Dadisetti Raja: పవన్ కళ్యాణ్ ది పూటకో మాట, మంచి సైక్రియాటిస్ట్‌కు చూపించాలి!- మంత్రి దాడిశెట్టి రాజా
బాబా అవతారమెత్తిన పవన్ కళ్యాణ్ పాపం పసివాడుగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడని, ఓ మంచి సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తే మంచిదని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు.

పవన్ కళ్యాణ్ బాబా అవతారమెత్తి రకరకాలు గా మాట్లాడతున్నారు.. పాపం పసివాడు పవన్ కళ్యాణ్ ను ఓ సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తే మంచిదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై సైటైర్లు వేశారు. ఓ లారీ ఎక్కి తిరుగుతున్నాడని, బహిరంగ సభలకు నియోజకవర్గానికి వచ్చి పట్టుమని 1000 మంది కూడా రాని పరిస్థితి ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమా గురించి ఊహించుకుంటారు. మరోసారి భరత్ అనే నేను సినిమా గురించి కలలు కంటాడు అన్నారు. ఆ కలలో జగన్మోహన్‌రెడ్డి గుర్తొస్తే ఆ కలంతా చెదిరిపోయి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడని, నన్ను కక్షకట్టి ఓడించారని చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. నువ్వు ఏం అవుదామనుకుంటున్నావో నీకే ఏమాత్రమైనా క్లారిటీ ఉందా అంటూ జనసేనానిపై విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ పెట్టిన రెండు సభలు కూడా ఫెయిల్ అయ్యాయి.. అయిదు నియోజకవర్గాలు కలిపి పెట్టిన నీ సభకు అయిదు వేలు కూడా లేరు. ఇరుకు సందుల్లో సభల్లో పెడుతున్నావన్నారు. ఏం మాట్లాడాలో తెలియక, ప్రజలకు ఏం చేయనున్నారో చెప్పలేక పవన్ కళ్యాణ్ అభాసు పాలవుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు.
ప్రజల గుండెల్లో జగన్మోహన్‌రెడ్డి...
రాష్ట్ర ప్రజలు గుండెల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని.. మీ కుటుంబానికి మంచి చేస్తే నాకు ఓటు వేయండని జగన్ ధైర్యంగా చెబుతున్నారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా అలా చెప్పగలడా అన్నారు.. అది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంటే అన్నారు. అకస్మాత్తుగా ఓ సారి కులంమీద, మరోసారి మతం మీద ప్రేమ గుర్తుకు వస్తుంది. అమరావతిలో 45 గుళ్లు కూలగొడితే అప్పుడు ఏం చేశావని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు గజదొంగల్లా విలువైన భూములు కొట్టేస్తే ఒక్క మాటకూడా మాట్లాడలేదు.. చంద్రబాబు, నువ్వు, బీజేపీ కలిసి వేసుకున్న మ్యానిఫెస్టో గురించి ఒక్క మాట్లాడ కూడా మాట్లాడలేదు. చంద్రబాబు కూలగొట్టిన గుడిలన్నీ ముఖ్యమంత్రి జగన్ కట్టిస్తున్నారన్నారు.
అసలు ఏం అవ్వాలో క్లారిటీ అయినా ఉందా..
వపన్ కళ్యాణ్ సీఎం అయిపోవాలని కలలు కంటున్నారని, ఒకసారి సీఎం అయిపోవాలని డిసైడ్ అయిపోవాలనుకుంటున్నావు.. మరోసారి ఎమ్మెల్యేగా అయినా గెలిపించాలని అడుగుతున్నావని, కనీసం నిన్ను ఎమ్మెల్యేగా గెలుపించే విషయంలో కూడా క్లారిటీ లేదన్నారు. ఎమ్మెల్యే నెగ్గటానికి ప్రజల్లో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాలి.. చాలామంది ఇండిపెండెంట్‌గా గెలిచిన చరిత్ర ఉందని, పవన్ కల్యాణ్ సభ పెట్టిన పిఠాపురం నుంచే ఇండిపెండెంట్‌గా గెలిచారన్నారు. నవనీత్ కౌర్ లాంటి వాళ్లు ఏకంగా ఎంపీగా కూడా ఇండిపెండెంట్‌గా గెలిచారని, అయితే నీ పరిస్థితి ఏంటన్నది గమనించుకోవాలన్నారు.
వ్యక్తిగతమైన గొడవలను ప్రభుత్వంపై రుద్దుతున్నారు..
పవన్ కళ్యాణ్ బాబాకు శాంతి భద్రతలపై తెగ మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో వ్యక్తిగతమైన గొడవలను ప్రభుత్వంపై రుద్దుతున్నారు. శ్రీకాకుళంలో నంది విగ్రహం తొలగించింది పచ్చమీడియా ప్రతినిధి అన్నాని, రామండ్రిలో టీడీపీ నాయకుడే విగ్రహాన్ని ధ్వంసం చేశాడని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని దోచుకున్నారు. మచిలీపట్నంలో పేర్ని నాని చెప్పులు, బట్టలు దొబ్బేసి అవి ఇక్కడ వేసుకుని తిరుగుతున్నారన్నారు. అమ్మవారి పేరు పెట్టి లారీ ఎక్కి మమ్మల్ని శాపనార్ధాలు పెడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మీ ప్యాకేజీ యజమానికి భయపడి ఊరికే అనవసర మాటలు మాట్లాడుతున్నారన్నారు. కులాలు, మతాల పేరుతో రెచ్చగొడుతున్నాడన్నారు. అమరావతిపై దొంగ ప్రేమ చూపిస్తున్నారన్నారు. అమరావతి కానీ, రాష్ట్రం కానీ చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు గెస్ట్ హౌస్, లాడ్జి లాంటిదని విమర్శించారు.





















