News
News
వీడియోలు ఆటలు
X

Thuni Railway Case: తుని రైలు దహనం ఘటనపై నేడే తుది తీర్పు, కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ!

తుని రైల్వే స్టేషన్‌ వద్ద రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేసిన సంఘటనకు సంబందించి 41 మంది నిందితులపై విచారణ వేగవంతంగా పూర్తి చేసిన విజయవాడ రైల్వే కోర్టు నేడు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది. 

FOLLOW US: 
Share:
తుని రైలు దహనం కేసుల విచారణ తుది దశకు చేరుకుంది.. కాపు రిజర్వేషన్‌ పోరాట ఉద్యమంలో తుని రైల్వే స్టేషన్‌ వద్ద రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేసిన సంఘటనకు సంబందించి 41 మంది నిందితులపై విచారణ వేగవంతంగా పూర్తి చేసిన విజయవాడ రైల్వే కోర్టు నేడు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది.  ప్రతీ వారం ఈకేసులో నిందితులు హాజరవుతున్నారు. అయితే ఇప్పటివరకు 18 మంది పోలీసు అధికారుల సాక్షాలను విన్న కోర్టు ఇక ఆనాటి రైలులో ఉన్న ప్యాసెంజర్ల సాక్షాలు కూడా విన్న కోర్టు తుది తీర్పు వెలువరించనుండగా సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.  ఈ కేసులో ప్రదానంగా కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి దాడిశెట్టి రాజా, వన్‌ టీవీ ఎండీ మంచాల సాయిసుధాకరనాయుడు, సినీ నటుడు జీవీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ తదితరులు ప్రధానంగా ఉన్నారు.  
 
కాపులను బీసీల్లో చేర్చాలన్న నినాదంతో...
 
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు కాపులను బీసీల్లో చేర్చాలన్న నినాదంతో 2016 జనవరి 31న తునిలో నిర్వహించిన బహిరంగ సభలో వేలాది మంది కాపులు పాల్గొన్నారు. సభ అనంతరం అక్కడ  అల్లర్లు చెలరేగాయి. విధ్వంస కాండ నెలకొంది. ఈనేపథ్యంలోనే తుని రైల్వే స్టేషన్‌లో ఉన్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను గుర్తు తెలియని కొందరు దహనం చేశారు. ఈ ఘటనకు సంబంధించి అదే సమయంలో పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు దహనం అయ్యాయి. తుని రైల్వే స్టేషన్‌లో నిలిచి ఉన్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ పలు బోగీలు దగ్ధమయ్యాయి. 
 
కేసులు వెనక్కు తీసుకున్న ఏపీ ప్రభుత్వం...
 
కాపుల బహిరంగ సభ సందర్భంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో జరిగిన విధ్వంసానికి అప్పటి టీడీపీ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు 329 కేసులు పలు సెక్షన్లు కింద నమోదు చేశారు. రైల్వే శాఖకు సంబంధించి జరిగిన నష్టం పై రైల్వే పోలీసులు ద్వారా పలు కేసులు నమోదు చేసింది. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 2016 నుంచి 2019 వరకు జరిగిన దర్యాప్తులో 153 కేసులు వరకు వీగిపోయాయి. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 176 కేసులుకు 161 కేసులను వెనక్కు తీసుకుంది. 14 కేసులు మాత్రం కోర్టులో విచారణ కొనసాగుతోంది.  వైసీపీ ప్రభుత్వం 161 కేసులు వరకు ఎత్తివేసినా  కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వే శాఖకు సంబందించిన కేసులు పలు సెక్షన్లు కింద రైల్వే పోలీసులు కేసులు నమోదు చేయగా ఈ కేసులు విచారణ కొనసాగుతోంది.  విజయవాడ రైల్వే కోర్టు ఈ కేసులను విచారిస్తోంది. ఈ కేసులకు సంబందించి నిందితులుగా ఉన్న పలువురు కాపు ఉద్యమనాయకులు ప్రతీ వారం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఈ కేసులకు సంబంధించి తుది తీర్పు వెలువడనుంది. 
 
ఉభయగోదావరి జిల్లాలో ఉత్కంఠత..
 
రైల్వే చట్టం ద్వారా నమోదైన కేసులు  విచారణ తుది దశకు చేరుకుని నేడు తీర్పు వెలువడే  అవకాశం ఉండడంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పలువురు కాపు ఉద్యమ నాయకులు రైల్వే కోర్టుకు హాజరవుతున్నారు.  రైలు దహనం ఘటనలో ప్రతక్ష సాక్షులు, సీసీ కెమెరా పుటేజీలు, మీడియా ద్వారా వీడియోలు సేకరించిన రైల్వే పోలీసులు  1989, 1984 రైల్వే యాక్ట్‌ ప్రకారం పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబందించి ఆ సమయంలో రైలులో ప్రయాణిస్తున్న వారిలో కొందరిని కూడా సాక్షులుగా చేర్చింది. ప్రస్తుతం ఆనాడు డ్యూటీలో  ఉన్న అధికారులు, పోలీసుల సాక్షాలతోబాటు ప్రత్యక్ష సాక్షులు అయిన ప్రయాణికుల సాక్షాలును ఇప్పటికే విన్నట్లు తెలుస్తోంది.  ఏది ఏమైనా తుని రైలు దహనం సంఘటనకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేసులను దాదాపు ఎత్తివేసినప్పటికీ రైల్వే శాఖ ద్వారా నమోదైన కేసులు మాత్రం కాపు ఉద్యమన నేతలను నీడలా వెంటాడగా నేడు వెలువరించ నున్న తీర్పు పై ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.
Published at : 01 May 2023 12:45 PM (IST) Tags: thuni railway case final judgment ratnachal express kapu reservations agitations

సంబంధిత కథనాలు

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Coromandel Train Accident : ఒడిశా  ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Rajahmundry MP Bharat: చంద్రబాబు ఒక ఆల్‌ ఫ్రీ బాబా, దసరా మేనిఫెస్టో అక్కడినుంచే కాపీ కొడతారు- ఎంపీ భరత్‌ జోష్యం

Rajahmundry MP Bharat: చంద్రబాబు ఒక ఆల్‌ ఫ్రీ బాబా, దసరా మేనిఫెస్టో అక్కడినుంచే కాపీ కొడతారు- ఎంపీ భరత్‌ జోష్యం

Pawan Kalyan Varahi: ఈ 14 నుంచే రోడ్లపైకి పవన్ కళ్యాణ్ వారాహి, రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన

Pawan Kalyan Varahi: ఈ 14 నుంచే రోడ్లపైకి పవన్ కళ్యాణ్ వారాహి, రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన

టాప్ స్టోరీస్

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా

Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు