అన్వేషించండి

Weather Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు, అక్కడ వడగండ్ల వానలు

Rains In AP Telanagana: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Rains In Telanagana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. ఏపీలో గత రెండు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. 

ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా చిరు జల్లులు కురవనున్నాయి. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి), పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. కొన్ని చోట్ల మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జనవరి 14 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సైతం వర్షాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరు కురవనున్నాయి. దీంతో ఈ జిల్లాలకు సైతం వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిన ప్రాంతాల్లో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లోనూ మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన  వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రైతులు తమ ధాన్యం, పంట ఉత్పత్తులను నీటి పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఏపీలోని రాయలసీమలో నేడు తేలిక పాటి జల్లు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. జనవరి 14 వరకు రాయలసీమకు వర్ష సూచన ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సీమ ప్రాంతానికి ఎలాంటి అలర్ట్ జారీ కాలేదు. ఇక్కడ వర్షాల ప్రభావం అంతగా ఉండదని అంచనా వేశారు.

తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో గత మూడు రోజుల నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనవరి 14 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వర్షం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Also Read: Viral News: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి! 

Also Read: Horoscope Today 12th January 2022: ఈ రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే... మీ రాశి ఫలితం

Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ozempic Launched in India: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Ozempic Launched in India: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
AP Minister Vasamsetti Subhash : మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
New MG Hector : లాంచ్‌కు ముందే హైప్‌ పెంచేస్తున్న న్యూ MG హెక్టర్ ! సోషల్ మీడియాలో కొత్త అప్డేట్ వచ్చేసింది!
లాంచ్‌కు ముందే హైప్‌ పెంచేస్తున్న న్యూ MG హెక్టర్ ! సోషల్ మీడియాలో కొత్త అప్డేట్ వచ్చేసింది!
Embed widget