అన్వేషించండి

Ex MP Harsha Kumar : ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి కూడా అగ్రవర్ణాల వారికే ఇవ్వండి, అధిష్టానానికి మాజీ ఎంపీ హర్షకుమార్ లేఖ

Ex MP Harsha Kumar : మాజీ ఎంపీ హర్షకుమార్ ఏఐసీసీ కేటాయించిన పదవిని తిరస్కరిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు.

Ex MP Harsha Kumar : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ ఏఐసీసీ ఇచ్చిన పదవిని తిరస్కరించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి తన అభిప్రాయాన్ని ఈ-మెయిల్ ద్వారా తెలిపారు.  కాంగ్రెస్ అధిష్టానం ఏపీ పీసీసీలో భారీ మార్పులు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఓ ప్రకటన చేసింది. అయితే ఏపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా హర్ష కుమార్ ను నియమించింది. ఈ పదవిని తిరస్కరిస్తూ హర్షకుమార్ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు.  తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని హర్షకుమార్ తెలిపారు. ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు అగ్ర కులాల వారే ఉన్నారన్నారు.  కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష పదవిని కూడా అగ్ర కులానికే కట్టబెట్టిందని లేఖలో తెలిపారు. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని కూడా అగ్రవర్ణాల వారికి ఇస్తే కాంగ్రెస్ బలపడుతుందని హర్షకుమార్ లేఖలో తెలిపారు. అయితే ఏపీ పీసీసీ పదవి ఆశించిన హర్షకుమార్ ఆ పదవి రాకపోవడంతో ఆగ్రహంతో ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని తిరస్కరించారని తెలుస్తోంది. 

కాంగ్రెస్ పార్టీలో అందరికీ గుర్తింపు ఉంటుంది-గిడుగు రుద్రరాజు 

ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చెయ్యడమే తన లక్ష్యం అంటున్నారు ఏపీ పీసీసీ కొత్త ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ పదవి రావడానికి తన విధేయతే కారణం అంటున్నారు.  కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేతలను కలుపుకుని ముందుకు వెళతానంటున్న పార్టీ నూతన అధ్యక్షుడు పార్టీయే తన కులం, గోత్రం అంటున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళతానన్నారు. ప్రజా సమస్యలు, విభజన హామీలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ గుర్తింపు ఉంటుందని, ముఖ్యంగా కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్‌గా, ఎమ్మెల్సీగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం తనకు లభించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందన్న ఆయన.. పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు మంచి ఆదరణ వచ్చిందన్నారు. పొత్తుల విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా నడుచుకుంటామని గిడుగు రుద్రరాజు చెప్పారు. 

ఏపీ పీసీసీ ప్రక్షాళన 

 ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో భారీ మార్పులు జరిగాయి. కొత్త పీసీసీ చీఫ్‌తో పాటు కొన్ని కమిటీలను సైతం నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పీసీసీ చీఫ్ పనితీరుపై అసంతృప్తిగా ఏఐసీసీ శైలజానాథ్ కు షాకిచ్చింది. ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తూ గిడుగు రుద్రరాజును రాష్ట్ర కాంగ్రెస్ బాస్ నియమించారు. 18 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. 33 మందితో కో ఆర్డినేషన్‌ కమిటీని ఏఐసీసీ నియమించింది. 

ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ 

  • మస్తాన్ వలి
  • జంగా గౌతమ్
  • సుంకర పద్మశ్రీ
  • రాకేశ్‌ రెడ్డి

ఏఐసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ (కార్యక్రమాల అమలు కమిటీ) ఛైర్మన్ గా మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజును నియమించారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ హర్షకుమార్‌ నియమితులయ్యారు. మీడియా, సామాజిక మాధ్యమాల కమిటీ చైర్మన్ గా ఎన్ తులసిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget