అన్వేషించండి

Konaseema District: ఆక్వా సబ్సిడీ విద్యుత్తును విచ్చలవిడిగా విక్రయిస్తున్న అక్రమార్కులు- పట్టించుకోని అధికారులు !

Konaseema District: అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా తీర గ్రామాల్లో సీఆర్‌జ‌డ్ ప‌రిధిలో అన‌మ‌తులు లేకుండా త‌వ్విన ఆక్వా చెరువుల వ‌ద్ద విద్యుత్తు క‌నెక్ష‌న్‌లు మాటున అక్ర‌మ వ్యాపారం జ‌రుగుతోంది.

Andhra Pradesh News: సముద్రతీరంలో డీ పట్టా భూముల్లో అక్రమంగా ఆక్వా చెరువులు సాగు ఒక ఎత్తైతే.. దానికి చట్టవ్యతిరేకంగా విద్యుత్తు వినియోగం మరో నేరం. ఇంకా వండర్ ఏంటంటే అందులో మరో బరితెగింపు పనికి పూనుకున్నారు అక్రమార్కులు. సీఆర్‌జడ్‌ పరిధిలో చేయకూడని ఆక్వాసాగుకు అక్రమంగా విద్యుత్తు కనెక్షన్లు పొంది ఆపై ఆ విద్యుత్తును యూనిట్లు చొప్పున పక్క చెరువుల సాగుకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. 

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోన‌సీమ జిల్లా అల్లవరం మండలంలోని కొమరగిరిపట్నం, ఓడలరేవు తీరంగా జరుగుతోన్న ఈ దందా అందర్నీ ఆశ్చర్యపరుతోంది. ఇదంతా తెలిసినా విద్యుత్తు శాఖ అధికారులు మామూలు మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 
అక్రమ విక్రయాలు ఇలా....

కొమరగిరిపట్నం, ఓడలరేవు సముద్రతీరానికి సమీపంలో ఆక్వాసాగుకు సంబందించి దాదాపు 90 శాతం చెరువుల వద్ద ఏరియేటర్లు, మోటార్లు తదితర అవసరాలకు విద్యుత్తునే వినియోగిస్తున్న పరిస్థితి. సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ ఆక్వా చెరువులకు అనుమతులు ఎలా వచ్చాయన్నదే మొదటి అనుమానం. అందులో ప్రతీ చెరువుకు విద్యుత్తు వినియోగంలో ఉండడం మరో వింత. 

వేరే జిరాయతీ భూమికి తాలూకు సర్వే నెంబర్‌, యజమాని పేరున ఆక్వా అనుమతులు తీసుకుంటున్నారు. అదే పేరుతో విద్యుత్తు సర్వీసు కూడా తీసుకుంటున్నారు. ఆపై తీరంలో ఉన్న చెరువుల వద్ద అదే కనెక్షన్‌ పెడుతున్నారు. దీనికి తోడు అదనపు కేబుల్స్‌ ద్వారా విద్యుత్తు సరఫరాను ఇతరుల చెరువులకు మళ్లిస్తున్నారు. ఇలా విద్యుత్తును అనధికారికంగా మళ్లించి విక్రయించడం ద్వారా యూనిట్‌కు రూ.4 నుంచి రూ.5 వరకు అక్రమ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ దందా కొమరగిరిపట్నం, ఓడలరేవు తీరప్రాంతం కేంద్రంగా మూడు ఏరియేటర్లు... ఆరు యూనిట్లు చందంగా సాగుతోంది.  

హెచ్‌పీల లెక్కన విక్రయాల జోరు...
ఆక్వాసాగుకు సంబంధించి ఒక్కో యూనిట్‌కు రూ.1.50 చొప్పున ప్రభుత్వం రాయితీపై ఇస్తుంది. అదే రాయితీ లేని కనెక్షన్‌ అయితే యూనిట్‌కు రూ.7 చొప్పున చెల్లించాల్సిన పరిస్థితి. దీన్ని తప్పించుకోవడానికి ఒక్క కనెక్టెడ్‌ లోడు నుంచి రోజుకు ఒక్కో కనెక్షన్‌కు 40 నుంచి 50 హెచ్‌పీల స్థాయి వరకు విద్యుత్తును అక్రమంగా అమ్ముకుంటున్నారు. 

ఉదాహరణకు ఒక ఒకరం చెరువుకు 10 హెచ్‌పీల చొప్పున రోజుకు 20 గంటల వినియోగం ఉంటుంది. దీనిని బట్టి ఒక ఎకరం చెరువుకు రోజుకు 200 యూనిట్లు నుంచి 250 వరకు ఖర్చు అవుతుంది. విద్యుత్తు వినయోగానికి ఎటువంటి పరిమితి లేకపోవడంతో ఒక హెచ్‌పీ వినియోగానికి రూ.250 చొప్పున వసూళ్లు చేస్తూ రోజుకు 40 నుంచి 60 హెచ్‌పీల స్థాయి వరకు విద్యుత్తును అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఇలా కనెక్టడ్‌ లోడ్‌ను మించి ప్రతీ కనెక్షన్‌దారు అడిషనల్‌ లోడ్‌కు బిల్లు చెల్లించి మరీ విద్యుత్తును అమ్ముకోవడం ద్వారా నెలకు రూ.లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

అధికారులేం చేస్తున్నారు..?
సముద్రతీరంలో ఆక్వాచెరువుల వద్ద విద్యుత్తు కనెక్షన్లు పూర్తిగా అక్రమమని తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వాటికి ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయడం, కనెక్షన్లు ఇవ్వడం విస్మయాన్ని కలిగిస్తోంది. అయితే ఈ అక్రమంలోనే మరో అక్రమానికి తెరతీసి విక్రయాలు చేస్తున్నా పట్టించుకున్న వారే లేరు. ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అక్రమదారులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.  ేఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ దీనిపై దృష్టిసారించి ఈ అక్రమ దందాకు అడ్డుకట్టవేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Embed widget