 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. దీనిపై ప్రస్తుతం ఏడాది 8.2% వడ్డీ లభిస్తుంది.

ఈ స్కీమ్ లో ఒకేసారి డబ్బు డిపాజిట్ చేయవచ్చు. దానిపై వచ్చే వడ్డీతో ప్రతీ మూడు నెలలకోసారి ఆదాయం పొందవచ్చు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నెలకు రూ.20,000 పైగా వస్తుంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కాబట్టి మీ డబ్బుకు ఢోకా లేదు. పైగా రిస్క్ లేని స్కీమ్. చాలా బ్యాంకుల ఫిక్స్ డ్ డిపాజిట్ల కన్నా ఈ స్కీమ్ వడ్డీ రేటు ఎక్కువ. 

Also Read: ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ టాప్ 4 స్కీమ్స్ ఇవే! వీటిలో చేరితే భవిష్యత్ బంగారమే!

ముఖ్య వివరాలు 

  • 5 సంవత్సరాలకు పెట్టుబడి (మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు)
  • 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు 
  • కనీస పెట్టుబడి - రూ. 1,000
  • గరిష్ట పెట్టుబడి - రూ. 30 లక్షలు  
  • వడ్డీ రేటు - 8.2%
  • సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం

Also Read: డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!

SCSS పన్ను ప్రయోజనాలు

  • SCSS పథకంలో పెట్టుబడి మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానం కింద సెక్షన్ 80C ప్రయోజనాలు పొందలేరు.  
  • SCSS ఖాతాలలో మొత్తం వడ్డీ ఏడాదికి రూ. 1 లక్ష దాటితే టీడీఎస్ చెల్లించాలి.   
  • 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే, మొత్తం వడ్డీ ఏడాదికి రూ. 50,000 దాటితే టీడీఎస్ కట్ అవుతుంది.  

అర్హతలు

  • 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. 
  • 55-60 ఏళ్ల వయస్సు ఉండి, రిటైర్ అయిన ఉద్యోగులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన మొదటి నెలలోపు SCSS ఖాతాను తెరవవచ్చు.
  • 50- 60 ఏళ్లు వయస్సు ఉన్న రక్షణ శాఖ ఉద్యోగులు, పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన మొదటి నెలలోపు SCSS ఖాతాను తెరవవచ్చు. అయితే ఈ అకౌంట్ ను జీవిత
  • భాగస్వామితో కలిసి మాత్రమే తెరవవచ్చు.
  • ఎన్ఆర్ఐలు, హిందూ అన్ డివైడెట్ ఫ్యామిలీలు  అర్హులు కారు. 
  • ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్, ఆధార్ తప్పనిసరి. 

Read Also: వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి

అకౌంట్ క్లోజ్ చేస్తే జరిమానా   

  • ఏడాదిలోపు ఖాతాను మూసివేస్తే.. చెల్లించిన వడ్డీని అసలు నుంచి వసూలు చేస్తారు.  
  • 1-2 ఏళ్ల మధ్య ఖాతాను క్లోజ్ చేస్తే అసలుపై 1.5% ఫైన్ విధిస్తారు.  
  • 2 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేస్తే మొత్తంపై 1% జరిమానా 
     
    సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సింగిల్ అకౌంట్‌లో గరిష్ఠంగా  రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్‌ అయితే రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీరు రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.2.46 లక్షలు వడ్డీ రూపంలో వస్తుంది. అంటే ప్రతీ మూడు నెలలకు రూ.61,500, నెలకు సుమారు రూ.20,500 ఆదాయం వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం ఇది మంచి ఎంపిక.   

SCSS ఖాతా ఎలా ఓపెన్ చేయాలి?

పోస్టల్ వెబ్‌సైట్ నుంచి SCSS అకౌంట్ ఓపెన్ చేయడానికి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ను నింపి.. తగిన డాక్యుమెంట్స్ తో పోస్ట్ ఆఫీస్ సబ్మిట్ చేసి ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. 

కావాల్సినవి 

  • రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
  • పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు లేదా పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డులు 
  • ఆధారు కార్డు లేదా టెలిఫోన్ బిల్లు వంటి అడ్రస్ ఫ్రూఫ్ 
  • పాన్ కార్డు లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదా సీనియర్ సిటిజన్ కార్డు వయస్సు రుజువు  
  • ఈ డాక్యుమెంట్స్ ను స్వయంగా ధ్రువీకరించి సబ్మిట్ చేయాలి. 

Frequently Asked Questions

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అంటే ఏమిటి?

60 ఏళ్లు పైబడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే ఒక పొదుపు పథకం ఇది. దీని ద్వారా రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.

SCSS లో ఎంత పెట్టుబడి పెట్టవచ్చు మరియు వడ్డీ రేటు ఎంత?

కనీసం రూ. 1,000 నుండి గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం దీనిపై ఏడాదికి 8.2% వడ్డీ లభిస్తుంది.

SCSS లో పెట్టుబడి పెట్టడానికి అర్హులు ఎవరు?

60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. రిటైర్ అయిన ఉద్యోగులు, రక్షణ శాఖ ఉద్యోగులు కూడా కొన్ని షరతులకు లోబడి అర్హులు.

SCSS లో ముందస్తుగా ఖాతా మూసివేస్తే ఏమవుతుంది?

ఖాతాను ఏడాది లోపు మూసివేస్తే, చెల్లించిన వడ్డీని అసలు నుంచి వసూలు చేస్తారు. 1-2 ఏళ్ల మధ్య మూసివేస్తే 1.5%, 2 ఏళ్ల తర్వాత మూసివేస్తే 1% జరిమానా ఉంటుంది.

SCSS లో పన్ను ప్రయోజనాలు ఉన్నాయా?

సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు. అయితే, కొత్త పన్ను విధానంలో ఈ ప్రయోజనం వర్తించదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
YSRCP Leaders Legal Troubles: వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
Embed widget