Andhra Pradesh Crime News: బీటెక్ కుర్రాళ్లు యూట్యూబ్ చూసి బుల్లెట్ లాక్ సిస్టమ్ క్రాక్ చేశారు- 5 నెలల్లో 16 వాహనాలు కొట్టేశారు; చివరకు...
Andhra Pradesh Crime News: బుల్లెట్‌లో చూసి ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన వాళ్లను చూశాం. కానీ ఓ ఆరుగురు యువకులు మాత్రం చోరీలకు తెగబడ్డారు. ఇప్పుడు జైలుపాలయ్యారు

Andhra Pradesh Crime News:యూట్యూబ్ చాలా మంది జీవితాలను మార్చేస్తోంది. రీల్స్, కంటెంట్ క్రియేషన్‌తో రాత్రి రాత్రికే ఫేమస్ అయిపోయిన వారిని ఇప్పటి వరకు చూశాం. కానీ ఈ బ్యాచ్ మాత్రం అంతకు మించి యూట్యూబ్ చూసి కంటెంట్ క్రియేషన్ పక్కన పెట్టి చోరీలు చేయడం మొదలు పెట్టారు. చివరకు పోలీసులకు చిక్కి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు.
వారంతా బీటెక్ చదువుతున్న కుర్రాళ్లు. అందరి మాదిరిగానే యూట్యాబ్‌లో రీల్స్, వీడియోలు చూశారు. అక్కడి నుంచి వాళ్లకు ఓ కన్నింగ్ ఐడియా వచ్చింది. బైక్‌ల తాళాలు సింపుల్‌గా ఎలాంటి తీయాలో యూట్యూబ్‌లో చూసి క్రాక్ చేశారు. అనుకున్నట్టుగానే ఆ పని నెర్చుకున్నారు. అంతే రెచ్చిపోయారు.
ఈ మధ్య కాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో తరచూ బుల్లెట్ వాహనాలు పోతున్న విషయంపై పోలీసులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. కేవలం బుల్లెట్ వాహనాలు పోవడంతో అంతా ఆశ్ఛర్యపోతున్నారు. సరే చోరీకి గురైన వాహనాలు వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా తిరుగుతున్నాయోమో అని చూస్తే అలాంటిది లేదు.
మొత్తానికి బాపట్ల పోలీసులు నిఘా పెట్టి అద్దంకిలో ఓ ప్రాంతంలో గుంపుగా ఉన్న బుల్లెట్ వాహనాలు చూశారు. నిఘా పెట్టిన పోలీసులకు బీటెక్ బ్యాచ్ తగిలింది. ఆరుగురు యువకులు గ్యాంగ్‌గా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్టు తేలింది. యూట్యూబ్‌లో బుల్లెట్ వాహనాల తాళాలు ఎలా క్రాక్ చేయాలో నేర్చుకున్నారు. అప్పటి నుంచి దాదాపు 16 బుల్లెట్‌లు చోరీ చేశారు. వాటిని వెంటనే అమ్మితే పోలీసలుకు దొరికిపోతామని ఎవరికీ అనుమానం రాని ప్రాంతంలో పార్కింగ్ చేశారు. అక్కడి నుంచి అమ్మడానికి ప్రయత్నాలు చేశారు. ఇంతలో పోలీసులకు చిక్కారు.
నిందితుల్లో ఆరుగులు ఒంగోలులో బీటెక్ చేస్తుంటే ఒకరు కందుకూరులో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. కేవలం మార్చిలో ఈ చోరీలు మొదలు పెట్టారు. ఈ ఐదు నెలల్లోనే 16 బుల్లెట్‌కు కొట్టేశారు. వీటి విలువ ఇరవై ఐదు లక్షలకు పైగానే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.





















