Rajahmundry to Tirupati : తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్! రాజమండ్రి నుంచి తిరుపతికి విమానం: సర్వీస్ టైమింగ్స్ ఇవే!
Rajahmundry to Tirupati Flight : రాజమండ్రి నుంచి తిరుపతికి విమానయానం ప్రారంభం కానుంది.అక్టోబర్ 1 నుంచి వారానికి మూడు రోజులు నడవనుంది.

Rajahmundry to Tirupati Flight Services: ఏడాదిలో ఒక్కసారైనా తిరుమల తిరుపతికి వెళ్లాలని చాలా మంది భక్తులు కోరుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కుకోవడానికి అంత మంది భక్తులు ఇష్టదైవంగా భావిస్తూ తరలివస్తుంటారు. అయితే ఇప్పడు ఉమ్మడి తూర్పగోదావరి జిల్లాల నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ వినిపించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచనలో భాగంగా ఇకపై రాజమండ్రి నుంచి తిరుపతికి విమానయానం ప్రారంభం కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు ఇటీవలే ప్రకటించారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరిలో ఉన్న వెంకన్న భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు..
వారానికి మూడు రోజులపాటు అందుబాటులోకి...
దసరా పండుగ సందర్భంగా ప్రారంభిస్తోన్న ఈ ప్రత్యేక విమాన సర్వీసులు వారంలో మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభం కానుండగా ఎలయన్స్ ఎయిర్ సంస్థ ఏటీఆర్ 72 విమానం ద్వారా వారానికి మూడు రోజులు పాటు అంటే మంగళవారం, గురు, శని వారాలు ఈ సర్వీసును అందించనుంది..
మొదటి విమానం అక్టోబర్ ఒకటిన రాక...
రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌కు ఇటీవల కాలంలో ముంబై. బెంగుళూరు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. తాజాగా తిరుపతికి కూడా రాజమండ్రి నుంచి విమానం ఏర్పాటు చేయాలని చాలా మంది ఆకాంక్షించారు. అయితే కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఈ కోరిక అత్యంత తక్కువ సమయంలోనే నెరవరేలా కృషిచేశారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఎక్స్ వేదికగా ప్రజలకు తెలియజేశారు. అక్టోబకర్ ఒకటి నుంచి రాజమహేంద్రవరం-తిరుపతికి విమానయానం అందుబాటులోకి రానుండగా అక్టోబర్ 1న ఉదయం 9.25 గంటలకు ఎలయన్స్ ఎయిర్ సంస్థ ఏటీఆర్ 72 ఫ్లైట్ రాజమహేంద్రవరంలో ల్యాండ్ అవుతుందని వెల్లడించారు. రాజమహేంద్రవరం నుంచి 50 నిమిషాల వ్యవధి దాటాక అంటే తిరిగి అక్టోబర్ 1న ఉదయం 10.15కు విమానం తిరుపతికి తిరిగి వెళ్తుందని తెలిపారు.
అక్టోబర్ 2 నుంచి సర్వీసు వేళలు ఇవే..
రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి అక్టోబర్ 2 నుంచి వారంలో మంగళవారం, గురు, శనివారాల్లో అందుబాటులో ఉండనున్న ఈ ఫ్లైట్ తిరుపతిలో ఉదయం 7.40కి బయలుదేరి 9.25కు రాజమహేంద్రవరం చేరుకుంటుంది. ఆ తర్వాత 25 నిమిషాల వ్యవధిలో అనగా ఉదయం 9.50 గంటలకు తిరిగి రాజమహేంద్రవరం నుంచి తిరుపతి పయనమై11.20 గంటలకి తిరుపతి చేరుకుంటుంది.





















