News
News
వీడియోలు ఆటలు
X

Minister Karumuri: ఏపీలో ఇకపై ఆన్‌లైన్‌ విధానంలో రబీ ధాన్యం సేకరణ: మంత్రి కారుమూరి ప్రకటన

Minister Karumuri: రాష్ట్రంలో ఇకపై ఆన్ లైన్ విధానంలో రబీ ధాన్యం సేకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.

FOLLOW US: 
Share:

Minister Karumuri: రైతులకు మేలు చేసే విధానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనతో చేపట్టిన ధాన్యం సేకరణపై మిల్లర్లు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని స్థానిక ఆనం కళా కేంద్రంలో మంగళవారం సాయంత్రం తూర్పు గోదావరి, డా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల రైస్ మిల్లర్లతో సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతులకు మేలు జరిగే విధంగా ఆన్‌లైన్ విధానంలో ధాన్యం సేకరణ చేపట్టే ప్రక్రియను గత ఏడాది నుంచి అమలు చేయడం జరిగిందన్నారు. అప్పుడు కొందరు వ్యక్తుల ప్రోద్బలంతో వ్యతిరేకించిన వారు, పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగిందన్నారు. ఇటీవల దువ్వలో ఆర్భీకేలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సమయంలో వారే వచ్చి ఆన్‌లైన్ విధానం అమలు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. 

ఆఫ్ లైన్ విధానంలో జరిపిన వాటిని నేటికీ డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నామని, అటు రైతులకు, ఇటు మిల్లర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి ఆలోచన అభినందనీయమని పేర్కొన్నారు. గత ఖరీఫ్ సమయంలో ధాన్యం సేకరణకు సహకారం అందించిన మిల్లర్లకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సమక్షంలో, అధికారుల సమక్షంలో మిల్లర్ల సమస్యలపై పలు మార్లు చర్చించామన్నారు. నేడు నేరుగా మీతో సమావేశం అయి మీ సమస్యలను, ఆలోచనలు తెలుసుకునే ప్రయత్నంలో మంగళవారం ఉదయం తణుకులో, ఇప్పుడు రాజమండ్రిలో మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు కారుమూరీ నాగేశ్వర రావు పేర్కొన్నారు.

రైతు ఆనందం ఈ ప్రభుత్వ విధానమని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లోలా కాకుండా రబీలో అరుదల సమస్య ఉండదని, ఎప్పటికప్పుడు లోడ్ దింపుకొని సహకారం అందించాలని కోరారు. రైతుకు మద్దతు ధర లభించి ఆనందం కోసం గత ఖరీఫ్‌లో ఎదుర్కొన్న ఒడిదొడుకులు లేకుండా మరింత అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గత ఖరీఫ్ సీజన్ సమయంలో ధాన్యం కొనుగోలు సమస్యలు  ప్రస్తుత రబీలో ఎదురయ్యే అవకాశం లేదని తెలిపారు. ఇకపై ఏ సీజన్ లో పంట కొనుగోలు చేసే వాటికి ఆ పంట సీజన్ లోనే చెల్లింపులు చేసే విధానం అమలు చేస్తామన్నారు. మిల్లర్లు రైతు యొక్క సంక్షేమం కోసం ఆలోచన చెయ్యాలని, మిల్లర్లకు ఏ సమస్య వచ్చినా ఫోనులో అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో పండించే జయ బొండాలకి కేరళ రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఎఫ్‌సీఐ - సీఎండీతో ఈ విషయంపై హామీ ఇచ్చారని తెలిపారు. మన ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం రైతు పండించిన ధాన్యం కు మద్దతు ధర లభించడం, అందుకు మిల్లర్ల సహకారం అవసరం ఉందని మంత్రి తెలియజేశారు.

క్షేత్ర స్థాయిలో మిల్లర్ల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ తెలిపారు. మీ సమస్యలు, అభిప్రాయాలు తెలియజేసేందుకు ఇది ఒక చక్కని వేదిక అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తదుపరి గోడౌన్ లో భద్ర పరిచే విధానం, ఆన్‌లైన్‌ సాంకేతిక సమస్యలు వారి నుంచి నేరుగా తెలుసుకునేందుకు ఇది ఒక చక్కటి వేదికగా నిలిచిందన్నారు. కనీస మద్దతు ధర నేరుగా రైతుకు చేర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. సాగు చేసిన పంట కోత నుంచి మిల్లుకు చేరే వరకు రైతు చేసే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు రైతు కు అందాలన్నది ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు. ప్రతి మిల్లర్ తప్పని సరిగా ఆరబోత యంత్రాన్ని సమకూర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌టీవోలో నమోదైన ధాన్యం మిల్లుకు తరలించాలని పేర్కొన్నారు. గత ఖరీఫ్ లో ఆన్లైన్ ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించిన చెల్లింపులు పూర్తిగా జరిపారని, ఆఫ్ లైన్ కి సంబందించిన చెల్లింపులు పెండింగులో ఉండగా, ఆయా మిల్లర్ల తో మాట్లాడి నట్లు తెలియజేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ సేకరణ కి మిలర్లు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం ఆనంద దాయకమని పౌర సరఫరాల శాఖ వీసీ అండ్ ఎండీ - జీ. వీర పాండ్యన్ తెలిపారు. మద్దతు ధరకు ఒక్క పైసా తగ్గకుండా రైతులు పండించిన పంట కొనుగోలు ప్రభుత్వ విధానం అన్నారు. గత అనుభవాలను, సమస్యలను అధిగమించి మరింత పటిష్టంగా ఆన్లైన్ ప్రక్రియ ను రూపుదిద్దామన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలతో రైతు ఆధార విధానంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేపట్టడం జరుగుతోందన్నారు. గన్ని బ్యాగుల సమస్య ఉత్పన్నం కాకుండా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ రూపొందిన సాఫ్ట్‌వేర్‌ మెకానిజం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పేర్కొన్నారు. గన్ని బ్యాగుల వివరాలను మిల్లర్ ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసి, అర్భికే ద్వారా ధృవీకరణ చేస్తున్నట్లు వెల్లడించారు. మిల్లర్ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాటిని రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. అందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని వెల్లడించారు. మిల్లరు - రైతు మధ్య ఎటువంటి లావాదేవీలకు ఆస్కారం లేదని, రైతు పక్షాన ప్రభుత్వం - మిల్లరుకు జవాబుదారీతనం వహిస్తుందని వీర పాండ్యన్ అన్నారు.

ధాన్యం కొనుగోలు పక్రియలో కామన్ వెరైటీకి పూర్తి మద్దతు ధరను కల్పిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ .తేజ్ భరత్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 233 ఆర్బీకేలను 147 రైస్ మిలర్స్ తో అనుసంధానం చేసామన్నారు. ఆన్ లైన్ విధానం ఏ రైతు ధాన్యం ఏ మిల్లుకు వెళుతున్నది తెలియదన్నారు. 65 లక్షలు గన్ని బాగ్స్ అవసరం మేరకు ఇప్పటికే 35 శాతం ఆర్బీకేలకు అందించామన్నారు. ధాన్యం కొనుగోలు పై సమస్యలను తెలుసుకొనేందుకు జిల్లాలో 22 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసామన్నారు. రబీ సీజన్లో కాకినాడ జిల్లాలో 5.53 లక్షల ధాన్యం కొనుగోలుకు గాను 200 పిపిసి కేంద్రాలను ఆయా రైస్ మిలర్స్ అనుసంధానం చేసామని కాకినాడ జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలాక్కియా తెలిపారు. ఇప్పటికే మండలం స్థాయిలో పిపిసి టీం లను నియమించామన్నారు. రైతుకు గాని మిల్లరుకు గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా తహసీల్దార్ కార్యాలయంలో 3 వ మాయిచ్చుర్ మిషన్ అందుబాటులో ఉంచామన్నారు.

డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకుగాను 389 ఆర్బీకేల్లో పిపిసి సెంటర్స్ ఏర్పాటు చేసామని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్.ఎమ్. ధ్యానచంద్ తెలిపారు. ఇప్పటికే మిలర్స్, ఆర్బికే కేంద్రాల్లో ఉన్న మాయిశ్చర్ పరికరాలను టెస్ట్ చేసామన్నారు. ఖచ్చితమైన వేమెంట్ కొరకు తునికలు కొలతలు శాఖ టీంను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా లోని 140 మిల్స్ గాను 120మిల్స్ లో సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. గత ఖరీఫ్ లో మిలర్స్ రు. 7 కోట్లు చెల్లింపులకు గాను  80 శాతం వరకు పేమెంట్స్ చేశామన్నారు.

Published at : 18 Apr 2023 11:08 PM (IST) Tags: AP News AP Minister Minister Karumuri Rabi Grain Collection Karumuri Nageshwar Rao

సంబంధిత కథనాలు

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?