Trains Cancelled: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - భారీ వర్షాలతో ఈ రైళ్లు రద్దు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Trains Information: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో భద్రతా కారణాల రీత్యా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు ద.మ రైల్వే ప్రకటించింది. అలాగే, కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు.
Trains Cancelled In Telugu States: భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని 8 జిల్లాలు, తెలంగాణలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆది, సోమవారాల్లో దాదాపు 30 రైళ్లు రద్దు కాగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సింహాద్రి, మచిలీపట్నం, గంగా - కావేరి, సంఘమిత్ర, గౌతమి, చార్మినార్, యశ్వంత్‌పూర్ రైళ్లను నిలిపేశారు.
ఈ రైళ్లు రద్దు
Bulletin No. 9, 10, 11 SCR PR No. 334 on "Cancellation/Diversion of Trains due to Heavy Rains" pic.twitter.com/E0GXd1pDTg
— South Central Railway (@SCRailwayIndia) September 1, 2024
Bulletin No. 13 - SCR PR No. 336 on "Cancellation/Diversion of Trains due to Heavy Rains" pic.twitter.com/KN7BB5BYqz
— South Central Railway (@SCRailwayIndia) September 1, 2024
అలాగే, సికింద్రాబాద్ - గుంటూరు (17202), విశాఖ - సికింద్రాబాద్ (20708) రైళ్లు రద్దు చేసినట్లు చెప్పారు. విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ (12713/12714), గుంటూరు - సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (17233), సికింద్రాబాద్ - గుంటూరు - సికింద్రాబాద్ (12705/12706) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అటు, తిరుపతి - కరీంనగర్ (12761), విశాఖ - న్యూఢిల్లీ (20805) రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
దారి మళ్లించిన రైళ్లు
మరోవైపు, భారీ వర్షాల క్రమంలో కొన్ని రైలు సర్వీసులను దారి మళ్లించారు. ఎర్నాకులం - నిజాముద్దీన్ (12645), త్రివేండ్రం - న్యూఢిల్లీ (12625), చెన్నై - న్యూఢిల్లీ (12615), చెన్నై - న్యూఢిల్లీ (12621), కొచువేలి - ఇండోర్ (22646), బెంగళూరు - ధనపూర్ (03246), ఆదిలాబాద్ - తిరుపతి - ఆదిలాబాద్ (17405/17406), న్యూఢిల్లీ - విశాఖ (20806), న్యూఢిల్లీ - చెన్నై (12616), అహ్మదాబాద్ - చెన్నై (12655), న్యూఢిల్లీ - త్రివేండ్రం (12626), న్యూఢిల్లీ - చెన్నై (12622), బిలాస్ పూర్ - చెన్నై (12851), నిజాముద్దీన్ - చెన్నై (12270), కోర్బా - కోచువెలి (22647) రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు.
అటు, విశాఖ - నాందేడ్ (20811), విశాఖ - తిరుపతి (12739), తంబరం - హైదరాబాద్ (12759), ధనపూర్ - బెంగుళూరు (03241), నిజాముద్దీన్ - కన్యాకుమారి (12642), ముంబయి - భువనేశ్వర్ - ముంబయి (11019/11020), విశాఖ - ఎల్‌టీటీ ముంబయి (18519), విశాఖ - హైదరాబాద్ (12727) రైళ్లను దారి మళ్లించారు.
హెల్ప్ లైన్ నెంబర్లు
భారీ వర్షాల దృష్ట్యా ప్రయాణికులకు రైళ్ల సమాచారం తెలియజేసేందుకు హెల్ప్ లైన్ నెంబర్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ - 27781500, సికింద్రాబాద్ - 27786140, 27786170, కాజీపేట - 27782660, 8702576430, వరంగల్ - 27782751, ఖమ్మం - 27782985, 08742 - 224541, 7815955306, విజయవాడ - 7569305697, రాజమండ్రి - 0883 - 2420541, 0833 - 2420543 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
SCR Sets Up Help Line Numbers in view of Heavy Rains@drmsecunderabad @drmhyb @drmgnt @drmgtl @drmvijayawada pic.twitter.com/FHyqjISxY6
— South Central Railway (@SCRailwayIndia) August 31, 2024
రైల్వే ట్రాక్ ధ్వంసం
మహబూబాబాద్ సమీపంలో అయోధ్య గ్రామంలో చెరువుకట్ట తెగి విజయవాడ - కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇంటికన్నె - కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. శివారులోని రైలు పట్టాలపై భారీగా వరద ప్రవహిస్తోన్న క్రమంలో మచిలీపట్నం, సింహపురి ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. అటు, విజయవాడ - కాజీపేట మార్గంలో ట్రాక్ పైకి వరద చేరికతో 24 రైళ్లను నిలిపేశారు.
Also Read: Vijayawada Rains: భారీ వర్షాలకు విజయవాడ విలవిల, ఒక్కరోజులోనే పాతికేళ్ల రికార్డు వర్షపాతం!