అన్వేషించండి

Kakinada: డాక్టర్‌పై జనసేన ఎమ్మెల్యే దాడి! బూతులతో మెడికల్ కాలేజీ వైస్ ఛైర్మన్‌పై దౌర్జన్యం

Kakinada News: రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ పై దాడి జరిగింది. డాక్టర్ ఉమా మహేశ్వర రావుపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బూతులతో దౌర్జన్యానికి దిగారు.

Janasena MLA Pantam Nanaji: జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ  ఒక మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్ (స్పోర్ట్స్ ) పై దౌర్జన్యం చేశారు. ఏకంగా అమ్మనా బూతులతో దుర్భాషలాడారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న పంతం నానాజీ తన అనుచరులతో కలిసి సిటీలోని రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద చేసిన దౌర్జన్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ భగ్గుమంది. వెంటనే జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ డాక్టర్ పై దాడి చేసిన పంతం నానాజీపై చర్యలు తీసుకోకుంటే వెంటనే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తూ లేఖ రాశారు.

బాస్కెట్ బాల్ ఆడొద్దు అన్నందుకు గొడవ

రంగరాయ మెడికల్ కాలేజ్ అనేది కాకినాడలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ప్రముఖమైన వైద్య కళాశాల. ఇక్కడ చదువుకున్న వారు డాక్టర్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన స్థానాల్లో ఉన్నారు. అంత చరిత్ర ఉన్న రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో  బాస్కెట్ బాల్ ఆడుకుంటామంటూ కొందరు అనుచరులు ఎమ్మెల్యే పంతం నానాజీని అడిగారు. వారికోసం నానాజీ మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని అనుమతి కోరారు. అది ఇంకా పెండింగ్ లో ఉంది. ఈలోపులోనే  ఆయన అనుచరులు కొందరు కాలేజీ గ్రౌండ్లో నెట్ కట్టడానికి ప్రయత్నించారు.  దీనిని అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు.

విషయం తెలుసుకున్న  రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు అక్కడకు చేరుకుని అనుమతి లేకుండా కాలేజీ గ్రౌండ్లో ఆటలు ఆడడం కుదరదని చెప్పారు. పై అధికారుల అనుమతి గాని సభ్యత్వం గాని లేకుండా కాలేజీ గ్రౌండ్లో ఆడొద్దని అనడంతో అక్కడ మాట మాట పెరిగింది. దానితో ఎమ్మెల్యే అనుచరులు నానాజీ ఇంటికి వెళ్లి ఉమామహేశ్వరరావు మీపై స్టూడెంట్స్ ని రెచ్చగొడుతున్నారంటూ  చెప్పడంతో తన ప్రధాన అనుచరులతో కలిసి కాలేజీ గ్రౌండ్ కి చేరుకున్నారు నానాజీ. డాక్టర్ ఉమామహేశ్వరరావు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తుండగానే  "నా పైనే స్టూడెంట్స్ ని  రెచ్చగొడతావా " అంటూ  దౌర్జన్యానికి దిగారు. డాక్టర్ ముఖానికి ఉన్న మాస్కుని సైతం లాగేసారు. అదే సమయంలో అనుచరులు కొందరు డాక్టర్ పై  దాడి చేస్తున్న విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థులు సైతం అక్కడకు భారీగా చేరుకుని   నిరసనకు దిగారు. పోలీసులు వారిని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించినా న్యాయం కోసం వారి ఆందోళన కు దిగడం తో చివరకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు.

ఆందోళనకు దిగుతాం : గవర్నమెంట్ డాక్టర్లు 
ఒక ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ పైనే ఇలా ఒక ఎమ్మెల్యే అండ్ కో దాడికి దిగడంతో ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (APGDA )ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే అనుచరుల పేరుతో కొందరు కాలేజీ బాస్కెట్బాల్ గ్రౌండ్ ను ఆక్రమించి అక్కడ చట్ట వ్యతిరేకమైన పనులు, బెట్టింగులు, మహిళా స్టూడెంట్ లు  ఉన్న కాలేజ్ ప్రాంతంలో న్యూసెన్స్ కు పాల్పడుతున్నారని అవి వద్దు అని చెప్పినందుకు ఇలా ఎమ్మెల్యేను తీసుకొచ్చి దౌర్జన్యానికి దిగారని లేఖ ను రిలీజ్ చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తమ ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అలాగే ఎమ్మెల్యే అనుచరులమంటూ దాడి చేసిన పై వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ తగిన చర్యలు తీసుకోవాలని లేకుంటే 10000 మంది వరకూ ఉన్న  ప్రభుత్వ డాక్టర్లందరూ నిరసనకు దిగుతాము అంటూ ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై కళ్యాణ్ ఎలా స్పందిస్తారో అన్నది రాజకీయంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget