అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gorantla Butchaiah : వారం రోజుల్లో బ్రిడ్జ్ రిపేర్ పూర్తి చేస్తే నా రెండు చెవులు కోసుకుంటా- ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య

Gorantla Butchaiah : అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు బ్రిడ్జ్ మూసివేశారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

Gorantla Butchaiah : ఈ నెల 17న అమరావతి రైతుల మహాపాదయాత్ర  రాజమండ్రిలో ప్రవేశిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... పాదయాత్ర కొవ్వూరు నుంచి గామన్  బ్రిడ్జ్ మీదుగా కాతేరు చేరుకుంటుందన్నారు. 17వ తేదీ నుంచి మూడు రోజులు రాజమండ్రి సిటీ, రూరల్  నియోజకవర్గాల్లో  పాదయాత్ర సాగుతోందన్నారు. రైతులకు ఘనస్వాగతం పలికి సంఘీభావం తెలపాలని పార్టీ శ్రేణులను కోరుతున్నానన్నారు. రాజమండ్రి బ్రిడ్జ్ పై మరమ్మత్తులు చేస్తున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో  బ్రిడ్జ్ రిపేర్  పూర్తి చేస్తే  తన రెండు చెవులు  కోసి ఇస్తానన్నారు. మంత్రులది నోరా పత్తి కట్టా అంటూ మండిపడ్డారు. సీఎం జగన్ తలకిందలుగా తపస్సు చేసినా మూడు రాజధానులు ఏర్పాటు కావన్నారు.  

డీజీపీ అధికార పార్టీ తొత్తు 

"రైతులు ఎక్కడా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంలేదు. ప్రభుత్వానికి భూములిచ్చి సర్వం కోల్పోయాము అనే ఆవేదనలో దైవ దర్శనానికి వెళ్తున్నారు. మంత్రులు, స్పీకర్ ఎలా మాట్లాడుతున్నారో చూశాం. వైసీపీ నేతలు అమరావతి రైతులపై యుద్ధం ప్రకటించారు. రెచ్చగొట్టేలా మంత్రులు మాట్లాడుతున్నారు. వీరితో సీఎం జగన్ మాట్లాడిస్తున్నారు. మంత్రులు బరితెగించి ప్రజలను రెచ్చగొడుతున్నారు. అయినా ప్రజలు అమరావతి రైతులు బాసటగా నిలుస్తున్నారు. దాడులను నిరోధించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంతంగా నిరసన చేసుకోవచ్చని డీజీపీ అంటున్నారు. ప్రశాంతంగా అరసవెల్లి యాత్రకు వెళ్తామంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు. రోడ్ల మరమ్మత్తుల పేరిట అర్థాంతరంగా బ్రిడ్జ్ మూసివేశారు. రైతుల పాదయాత్రను ఆపేందుకు బ్రిడ్జ్ మూసివేశారు."- గోరంట్ల బుచ్చయ్య 

అమరావతి రైతులకు నోటీసులు 
 
కొవ్వూరు నుంచి సాగే అమరావతి రైతుల మహా పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ ఇవ్వాలని జేఏసీ నేతలకు స్థానిక పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. గోదావరి వంతెన మీదుగా పాదయాత్ర ఎలా సాగుతోందని తెలపాలన్నారు. పాదయాత్ర వెళ్లే దారిలో హోంమంత్రి సమావేశం ఉందని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులను తీసుకోడానికి అమరావతి జేఏసీ నేతలు తిరస్కరించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.  

మరో మార్గంలో పాదయాత్ర 

అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 34వ రోజు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముగిసింది. ఆదివారం పాదయాత్రకు విరామం ప్రకటించారు జేఏసీ నేతలు. సోమవారం పాదయాత్ర కొవ్వూరు నుంచి గోదావరి నాలుగో వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోని మల్లయ్యపేటకు చేరుకోనుందని తెలిపారు. రాజమండ్రి రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జిపై ఆంక్షల వల్ల అమరావతి రైతుల యాత్ర మరో మార్గంలోకి మార్చారు. అయితే కొత్తగా వెళ్లే మార్గంలో ఎంత మందితో యాత్ర సాగుతోందో స్పష్టత ఇవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నించారు. నోటీసులు తీసుకునేందుకు అమరావతి జేఏసీ నేతలు తిరస్కరించారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు మరో మారు జేఏసీ కో-కన్వీనర్‌ తిరుపతిరావును నోటీసులు తీసుకోమని ఒత్తిడి తెచ్చారు. 

సీఐ కాళ్లపై పడిన జేఏసీ నేతలు   

నోటీసుల విషయంలో స్పందించిన జేఏసీ నేతలు తాము న్యాయస్థానం అనుమతితో పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఏమైనా చెప్పదల్చుకుంటే న్యాయస్థానం ద్వారా చెప్పాలన్నారు. అయినా పోలీసులు నోటీసులు తీసుకోవాలని జేఏసీ నేతలను ఒత్తిడి చేయడంతో యాత్రను అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారని, ఇంకా ఇబ్బంది పెట్టొద్దంటూ జేఏసీ నేతలు కొవ్వూరు టౌన్‌ సీఐ రవికుమార్‌ కాళ్లపై పడబోయారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Embed widget