అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Nara Lokesh: మంత్రి లోకేశ్ చొరవతో క్షేమంగా గల్ఫ్ నుంచి ఇంటికి చేరిన కోనసీమ వాసి

Nara Lokesh Saved Virendra Kumar: ఉపాధి కోసం వెళ్లి విదేశాల్లో దుర్భర జీవితం గడుపుతున్న వారికి నేనున్నానంటూ నారా లోకేశ్ భరోసా అందిస్తున్నారు. సౌదీ నుంచి వీరేంద్రను సొంతూరుకు చేర్చారు.

 Nara Lokesh: నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుతున్నానంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ వీరేంద్ర కుమార్ వీడియో  పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో  వీరేంద్ర కుమార్, అతని కుటుంబసభ్యులకు నేనున్నానంటూ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. వీరేంద్రను స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం వీరేంద్ర కుమార్ ను ఇంటికి చేర్చారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుద్దామన్న ఆశతో ఎంతో శ్రమకోర్చి గల్ఫ్‌ వెళ్లి.. ఏజెంట్‌ చేతిలో వీరేంద్ర కుమార్ మోసపోయారు. ప్రభుత్వం, నారా లోకేశ్ చొరవతో ఆయన క్షేమంగా ఇంటికి చేరాడు.

15 రోజులు దుర్భర జీవితం 
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన వీరేంద్రను ఏజెంట్  ఖతర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. 16 నెలల క్రితం ఉపాధి కోసం ఏజెంట్ ద్వారా వీరేంద్ర దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో మరో వ్యక్తికి వీరేంద్రను విక్రయించి హైదరాబాద్ ఏజెంట్ జారుకున్నాడు. దీంతో అప్పటి నుంచి  సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటెల మధ్య ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 15 రోజులు పాటు ఎడారి మధ్యలో, కనీసం తాగేందుకు కూడా నీరు లేక నానావస్థలు పడ్డాడు. తాను సౌదీలో పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి.. తన మిత్రుడికి పంపగా.. అతడు మంత్రి లోకేశ్‌ను ట్యాగ్‌ చేస్తూ ‘ఎక్స్‌’(గతంలో ట్విటర్)లో పోస్ట్‌ చేశాడు. దీంతో స్పందించిన లోకేశ్‌.. వీరేంద్ర కుమార్ ను స్వదేశానికి రప్పించేందుకు సాయం చేశారు.

అక్కడున్న తెలుగు దేశం పార్టీ ఎన్నారై విభాగంతో మాట్లాడి వీరేంద్రను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 26న హైదరాబాద్‌ చేరుకున్న వీరేంద్ర.. సోమవారం తన స్వగ్రామానికి వెళ్లారు. మంత్రి లోకేశ్‌ చొరవతోనే తాను ఇంటికి క్షేమంగా చేరుకోగలిగానని వీరేంద్ర ఆనందం వ్యక్తం చేశాడు. ప్రాణాలతో తిరిగి వస్తానని అనుకోలేదని బాధితుడు వీరేంద్ర తెలిపారు.

 వెంటనే స్పందించిన లోకేశ్ 
నకిలీ ఏజెంట్ ఖతర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి తనను సౌదీలోని ఎడారిలో ఒంటెల కాపరిగా పడేశారని వీరేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను 15రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడ బతకలేకపోతున్నానని వీడియో పోస్ట్ చేశాడు. ఎండకు తట్టుకోలేక తనకు ముక్కులోనుంచి రక్తం కారుతోందని, టాయిలెట్ కూడా రావడం లేదంటూ కన్నీరుపెట్టుకున్నాడు. ఒంటెల మధ్య గుడారాల్లో బతకలేకపోతున్నానని, తాగాడానికి నీరు, తినడానికి తిండి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎలాగైన ఆ నరకం నుంచి కాపాడి స్వదేశానికి తీసుకెళ్లాలని వేడుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో లోకేశ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ధైర్యంగా ఉండాలని, స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. వెంటనే ఎన్​ఆర్​ఐ తెలుగుదేశం విభాగాన్ని మంత్రి  అలర్ట్ చేశారు.

కువైట్ నుంచి ఇంటికొచ్చిన శివ  
 ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చొరవతో తెలుగు కార్మికుడు శివ కువైట్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. తెలుగు కార్మికుడు శివ కువైట్‌లో తను పడుతున్న  కష్టాలపై కన్నీళ్లతో పెట్టిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై లోకేష్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో కువైట్‌ నుంచి శివ కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు.

దుర్గను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు 
 నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఒమన్‌లో చిక్కుకున్న మామిడి దుర్గ అనే మహిళకు సైతం మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. బాధితురాలిని స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకున్నట్లు ప్రకటించారు.  కేంద్రంతో మాట్లాడి దుర్గను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎన్​ఆర్​ఐ విభాగానికి లోకేశ్‌ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు నెలల కిందట ఏజెంట్ల ద్వారా ఒమన్‌ దేశానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయానంటూ దుర్గ ట్విటర్లో వీడియో పోస్ట్‌ చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించి, ఆమెకు భరోసా ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget