Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు.
చంద్రబాబు అనుభవం అంత వయస్సు సీఎం జగన్ కు లేదని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రాజమహేంద్రవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరుని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.... దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఆర్థిక నేరాలు చేసి బెయిల్ పై ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. కుంభకోణాలు చేయడం జగన్ కు అలవాటేమో కానీ చంద్రబాబుకు కాదన్నారు. ఆయనను తప్పుడు కేసుల్లో ఇరికించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ప్రజల మద్దతు ఉన్నంతవరకు టీడీపీ పార్టీని ఇవ్వరు ఏమి చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా చంద్రబాబును జైల్లో పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఎంతమందిని అరెస్టు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీని ఏమి చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు.
ఏ తప్పు చేయని మా నాయకుడు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి, అసౌకర్యాల నడుమ, మానసిక క్షోభకు గురి చేస్తూ జైల్లో నిర్బంధించారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ఆయన సతీమణి భువనేశ్వరి తన భర్త పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమె పట్ల హేళనగా మాట్లాడుతున్నారు. కొడాలి నాని మహిళల పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. నందమూరి, నారావారి కుటుంబాల జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టం. కాస్కోండి మీ రోజులు దగ్గరపడ్డాయి. చంద్రబాబు అరెస్టుతో నేడు మహిళలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఫ్యాక్షన్‌ను వ్యతిరేకించిన నాయకుడు చంద్రబాబు.'' అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
ప్రజా పరిరక్షణ కోసం, సైకో పాలన నుంచి ప్రజలను విముక్తి కలిగించేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా వైసిపి చేయాలనుకుంటుందని మండిపడ్డారు. చంద్రబాబు బయట ఉంటే తాము అధికారంలోకి రాలేము అన్న ఆలోచనలతో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రతిపక్షాలను అంతం చేయాలని జగన్ నిర్ణయించుకున్నారని చంద్రబాబు కుటుంబాన్ని అణిచివేయాలని అనుకుంటున్నారని విమర్శించారు. లోకేష్, బ్రహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణ లపై సైతం కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను లేకుండా చేసేందుకు వైసిపి ప్రభుత్వం చూస్తుందని అన్నారు. వైసిపి పాలనకు వ్యతిరేకంగా అంతా కలిసి పోరాటం చేసేందుకు ముందుకు కదులుతున్నామని వెల్లడించారు. వైసిపి అక్రమ పాలనపై కలసి పోరాడుతామని బైరెడ్డి తెలిపారు.
చంద్రబాబు బయట ఉంటే అధికారంలోకి రాలేము అని దుర్బుద్ధి జగన్ మోహన్ రెడ్డికి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రావడం కష్టమని ప్రతి సర్వే చెబుతుందని వెల్లడించారు. ఇక ప్రస్తుతం టీడీపీ, జనసేన కలిసిన తర్వాత మరి ఎదురు లేదు అని సర్వేలు చెబుతున్నాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి దోపిడీని, అవినీతిని ప్రతి పార్టీ వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రతి ఒక్కరు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం జగన్ బూట్ల కింద నలిగిపోయిందని ఆరోపించారు.