By: ABP Desam | Updated at : 25 Sep 2023 11:20 PM (IST)
కృషి బ్యాంక్ డైరెక్టర్ కాగితాల శ్రీధర్ అరెస్ట్
డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేయకుండా మోసం చేసిన కేసులో కృషి బ్యాంక్ డైరెక్టర్ కాగితాల శ్రీధర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనానికి కోట్ల రూపాయలు కుచ్చు టోపీ పెట్టి తప్పించుకొని తిరుగుతున్న ఆయన్ను, ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లులోని శ్రీరాంపేటలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐడీ అధికారులు శ్రీధర్‌ను రిమాండ్‌కు తరలించారు. కృషి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్, ఎండీ కొసరాజు వెంకటేశ్వర్ రావు, డైరెక్టర్లతో కలిసి 36.37 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు.
సికింద్రాబాద్‌లోని కృషి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డిపాజిటర్లకు చెల్లింపులు చేయకుండానే 2001 ఆగస్ట్ 11న మూసివేశారు. 2001, ఆగస్ట్ 11న డాక్టర్ ఎం.వీ. కుమార్ మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారుతద్వారా బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లు రూ. 36.37 కోట్ల మోసానికి పాల్పడ్డారు. కృషి బ్యాంకు డైరెక్టర్‌గా వ్యహరించిన శ్రీధర్.. ఈ కేసులో 3వ నిందితుడిగా ఉన్నారు. విచారణ చేపట్టిన సీఐడీ, బ్యాంక్‌తో పాటు బ్యాంకు డైరెక్టర్ల ఆస్తులు అటాచ్ చేసింది.
వాటిని విక్రయించి డిపాజిటర్లకు డబ్బులు పంచే బాధ్యతను లిక్విడేటర్‌కు కోర్టు అప్పగించింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. బ్యాంక్, నిందితుల కొన్ని ఆస్తులను వేలం వేశారు. ఇప్పటివరకు 700 మందికి పైగా డిపాజిటర్లకు చెల్లింపులు చేశారు. మిగిలిన 173 మంది డిపాజిటర్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా వారిలో 75 మందిని గుర్తించారు.
అన్ని తుపానులకు ఎందుకు పేర్లు పెట్టరూ? మిగ్‌జాం అంటే అర్థమేంటీ?
Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం
Michaung cyclone Effect: కోనసీమకు పొంచి ఉన్న మిచాంగ్ తుపాను ముప్పు, రెడ్ అలెర్ట్ జారీ
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
/body>