News
News
వీడియోలు ఆటలు
X

Vundavalli ArunKumar: కర్ణాటకలో కాంగ్రెస్ నెగ్గడం దేశానికి మంచిది, రాహుల్‌ ఫ్యామిలీ అవినీతిపరులంటే ఒప్పుకోను: ఉండవల్లి

కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం దేశానికి మంచిదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. రాహుల్‌ గాంధీకానీ, వారి కుటుంబాన్ని కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరని గాంధీ కుటుంబం అవినీతి పరులు కారన్నారు.

FOLLOW US: 
Share:

కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం దేశానికి మంచిదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. రాహుల్‌ గాంధీకానీ, వారి కుటుంబాన్ని కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరని.. గాంధీ కుటుంబసభ్యులు అవినీతి పరులు కాదన్నారు. ఎన్నికల సమయంలో వారిచ్చిన అఫడవిట్లు దానికి ఆధారం అన్నారాయన.. స్విస్‌ బ్యాంకు వాళ్లు జాబితా ఎప్పుడో ఇచ్చారు మరి ఎందుకు బయటపెట్టడడం లేదని బీజేపీ ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ కుటుంబం అవినీతిపరులు అంటే ఒప్పుకోనని, దేశంలో వారంటే అభిమానించే వారు ఎందరో ఉన్నారు. కాంగ్రెస్‌ అంటే ఆ కుటుంబమే అని అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

ఇటీవలే ఢిల్లీ ఫ్లైట్‌లో రాహుల్‌ను కలిశాను.. 
ఇటీవలే సుప్రీంకోర్టు వాయిదాకు వెళ్లేందుకు ఢిల్లీ ఫ్లైట్‌లో వెళ్తున్న సమయంలో కాకతాళీయంగా రాహుల్‌ గాంధీ కలిశారు. పక్కపక్క సీట్లు రావడంతో గుర్తుపట్టారా అని అడగ్గానే నిన్ను ఎలా మర్చిపోతానన్నారు. నాతోపాటు ఎంపీ చేశావని, ఎలా మర్చిపోతానన్నారని ఉండవల్లి తెలిపారు. మా అమ్మాయికి కూడా వీడియో కాల్‌ మాట్లాడారని, రాహుల్‌ గాంధీ రియల్‌ గాంధీ అంటూ.. రాజీవ్‌ గాంధీని చూడగానే ఆయనకు దగ్గరవ్వాలని ఎలా అనిపించిందో - రాహుల్‌ గాంధీ విషయంలో కూడా ఆ స్పార్క్‌ వచ్చిందన్నారు. భారత్‌ జోడో యాత్ర ఆయనలో చాలా మార్పులు తీసుకొచ్చిందని, విమానంలోనూ తోటి ప్రయాణికులకు లగేజ్‌ తీసి ఇచ్చేంత పరిణితి పెంచిందని అన్నారు. ఇది ఖచ్చితంగా దేశానికి మంచిది అన్నారు ఉండవల్లి. 

రామోజీరావు చట్టానికి అతీతులు కాదు..!                                                                                                                                                        రాజమండ్రి చిట్‌ఫండ్‌ కంపెనీ ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రిని ఇటీవలే అరెస్ట్‌ చేశారు. ఎవ్వరూ ఫిర్యాదు ఇవ్వకుండానే చేశారు కదా.. రామోజీరావు ప్రభుత్వం నామీద చర్యలు తీసుకోవడానికి వీళ్లేదని చెప్పడం కరెక్ట్‌ కాదు. రూలింగ్‌లో ఎవరున్నా నిభందనలు పాటించాలి. చిట్‌ఫండ్‌ యాక్ట్‌ మాకు వర్తించదంటే ఎలా అని మార్గదర్శి విషయంలో రామోజీరావును మాజీ ఎంపీ అరుణ్ కుమార్ ప్రశ్నించారు. దీనిపై 2007లో అద్వాని నామీద విరుచుకుపడ్డారు. సోమనాధ్‌ చటర్జీ కూడా చెప్పారు.. ఆయన చట్టానికి అతీతుడని చెప్పడం సరైంది కాదన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ మోసాలపై స్వయంగా నేనే పుస్తకం రాశానని వెల్లడించారు. 

హెచ్‌యూఎఫ్‌ పేరు మీద కలెక్ట్‌ చేయవచ్చా..
సుప్రీంకోర్టులో జరగబోయే వాదనల్లో జడ్జిగారిని హెచ్‌యూఎఫ్‌ కలెక్ట్‌ చేయవచ్చా చేయకూడదా అని అడగబోతున్నాను అని తెలిపారు మాజీ ఎంపీ ఉండవల్లి. చిట్‌ఫండ్‌ మోసాలను అరికట్టేలా ఎలా క్రమబద్దీకరించవచ్చో అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆలోచన చేసి పటిష్టమైన ప్రపోజల్స్‌తో ముందుకు వెళ్లాలని కోరుతున్నాను. ఆర్థిక నేరగాళ్ల పట్టా పీక నొక్కడమే సరైందిబఅన్నారు. డిబేట్‌ అనేది ఆహ్వానించదగ్గదే.. జగన్‌ను తిడితే నాకేమీ ఇరిటేషన్‌ రాదు. నేను ఏ పార్టీకు చెందిన వాడను కానని మరోసారి స్పష్టం చేశారు. మార్గదర్శి విషయంలో అధికారులు రూల్‌ ప్రకారమే పోతారు. నిందలు జగన్మోహన్‌రెడ్డి పై వేయగలుగుతున్నారు కానీ అధికారులకు ఆ హక్కు ఉంది. రామోజీరావు లాంటి వ్యక్తుల వద్దకు వెళ్లేటప్పుడు అధికారులు ఏమీ చూసుకోకుండా వస్తారా.. మీరు తప్పుచేశారని నిర్ధారించుకునే వచ్చారు.

ఈ ప్రభుత్వం నాకు వ్యతిరేకం కాబట్టి నన్ను వేధిస్తోందని పాతపాట పాడవద్దంటున్నాను. రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు ఇదే పాటపాడారన్నారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌. ఆంధ్రప్రదేశ్‌లో ఏ చిట్‌ఫండ్‌ కంపెనీ వాళ్లు చిట్‌ఫండ్‌ యాక్ట్‌ పాలో అవ్వడం లేదు. రిజిస్టార్లు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారన్నదానిపై ఈ ఫీల్డ్‌లో సమర్ధులైన వారితో  కమిటీ వేయండి అంటూ ప్రభుత్వానికి సూచించారు. అరెస్ట్‌ల వల్ల ఏమీ జరగదు. చిట్‌ఫండ్‌ కంపెనీలు అంటే సమాంతర ఆర్థిక వ్యవస్థ. క్యాష్‌ మాత్రమే తీసుకుంటున్నారు. క్యాష్‌ తీసుకోకూడదు.. ఆ విధంగా చట్టం చేయాలన్నారు. రామోజీరావు గురించి మాట్లాడితే టీడీపీ వాళ్లకు కోపం వస్తుంది.. రామోజీరావు చేస్తే రైటే అంటున్నారని విమర్శించారు.

రూ.100 దాటితే డిజిటల్‌ ట్రాన్జక్షన్లు ఉండాలి..
కీమియా లాంటి దేశంలో ఈ మనీనే వినియోగిస్తారు. మన దేశంలో చట్టం భయం ఉండాలి.. రూ.100 దాటితే క్యాష్‌ టాన్జక్షన్స్‌ ఉండకూడదు. అలా చేస్తేనే సరెదని అభిప్రాయపడ్డారు ఉండవల్లి. ఈ చిట్‌ఫండ్‌ కంపెనీలన్నీ క్యాష్‌ ద్వారానే డిపాజిట్లు సేకరిస్తున్నాయని తెలిపారు.  ఇన్‌కం ట్యాక్స్‌ల్లో రైడ్లలో పట్టుబడ్డవారు అంతా దొంగతనం చేసి సంపాదించారా.. రూల్‌ అంటూ ఉంది కదా.. కానీ రామోజీరావు తనకు వర్తించదంటున్నారన్నారు మరోసారి పునరుద్ఘాటించారు.  

అనధికారికంగా ఏడాదికి రూ.900 కోట్లు..
రామోజీరావుకు ఏపీ, తెలంగాణాలో కలిపి రోజుకు పదికోట్లు రూపాయలు ఆదాయం వస్తుంది.. ఏ కంపెనీ అయినా పాటపాడిన 24 గంటల్లో నగదు ఇస్తారు.. రామోజీరావు కంపెనీలో మూడు నెలలకు కూడా ఇవ్వరు. 900 కోట్లు ఏడాదికి అనధికారికంగా రామోజీరావు దగ్గర అంత డబ్బు ఉంటుంది.. దానికి ఎంత వడ్డీ వస్తుంది..? ప్రజల డబ్బుతో వ్యాపారం చేసేవాడెవడైనా 50 శాతం వాటా ఉండాలని చట్టం చెబుతుంది. కానీ ఇవేమీ రామోజీరావుకు వర్తించడంలేదన్నారు.  ఏ శాఖకు ఆశాఖకు బ్యాలెన్స్‌ షీట్‌లు వేర్వేరుగా ఉండాలి.. కానీ అలా జరగడం లేదు.  పైగా మార్గదర్శి శాఖలో మేనేజర్‌కు కేవలం విత్‌డ్రా చేసే అవకాశం రూ.500 మాత్రమే ఉంటుంది. అమలుచేయకపోతే పట్టుకోవాల్సింది రిజిస్టర్‌ఆఫ్‌ చిట్స్‌.. కేసులు పెట్టాలంటే సీఐడీ వాళ్లు పెట్టాలి.. ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. 

Published at : 19 May 2023 04:28 PM (IST) Tags: Rajahmundry vundavalli arun kumar Congress Party Rahul Gandhi Margadarsi Issue

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం