అన్వేషించండి

Merugu Nagarjuna: వైసీపీ మాజీ మంత్రికి ఊరట - మేరుగు నాగార్జునపై రేప్ కేసును క్వాష్ చేసిన ఏపీ హైకోర్టు

Andhra Pradesh: ఏపీ మాజీ మంత్రి మెరుగు నాగార్జుపై రేప్ కేసును క్వాష్ చేశారు. ఫిర్యాదు చేసిన మహిళ కేసును వెనక్కి తీసుకోవడం, పొరపాటున ఫిర్యాదు చేసానని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Rape case against former AP minister Murhu Nagarju quashed : వైసీపీ మాజీ మంత్రి మెరుగు నాగార్జునకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన అత్యాచారం కేసును హైకోర్టు క్వాష్ చేసింది.  మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది నవంబర్‌లో తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది.  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మేరుగు నాగార్జున రూ.90 లక్షలు తీసుకున్నాడని విజయవాడకు చెందిన బాధితురాలు   ఫిర్యాదులో పేర్కొంది. తనను శారీరంగా కూడా ఉపయోగించుకున్నారని పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. ఇప్పుడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖలో ఓ గిరిజన టీచర్‌ను స్లో పాయిజన్‌ ద్వారా చంపేశానని.. నీదే గతి పడుతుందని మేరుగు నాగార్జున పీఏ మురళి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు రావాలని రూ.90 లక్షలను ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.                      

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని.. ఫిర్యాదు చేసిన మహిళ తప్పుడు కేసు పెట్టినట్లుగా వాంగ్మూలం ఇచ్చిందని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ మహిళ కూడా నాగార్జునపై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని.. పోలీసులు కేసును కొట్టేస్తే అభ్యంతరం లేదని అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ ధర్మాసనం వెంటనే క్వాష్ చేయడానికి అంగీకరించలేదు. ముందు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత కోర్టుకొచ్చి కేసు కొట్టేయాలని కోరడాన్ని ఈమధ్య తరచూ చూస్తున్నామని.. బాధిత మహిళ కోరగానే కేసు కొట్టేయలేమని.. తప్పుడు ఫిర్యాదు చేసినట్ల తేలితే ఫిర్యాదుదారు కూడా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది.  

పోలీసులు కూడా ఈ కేసుపై విచారణ కొనసాగించారు. అయితే మహిళ సహకరించలేదు. దీంతో పోలీసులు కూడా దర్యాప్తు చేయడానికి ఏమీ లేకపోయింది. చివరికి హైకోర్టు కేసును క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యాచారం కేసు తీవ్రమైనది కావడంతో ఫిర్యాదు చేసిన మహిళతో మెరుగు నాగార్జున వెంటనే రాజీకి వచ్చారని.. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులను ఇచ్చేయడంతో కేసును ఉపసంహరించుకున్నారని.. తప్పుడు ఫిర్యాదు చేశానని కోర్టుకు అఫిడవిట్ సమర్పించారని.. ఆ వ్యవహారాలను కూడా వైసీపీకి చెందిన న్యాయవాదులే చూసుకున్నారని చెబుతున్నారు. 

అధికారం కోల్పోయిన తర్వాత పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై కేసులు నమోదవుతూండటంతో చాలా మంది సైలెంట్ అయిపోయారు. అత్యాచారం కేసు తీవ్రమైనది కావడంతో బాధిత మహిళతో రాజీకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి అనుకున్నది సాధించారు మాజీ మంత్రి.             

Also Read: Mahakumbh Viral Girl Monalisa: కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను  కట్టిపడేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Out Of Hockey World Cup: అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
Grey Hair : జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget