Akshaya Tritiya Pootharekulu: అక్షయ తృతీయ స్పెషల్ - 24 క్యారెట్ గోల్డ్ నేతి ఆత్రేయపురం పూతరేకులు
Atreyapuram Pootharekulu: ఆత్రేయపురం ఎంట్రన్స్‌లో లొల్ల లాకుల వద్ద కనిపించే చిన్న పూతరేకులు, ఇతర వెరైటీ స్వీట్స్ విక్రయించే షాపు పేరే చాదస్తం.. అదేంటి.. చాదస్తమా.. మరీ చాదస్తంగానూ అనుకుంటున్నారా..
- బంగారంతో పూతరేకులు తయారు చేసిన చాదస్తం షాపు నిర్వాహకులు
Akshaya Tritiya Pootharekulu: గోదారోళ్లు ఏది చేసినా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. సాంప్రదాయమే కాదు.. కాస్త చాదస్తంగానూ చేస్తుంటారంతా.. అందుకే ఈసారి ఏకంగా బంగారంతో పూతరేకులనే తయారు చేశారు. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయే పూతరేకులకు ఫేమస్ ఆత్రేయపురమే కదా. అందుకే ఈస్పెషల్ ఐటెం కూడా ఇక్కడే పురుడు పోసుకుంది. ఆత్రేయపురం ఎంట్రన్స్‌లో లొల్ల లాకుల వద్ద కనిపించే చిన్న పూతరేకులు (Atreyapuram Pootharekulu), ఇతర వెరైటీ స్వీట్స్ విక్రయించే షాపు పేరే చాదస్తం.. అదేంటి.. చాదస్తమా.. మరీ చాదస్తంగానూ అనుకుంటున్నారా.. అదేం కాదు.. నిజంగా పేరే మరి.
24 క్యారెట్ ఎడిబుల్ గోల్డ్ తో పూతరేకులు
ఏదైనా వెరైటీ తయారు చేయాలంటే దానికీ ఓ రోజు ఉండాలి కదా. అందుకే అక్షయ తృతియ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి వచ్చినట్లే అంటారు. అందుకే అదే రోజు కోసం విభిన్నంగా, కొత్తగా 24 క్యారెట్ ఎడిబుల్ గోల్డ్ తో ఈ పూతరేకులు తయారు చేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే వీటిని రూపకల్పన చేశారు. ఇవి కేవలం నాలుగు బాక్సులు మాత్రమే తయారు చేశామని, అయితే మాషాపు వద్దకు వచ్చిన ఓ కష్టమర్ వీటిని చూసి వెంటనే కొనుగోలు చేశారని, ఆయనవేరే వాళ్లకు పరిచయం చేయడంతో వీటికి హైప్ వచ్చిందని షాపు నిర్వాహకుడు చవ్వాకుల సాయిగణేష్ తెలిపారు.
సాధారణ పూతరేకుల ధర 10 రూపాయల నుంచి 50 లేదా 100 వరకు ఉంటుంది.. అయితే ఈ ఎడిబుల్ 24 క్యారెట్ నేతి పూతరేకు ధర రూ.800 అని తెలిపారు. ఇప్పటికే చాలా అర్డర్స్ వస్తున్నాయి.. మళ్లీ నెల నుంచి ఆర్డర్స్ తీసుకుని ఇకపై గోల్డ్ నేతి పూతరేకులు ఆన్‌లైన్‌లోనైనా నేరుగానైనా అందజేస్తామని చెబుతున్నారు సాయిగణేష్. ఆత్రేయపురం వెళ్లే మార్గంలో సరిగ్గా లల్ల లాకుల వద్ద ఉండే చాదస్తం షాపులో ఇవి అందుబాటులో ఉంచుతామని చెబుతున్నారు. ఈ సారి మీరు వెళితే ఒక పూతరేకు అయినా టేస్ట్ చూడండి మరి.. రేటును చూసి మాత్రం భయపడకండి అంటున్నారు తయారీదారులు.
ఇక్కడ ప్రతి ఇంట్లోనూ పూతరేకులు చేయడం అలవాటేనని తెలిపారు. అయితే అందరి కంటే భిన్నంగా చేయాలని భావించగా గోల్డ్ పూతరేకులు చేయాలని డిసైడయ్యారు. కానీ ఆ పూతరేకులు చేసేందుకు ప్రత్యేకమైన రోజు కోసం చూసి అక్షయ తృతీయ నాడు తయారుచేశాం అన్నారు. నెల రోజుల కిందట ప్లాన్ చేసుకున్నా.. పెద్ద ఎత్తున చేయవద్దనుకున్నట్లు సాయిగణేష్ చెప్పారు. కేవలం 4 బాక్సులు మాత్రమే 24 క్యారట్ ఎడిబుల్ నేటి పూతరేకులు చేశారు. అయితే ఒక కస్టమరే ఆ 4 బాక్సులు కొనుగోలు చేశారని తెలిపారు. తీసుకెళ్లిన వ్యక్తి తోటి వాళ్లకు, బంధువులకు చెప్పగా ఇక అది మొదలుకుని తమకు గోల్డ్ పూతరేకులు కావాలని ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. పూతరేకుల ధర రూ.800 ఉండొచ్చు అని, తయారీ మొదలుపెడితే ఫిక్స్ చేసిన ధర వెల్లడిస్తాం.. అయితే వచ్చే నెల నుంచి ఆర్డర్లు తీసుకుని డెలివరీ చేస్తామని వివరించారు.