Godavari Sand Issue: గోదావరి పాయల్లో ఇసుక తవ్వకాలపై విజిలెన్స్ స్వ్కాడ్ బృందాలు.. నిషేధం అమలు ఇందుకేనా
గోదావరి నదీ పాయల్లో ఇసుక తవ్వకాలు నిషేదం, ఇసుక నిల్వ కేంద్రాల్లో అక్రమాలు చోటుచేసుకుండా ప్రత్యేక నిఘా స్క్వాడ్ విజిలెన్స్ బృందాలను ప్రభుత్వం నియమించింది..

Sand Mafia In Godavari Area | గోదావరి నదీ పాయల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం అమలు చేస్తున్న క్రమంలో అక్రమ తవ్వకాలపై పటిష్టమైన నిఘా విజిలెన్స్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. నదీ గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు ప్రశాంతి, మహేష్‌కుమార్‌లు హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో పర్యావరణ నిబంధన మేరకు జూన్ 1 నుండి అక్టోబర్ 15 వరకు నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు నిలిపివేసి ప్రతి నియోజకవర్గంలో ఇసుక నిల్వ కేంద్రాల ద్వారా ఏ అవసరానికైనా ఇసుకను తరలిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు నిర్వహించ కుండా గత మే 31వ తేదీ నుండి ఇసుక రీచులకు వెళ్లే మార్గాలకు ట్రించులు తవ్వగా.. జూన్ 1 నుండి అక్టోబర్ 15 వరకు ఈ నిషేధం అమలవు తుందని వారు స్పష్టం చేశారు.
నిషేధం ఇందుకేనా...
జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటికే గోదావరి నదీపాయల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ఈక్రమంలోనే ఇసుక అవసరాలను బట్టి ఇసుక నిల్వ కేంద్రాలను ప్రభుత్వ పర్యవేక్షణలో సిద్ధం చేశారు. ఎగువు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో త్వరలోనే గోదావరికి భారీ వరదలు పోటెత్తే అవకాశాలున్నాయి.. అయితే నదీ ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేలా, నదీ ప్రవాహ వేగం గతి తప్పకుండా సక్రమంగా సముద్రంలో కలిసేలా ఈ ముందస్తుగానే ఈ నిషేదాజ్ఞలు కొనసాగిస్తున్నారు.. మరో పక్క ఇసుక ర్యాంపుల ద్వరా నదీ కరకట్టలు పటిష్టత, ధ్వంసం అయిన చోట పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు.
అయితే ఇసుక తవ్వకాలు నిషేదించిన క్రమంలో ఇసుక కొరత తలెత్తకుండా ఇప్పటికే పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఆయా జిల్లా కలెక్టర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంబందిత అభివృద్ధి పనుల విషయంలో ఇసుక కొరత లేకుండా, అదేవిధంగా నిర్దేశిత ఇసుక కేంద్రాల ద్వారా ప్రజలు ఇసుకను కొనుగోలుచేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకున్నామంటున్నారు..
జాయింట్ కలెక్టర్లు నేతృత్వంలో విజిలెన్స్ స్వ్కాడ్ బృందాలు..
గోదావరి నదీ పాయల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై రీజనల్ విజిలెన్స్ స్వ్కాడ్ బృందాలు నియమించారు. ఇవి జాయింట్ కలెక్టర్ల సారధ్యంలో ఇవి పనిచేయనున్నాయి.. స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించి బిల్లులు జనరేట్, ఇసుక విక్రయాల రికార్డులను పరిశీలిస్తారు. పర్యావరణ నిబంధనల అతిక్రమించకుండా నదీ గర్భంలో ఇసుక త్రవ్వకాలు జరిపకుండా చర్యలు తీసుకుంటారు.. అదేవిధంగా నదీగర్భంలోకి వాహనాలు వెళ్లకుండా మార్గాలను ధ్వంసం చేయడం కూడా ఈ స్వ్కాడ్ బృందాలు పర్యవేక్షిస్తాయి.
నిల్వకేంద్రాల ద్వారానే ఇసుక సరఫరా..
నదీ గర్భంలో ఇసుక తవ్వ కాలు నిషేధిత సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు ఇసుక నిల్వలను సిద్ధం చేశారు. ఏ అవసరానికైనా నిల్వ కేంద్రం నుంచి ఇసుకను సరఫరా చేయనున్నారు. భవన, సీసీ రోడ్ల నిర్మాణ రంగాల అవసరాలకు ఇసుక నిల్వ కేంద్రాల నుండి మాత్ర మే ఇసుకను సరఫరా చేయ నుండగా సామాన్య ప్రజలకు నిర్దేశిత ఇసుక నిల్వ కేంద్రాలనుంచి ఇసుకను సరఫరా చేయనున్నారు.
కపిలేశ్వరపురం, తాతపూడిలో తనిఖీలు..
గోదావరి నదీపాయల్లో ఇసుక తవ్వకాలు నిషేదం అమలు అవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా నియమించిన రీజనల్ విజిలెన్స్ స్వ్కాడ్ బృందాలు అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి నేతృత్వంలో కపిలేశ్వరపురం తాత పూడి లలో ఇసుక త్రవ్వకాలకు ఇచ్చిన అనుమతులు కంటే ఎక్కువ పరిమాణంలో ఇసుక రీచులలో తవ్వకాలు అక్రమం గా నిర్వహిస్తున్నారా అనే కోణంలో సోమవారం తనిఖీలు చేశారు. జిల్లాలోని ఇసుక రీచ్ లు వద్ద భూగర్భ గనుల శాఖ పటిష్ట నిఘాతో నిషేధపు ఆజ్ఞలు అమలు చేస్తోందని తెలిపారు.
నదీ గర్భంలో ఇసుక రీచులకు గతంలో ఉన్న రహదారులకు అడ్డంగా ట్రించులు త్రవ్వ వడంతోపాటు నదీ గర్భంలోకి వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం జరిగిందని ఆమె తెలిపారు ఈ రీజనల్ విలెన్స్ స్వ్కాడ్ బృందాల్లో జిల్లా భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకుడు, ఆర్డీవో, తాహ సిల్దార్ డి శ్రీనివాస్, రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ ఏలూరు రాయల్టీ ఇన్స్పెక్టర్ తదితరులు ఉండనున్నారు.





















