News
News
X

CM Jagan Comments: టీడీపీ అంటేనే తెలుగు బూతుల పార్టీ, ఇదేం ఖర్మరాబాబూ - సీఎం జగన్ తీవ్ర విమర్శలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

FOLLOW US: 

చంద్రబాబు హాయాంలో జరగనట్టుగా వారి ఊహలకు అందని విధంగా అన్ని వర్గాలకు తమ ప్రభుత్వం నిలబడిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో కనీసం కుప్పం ప్రజలకు కూడా మంచి చేయలేదని విమర్శించారు. తాము ఫలానా చేశామని చెప్పుకోలేక ఈ మధ్య నోటికి పని చెబుతున్నారని విమర్శించారు. టీడీపీ అంటేనే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ఎద్దేవా చేశారు. దత్త పుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చేశారని ఆరోపించారు. వీరు గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా ఇదేం ఖర్మ అనుకున్నారని, అందుకే 2019లో దత్త పుత్రుడు, సొంత పుత్రుడు ఇద్దర్నీ అన్నీ చోట్లా ఓడగొట్టారని గుర్తు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

బాయ్ బాయ్ బాబు అంటున్నారు - జగన్
మనం చేసిన ఇంటింటి అభివృద్ధిని గుర్తించి ప్రజలు.. ప్రతి ఒక ఉప ఎన్నికలోనూ, జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. చివరికి కుప్పం మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ టీడీపీని చిత్తుగా ఓడించారని ఎద్దేవా చేశారు. దీంతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బాయ్ బాయ్ బాబు అని చెప్పారని అన్నారు. ఇదేం ఖర్మరా బాబూ అని చంద్రబాబు తలపట్టుకొని, ఆయన పుత్రుడు, దత్త పుత్రుడు కూడా ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారని విమర్శలు చేశారు. 1995లో కూడా ఎన్టీఆర్ వెన్నుపోటుకు గురైన సమయంలో ఇదేం ఖర్మరా బాబూ అనుకొని ఉంటారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారు మన రాజకీయాల్లో ఉండడం ఇదేం ఖర్మరా బాబూ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.

తాను రాజకీయాల్లో ఉండాలంటే, తర్వాతి అసెంబ్లీకి వెళ్లాలంటే.. గెలిపించాలని అవే తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు అన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. తాను కుప్పంలోనే గెలవలేనన్న భయం, నిరాశ చంద్రబాబుకు ఉందని, ప్రతి మాటలోనూ, చేష్టలోనూ భయం కనిపిస్తోందని అన్నారు.

" ఇలాంటి మనుషుల్ని చూసినప్పుడు సెల్ ఫోన్ టవరెక్కి దూకుతామని బెదిరించేవాళ్లు, పురుగులమందు తాగుతామనేవాళ్లు, రైలు కింద తలపెడతామనే వాళ్లు గుర్తుకొస్తున్నారు. అధికార భగ్న ప్రేమికుడు ఇదే రీతిలో రాష్ట్ర ప్రజల్ని బెదిరిస్తున్నారు. ఏ మంచి చేయని వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలో చంద్రబాబు చెప్పరు. ఇలాంటి వారికి ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. కేవలం వాళ్లకి సంబంధించిన నాలుగు పేపర్లు, నాలుగు ఛానెళ్లతో కలిసి దోచుకో, పంచుకో తినుకో అని ఒప్పందం చేసుకుంటారు "
-సీఎం జగన్

ఇన్ని శంకుస్థాపనలు ఇదే తొలిసారి

News Reels

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నరసాపురం పురపాలక సంఘం మంచి నీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎప్పుడూ జరగలేదని జగన్ అన్నారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం ఇదే తొలిసారని అన్నారు. 

Published at : 21 Nov 2022 01:40 PM (IST) Tags: CM Jagan Chandrababu Jagan comments Jagan Narasapuram tour Jagan Kakinada news

సంబంధిత కథనాలు

Fishermen Boat Racing : కోనసీమలో బోట్ రేసింగ్, చేపల వేట హద్దుల కోసం జాలర్లు పోటాపోటీ!

Fishermen Boat Racing : కోనసీమలో బోట్ రేసింగ్, చేపల వేట హద్దుల కోసం జాలర్లు పోటాపోటీ!

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Gadapa Gdapaku Prbhuthvam: మంత్రి వేణుకు చేదు అనుభవం- సమస్యలపై నిలదీసిన గ్రామస్థులు!

Gadapa Gdapaku Prbhuthvam: మంత్రి వేణుకు చేదు అనుభవం- సమస్యలపై నిలదీసిన గ్రామస్థులు!

AP News Developments Today: ఏపీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం- విజయవాడలో హాజరుకానున్న సీఎం జగన్

AP News Developments Today: ఏపీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం- విజయవాడలో హాజరుకానున్న సీఎం జగన్

వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లియర్‌- ఎమ్మిగనూరు నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ !

వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లియర్‌- ఎమ్మిగనూరు నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ !

టాప్ స్టోరీస్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్

Gujarat Riots:  అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

America Area 51 : ఏలియన్స్‌ను కిడ్నాప్‌ చేసిన అమెరికా, ఏరియా 51 మిస్టరీ ఏంటి?

America Area 51 : ఏలియన్స్‌ను కిడ్నాప్‌ చేసిన అమెరికా, ఏరియా 51 మిస్టరీ ఏంటి?

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!