అమలాపురంలో కలకలం- మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆత్మహత్యాయత్నం
అమలాపురంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేగింది. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియకపోయినా ఇదే సంచలనంగా మారింది.
డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేగింది. అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆత్మహత్యాయత్నం చర్చనీయాంశంగా మారింది. అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన కిమ్స్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని వైసీపీ లీడర్లు, అమలాపురం మున్సిపల్ కమిషనర్ నాయుడు పరామర్శించారు. ఆయన ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారని మాత్రం ఇంతవరకు తెలియడం లేదు. ఫ్యామిలీ మెంబర్స్‌తోపాటు పార్టీ లీడర్లు కూడా ఈ సంఘటనపై మాట్లాడటం లేదు.
పెరిగిపోతున్న ఆత్మహత్యలు
ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో చాలా మంది సామాన్యులు, వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు లోన్ యాప్‌ల బారిన పడి సూసైడ్ చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్నపల్నాడు జిల్లాలో అప్పుల బాధతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అప్పులు బాధతో దంపతుల ఆత్మహత్య
పిడుగురాళ్లకు చెందిన గోపవరపు వెంకటేశ్వర్లు, అంజనా దేవీ దంపతులు అనుమానాస్పదంగా చనిపోయారు. వారిలో ఒకరు పురుగు మందు కలిపిన అన్నం తిని చనిపోగా మరొకరు ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నారు. వీరు ఇలా ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఎదుకంటే వీరికి ఉన్న ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ఓ రైస్ మిల్లు ఉంది. అయినా సరే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అంత కష్టం ఏమొచ్చిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే మంచి తనంతో మాటలు చెప్పి అప్పులు తీసుకున్న బంధువులు మోసం చేయడంతో మనస్థాపంతోనే గోపవరపు వెంకటేశ్వర్లు దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.
రైస్ మిల్లు నడుపుతూ వడ్డీ వ్యాపారం చేస్తున్న వెంకటేశ్వర్లు
పిడుగురాళ్ల పట్టణానికి చెందిన గోపవరపు వెంకటేశ్వర్లు అంజనాదేవిలు 35 సంవత్సరాల క్రితం వివాహం అయింది, పిడుగురాళ్ల పట్టణంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరూ మగ పిల్లలు . వీఅమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూస్తున్నారు. వెంకటేశ్వర్లు రైస్ మిల్లు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రైస్ మిల్లుతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాయి. ఇతరుల వద్ద తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని ఎక్కువ వడ్డీకి ఇతరులకు ఇస్తూంటాడు. వడ్డీకి ఇచ్చిన వ్యక్తులు డబ్బులు ఇవ్వకుండా ఐపీ పెట్టామని చెబుతూ ఉండటంతో మనస్థాపానికి గురయ్యాడు. ఇలా అప్పులు తీసుకుని డబ్బులు ఎగ్గొట్టిన వారంతా బంధువులే కావడంతో అందర్నీ సంప్రదించారు.
రూ. కోట్లలో అప్పులు తీసుకుని ఐపీ పెట్టిన బంధువులు
కానీ బందువులందరూ తమకు సంబంధం లేదని తప్పించుకున్నారు. దీంతో తాను పూర్తి స్థాయిలో మోసపోయానని మరిఆవేదనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఆ మేరకు వెంకటేశ్వర్లు శనివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తను చనిపోతే తన భార్యను అప్పుల వాళ్లు వేధిస్తారని ముందే భార్యకు అన్నంలో విషయం కలిపి ఇచ్చి ఆమె చనిపోయిన తర్వాత వెంకటేశ్వర్లు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఇంట్లో పని చేయడానికి వచ్చిన పనిమనిషి అనురాధ ఘటన చూచి కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ మధుసూదన్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మోసం చేయడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానం
కరోనా తర్వాత పరిస్థితులు తలకిందులు కావడంతో అప్పులు తీసుకున్న వాళ్లు చెల్లించలేక ఐపీలు పెడుతున్న సందర్భాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ కారణంగా వడ్డీ వ్యాపారాలు చేసే వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ కారణంగా ఇలాంటి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆర్థికంగా చికూచింతా లేకపోయినా .. బంధువులకు ఇతరుల దగ్గర్నుంచి డబ్బులు ఇప్పించడంతో ఈ దంపతులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది.