AP News: ఆ వీడియో మరీ ఇబ్బంది పెట్టేస్తుంది! YSRCP ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ ఆవేదన
YSRCP MLC Bommi Israel Dance Video: ఆ వీడియోలో అమ్మాయిలతో స్పెప్పులు వేసిన ఎమ్మెల్సీ ఎవరు అంటారా.. ఆయనే వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్.
YSRCP MLC Bommi Israel Dance Video: ఏప్పుడో నాలుగైదేళ్ల కిందటి వీడియో ఆ ఎమ్మెల్సీని తెగ ఇబ్బంది పెట్టేస్తుందంట. నాదీ నక్కిలీసు గొలుసు అంటూ తెగ డ్యాన్స్ ఇరగదీసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడంతో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో అప్రమత్తమైన ఎమ్మెల్సీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ వీడియోలో అమ్మాయిలతో స్పెప్పులు వేసిన ఎమ్మెల్సీ ఎవరు అంటారా.. ఆయనే వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్. సోషల్ మీడియాలో వీడియోలు ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ గిట్టని వ్యక్తులు గతానికి సంబంధించిన వీడియోలను సైతం పోస్ట్ చేసి ఇరుకున పెట్టిన ఘటనలు తరచుగా చూస్తుంటాం. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి అలాగే ఉంది.
సామాన్య కార్యకర్త అయిన తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చారని చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు బొమ్మి ఇజ్రాయేల్. నిజంగానే అప్పటివరకు ఆయన ఓ వార్డు మెంబరు. అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన ఈయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు. అమలాపురం వేదికగా మాదిగలతో సభ నిర్వహించిన ఇజ్రాయేల్ ఆ కార్యక్రమానికి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ముఖ్యఅతిథిగా పిలిచి అందరి దృష్టిలో పడ్డారు. 70 ఏళ్లుగా మాదిగలకు రాజకీయంగా ఎటువంటి అవకాశాల్లేవని ఆసభ సారాంశం కాగా ఇదే అంశంపై వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కేటాయించింది. అది కాస్తా ఇజ్రాయేల్‌కు అదృష్టం దక్కింది..
ఇంతకీ ఆ వీడియో ఎప్పటిది.?
నాదీ నక్కిలీసు గొలుసు అనే పాటకు వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ డ్యాన్స్ వేస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆయన ఓ వీడియోలో వివరణ ఇచ్చారు. ఆ వీడియో ఇప్పటిది కాదని, అయిదేళ్ల క్రితం ఓ ఫంక్షన్లో సరదాగా చేసిందని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ మెంబర్లు జరుపుకున్న ఓ ఫంక్షన్లో చేసిన విడియో అని తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కొందరు చేస్తున్న కుట్ర అని ఆయన చెప్పారు. అయితే ఆ వీడియో ఓ ఫంక్షన్లోదా లేక మరే ఉత్సవాల్లో చేసిందా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఫ్యాంటు జారిపోతున్నా ఏమాత్రం తగ్గడం లేదంటూ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్‌పై తెగ కామెంట్లు పెడుతున్నారు.
వార్డు మెంబరు నుంచి ఎమ్మెల్సీకు..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం గోడి గ్రామ పంచాయతీలో వార్డు మెంబరుగా పనిచేశారు ఇజ్రాయేల్. అంతకుముందు గోడి గ్రామ ఉపసర్పంచ్‌గా కూడా ఎన్నికయ్యారు. కుల సమీకరణాల్లో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో ఉన్న సాన్నిహిత్యం ఇజ్రాయేల్‌కు కలిసొచ్చింది. దీంతో శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఇజ్రాయేల్ ఎన్నికయ్యారు. ఇటీవలే రావులపాలెం నుంచి స్వగ్రామానికి భారీ ఊరేగింపుగా వచ్చారు ఇజ్రాయేల్. అయితే డ్యాన్స్ నెట్టింట బాగా వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో కోడిపందేల బరుల వద్ద ఇజ్రాయేల్ ఉన్న మరికొన్ని వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.